breaking news
debauchery in party
-
మంగినపూడి బీచ్‌లో విచ్చలవిడిగా వ్యభిచారం
కోనేరు సెంటర్: పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన మంగినపూడి బీచ్ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మచిలీపట్నంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి యువతీయువకులు నిత్యం బీచ్ సందర్శనకు వచ్చి తమ రాసలీలలు సాగిస్తున్నారు. స్థానికంగా ఉన్న రిసార్ట్లు ఉపయోగపడుతుండటంతో యువతీ, యువకులతో పాటు వివాహేతేర సంబంధాలు నెరపే జంటలు, అచ్చంగా వ్యభిచారం చేసే మహిళలు నిత్యం పదుల సంఖ్యలో రిసార్ట్‌లకు చేరుతున్నారు. బందరు రూరల్ పోలీసులు బుధవారం రిసార్ట్‌పై చేసిన దాడిలో అనేక జంటలు పోలీసులకు చిక్కాయి. రిసార్ట్ నడిపే వ్యక్తి మచిలీపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు రూంలను గంటల లెక్కన అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గంటకు రూ. 1000 చొప్పున వసూలు చేస్తూ ఈ విధమైన నిర్వాకానికి పూనుకుంటున్నట్లు చెబుతున్నారు. కచ్చితమైన సమాచారంతో... రిసార్ట్‌లో నిర్వాకంపై కచ్చితమైన సమాచారంతోనే బందరు రూరల్ ఎస్సై కె వై దాస్ సిబ్బందితో కలిసి మెరుపుదాడి చేశారు. పోలీసులు రిసార్ట్‌పై దాడి చేసిన విషయాన్ని గమనించిన కొన్ని జంటలు తోటల్లోకి పరుగులు తీయగా మరి కొందరు రూంలలోని బాత్రూమ్లలోకి వెళ్లి దాక్కున్నట్లు తెలిసింది. రూమ్‌లలో కొన్ని కుటుంబాలు సైతం ఉండటంతో విషయం అర్థమైన పోలీసులు వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వివరాలు సేకరించి పంపించారు. అనుమానాస్పదంగా చిక్కిన ఎనిమిది జంటలను పోలీసు జీపులో బందరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులకు చిక్కిన వారిలో కొంత మంది ప్రముఖులు, మరి కొందరు ప్రజాప్రతినిధుల వద్ద పనిచేస్తున్న వారు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
మన పార్టీలో చాలామంది కీచకులు: ఎమ్మెల్యే లేఖాస్త్రం
ఆమ్ ఆద్మీ పార్టీలో ఇంకా చాలామంది కీచకులు ఉన్నారట. తనపై మాజీ మంత్రి సందీప్ కుమార్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడం, ఆయనను పోలీసులు అరెస్టు చేయడం వంటి పరిణామాలు జరిగిన తర్వాత.. అదే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తమ పార్టీలోని కీచకుల విషయాన్ని బయటపెట్టారు. అత్యవసరంగా నిజనిర్ధారణ కమిటీ ఒకదాన్ని నియమించి దాన్ని పంజాబ్‌కు పంపాలని ఆయన కోరారు. బిజ్వాసన్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవీందర్ షెరావత్ ఈ విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. ఢిల్లీతో పాటు పంజాబ్‌లో ఉన్న పార్టీ సీనియర్ నాయకులు మహిళలను వాడుకుంటున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని నిరూపించడానికి తన వద్ద ఆధారాలు మాత్రం ఏమీ లేవన్నారు. ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తామంటూ మహిళలను లైంగికంగా దోచుకుంటున్నారని, పంజాబ్‌లో పార్టీ పెద్దలుగా చలామణి అవుతున్నవాళ్లు ఏం చేస్తున్నారో ఢిల్లీ ఎమ్మెల్యేలకు తెలియదని షెరావత్ చెప్పారు. ఢిల్లీలో ఉండే ఓ పెద్దమనిషి అమ్మాయిలతో ఉన్న ఫొటోలు తరచు ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయని, పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రతినిధి అశుతోష్ ఈ వ్యవహారాలను సమర్థించుకుంటున్నా... అవి నైతిక విలువల ప్రకారం ఆమోదయోగ్యం కాదని అన్నారు. కొందరు మంత్రులపైన, ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారిపైన కూడా వ్యభిచారం ఆరోపణలు వస్తున్నాయని, నియోజకవర్గంలో ఓటర్లు తనను ప్రశ్నిస్తున్నారని తెలిపారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం షెరావత్ లేఖను ఏమాత్రం పట్టించుకోలేదు. అతడు కేవలం ఓ అసంతృప్త ఎమ్మెల్యే అని.. అతడి ఆరోపణలకు ఏమాత్రం ఆధారాలు లేవని పార్టీ ఢిల్లీ కన్వీనర్ దిలీప్ పాండే అన్నారు. ఆధారాలు లేని ఆరోపణలకు తాము స్పందించబోమని చెప్పారు. అతడు కావాలనుకుంటే పార్టీ వేదికపై చెప్పాలి గానీ, ఇలాంటి విషయాలపై బహిరంగంగా మాట్లాడకూడదని అన్నారు.