breaking news
Dee lands notification
-
సంపూర్ణ హక్కుతో నిశ్చింత
‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకం(జేఎస్‌జీహెచ్‌పీ) కింద గృహ నిర్మాణ సంస్థ సహకారంతో ఇళ్లు నిర్మించుకున్న లక్షల మంది పేదలకు భారీ లబ్ధి చేకూరుతోంది. పేదల ఆస్తుల విలువ పెరగడంతో పాటు పూర్తి భద్రత దక్కుతోంది. పథకం కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకూ నిర్మించిన ఇళ్లకు గృహ నిర్మాణ సంస్థ రుణంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పిస్తున్న విషయం తెలిసిందే. అత్యధికంగా పొజిషన్ సర్టిఫికెట్స్ గృహ నిర్మాణ సంస్థ సహకారంతో ఇళ్లు నిర్మించుకున్న పేదల్లో పొజిషన్ సర్టిఫికెట్, డీ పట్టాదారులే ఎక్కువ మంది ఉన్నారు. గృహ నిర్మాణ సంస్థ వద్ద ఉన్న 51.8 లక్షల మంది వివరాలను మునిసిపాలిటీలు/పంచాయతీలకు బదిలీ చేసింది. వీరిలో 45.5 లక్షల మంది వివరాలను గ్రామ/వార్డు సచివాలయాలకు ట్యాగ్ చేశారు. వలంటీర్లు, మునిసిపల్, రెవెన్యూ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి ఇళ్లలో నివసిస్తున్న వారి వివరాలు, స్థల స్వభావాన్ని గుర్తిస్తున్నారు. 76 శాతం మందికి పొజిషన్ సర్టిఫికెట్లు, 20 శాతం మందికి డీ పట్టాలుండగా కేవలం 4 శాతం మంది మాత్రమే రిజిస్టర్డ్ స్థలాలు కలిగిన వారున్నట్లు వెల్లడైంది. గతంలో వడ్డీ మాఫీలు మాత్రమే గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకున్న వారికి గత ప్రభుత్వాలు వన్‌టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్) కింద వడ్డీల్లో మాత్రమే రాయితీ ఇస్తూ వచ్చాయి. రాయితీ పోనూ రుణం చెల్లించిన వారికి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చి తనఖాలో ఉన్న ధ్రువపత్రాలు విడుదల చేశారు. ఇప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్ రూపంలో అసలు, వడ్డీ రెండిటికి రాయితీ ఇవ్వడంతో పాటు పేదలకు ఆస్తులపై పూర్తి యాజమాన్య హక్కుల కల్పనకు శ్రీకారం చుట్టడం గమనార్హం. రిజిస్ట్రేషన్ చార్జీలు, ఫీజులు లేకుండా యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా పేదలకు భారీ ఊరట లభించనుంది. సాధారణంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లలో విలువపై 7.5 శాతం ఫీజులు, చార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. ఇప్పుడు అవేవీ లేకుండా రుణగ్రహీతలు గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, మునిసిపాల్టీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు చెల్లిస్తే స్థలాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ ధ్రువపత్రం జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు ప్రయోజనాలు గృహ నిర్మాణ సంస్థ సహకారంతో రుణాలు తీసుకున్న వారంతా రోజువారీ కూలీలు, చిరువ్యాపారులు, ఇతర పనులకు వెళ్తూ పొట్టపోసుకునేవారే. పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో డబ్బు అవసరమై బ్యాంకులకు వెళితే రుణాలు అందక అవస్థలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు పూర్తి యాజమాన్య హక్కులు సంక్రమించడం వల్ల ఆస్తులను తనఖా పెడితే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. డీ పట్టా, పొజిషన్ సర్టిఫికెట్ స్థలాలకు మార్కెట్లో విలువ తక్కువగా ఉంటుంది. రిజిస్టర్ ఆస్తులతో పోలిస్తే ప్రాంతాలను బట్టి 20 నుంచి 50 శాతానికిపైగా విలువ తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ వ్యత్యాసం లేకుండా ఆస్తుల విలువ పెరుగుతుంది. డీ పట్టా, పొజిషన్ సర్టిఫికెట్లను వారసుల పేర్లపై బదలాయించడానికి ఆస్కారం ఉండదు. ప్రభుత్వం జారీ చేసే విక్రయపత్రం ద్వారా ఆస్తులను వారసుల పేర్లపై బదలాయించుకోవడంతో పాటు ఇతరులకు అమ్మడానికి హక్కులు లభించనున్నాయి. అమాయకులైన పేదలను మోసగించి తప్పుడు పత్రాలతో కబ్జాలకు పాల్పడే ఆస్కారం లేకుండా ఆస్తులకు పూర్తి భద్రత లభిస్తుంది. మా ఆస్తికి మరింత విలువ నా భర్త ముఠా కూలీ. డీ పట్టా స్థలంలో 2004–2008 మధ్య ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహ నిర్మాణ సంస్థ రుణంతో ఇల్లు నిర్మించుకున్నాం. వడ్డీతో కలిపి రుణం సుమారు రూ.40 వేలకు చేరుకుంది. ఇటీవల వలంటీర్, సచివాలయ సిబ్బంది మా ఇంటికి వచ్చి వివరాలు సేకరించారు. రూ.15 వేలు చెల్లిస్తే ఆస్తిపై పూర్తి యాజమాన్య హక్కులు వస్తాయని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే హక్కు పత్రం ద్వారా వారసులకు ఆస్తి బదలాయించడంతో పాటు ఇతరులకు అమ్ముకోవచ్చని చెప్పారు. యాజమాన్య హక్కులు కల్పిస్తే మా ఆస్తికి విలువ పెరుగుతుంది. మాకు బ్యాంక్ రుణాలు మంజూరు అవుతాయి. చాలా సంతోషంగా ఉంది. – మర్రి ప్రసన్నలక్ష్మి, తెనాలి, గుంటూరు జిల్లా -
నీతికి నీళ్లు
అటకెక్కిన ‘పారదర్శక పాలన’ ముఖ్యమంత్రితో పాటు మంత్రులపై భూ అవినీతి ఆరోపణలు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొటున్న డీకేశీ, మహదేవ ప్రసాద్, ఖమరుల్ ఇస్లాం తాజాగా ఆ జాబితాలో చేరిన దినేష్ గుండూరావు పారదర్శక పాలన అందిస్తాం .. క్లీన్ ఇమేజ్ ఉన్న వారికే మంత్రి వర్గంలో చోటిస్తాం... అని ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఆ వాగ్దానాలను పక్కన పెట్టింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా మంత్రులు కూడా భూముల డీనోటిఫికేషన్, భూముల కబ్జా, ఇసుక అక్రమ రవాణా.. ఇలా అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావు కూడా ఆ జాబితాలో చేరారు. బెంగళూరు : కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సారధిగా ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం ఆర్కావతి లే అవుట్‌లోని బీడీఏ స్థలాల డీనోటిఫికేషన్‌కు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి వర్గంలో భూ అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్ మొదటి స్థానంలో ఉన్నారు. బెంగళూరులోని బెన్నిగానహళ్లిలో నాలుగు ఎకరాల భూముల డీనోటిఫికేషన్ పాల్పడ్డారనే ఆరోపణలపై ఇప్పటికే లోకాయుక్త విచారణ కొనసాగుతోంది. అంతేకాక బెంగళూరు-మైసూరు ఇన్ఫ్రాస్టక్చర్ కారిడార్‌లో అక్రమాలు, అక్రమ మైనింగ్ వంటి అనేక ఆరోపణలు డీకే శివకుమార్ ఎదుర్కొంటున్నారు. ఇక రాష్ట్ర సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ తనకు సొంత భూములు లేవని కర్ణాటక హౌసింగ్ బోర్డ్‌కు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను అందజేసి చామరాజనగరలో భూములను సొంతం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై లోకాయుక్త పోలీసులు విచారణ చేపట్టారు. మహదేవ ప్రసాద్‌కు మైసూరులో సొంత భూములున్నాయని లోకాయుక్త పోలీసుల విచారణలో తేలింది. ఇదే విషయాన్ని పేర్కొంటూ లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 30న మైసూరు జిల్లా కోర్టుకు నివేదికను అందజేశారు. ఇక రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఖమరుల్ ఇస్లాం సైతం వక్ఫ్ బోర్డ్ ఆస్తుల ఆక్రమణకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా గుండూరావు భూ అవినీతికి పాల్పడిన మంత్రుల జాబితాలో తాజాగా రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావు సైతం చేశారు. యలహంక ప్రాంతంలోని నవరత్న అగ్రహార వద్ద 10.9 ఎకరాల ప్రభుత్వ భూమిని మంత్రి దినేష్ గుండూరావు ఆయన కుటుంబ సభ్యులు అక్రమంగా ఆక్రమించుకున్నారని యలహంక తహసీల్దార్ బాళప్ప లోకాయుక్తకు నివేదిక అందజేసిన విషయం తెలిసిందే. దీంతో పారదర్శక పాలన నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూ బకాసురులు, అవినీతి పరులతోనే మంత్రి వర్గాన్ని నింపుకుందని ప్రతిపక్ష బీజేపీ విమర్శిస్తోంది. అంతేకాక కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అసమర్థతపై పోరాటానికి సన్నద్ధమవుతున్నట్లు హెచ్చరికలు సైతం జారీచేసింది. కాగా త్వరలో జరగనున్న మంత్రి వర్గ పునర్వవస్థీకరణలో భూ అవినీతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉద్వాసన పలకుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.