breaking news
De glamourous
-
డీ గ్లామర్‌కి సై అంటున్న స్టార్ హీరోయిన్లు
డీ గ్లామరస్ క్యారెక్టర్లంటే కొంచెం రిస్క్. అయితే ఆర్టిస్ట్‌గా మంచి పేరు వస్తుంది. అందుకే ఆ తరహా క్యారెక్టర్లకు చాన్స్ వచ్చినప్పుడు గ్లామర్ గురించి ఆలోచించకుండా డీ గ్లామరస్ క్యారెక్టర్లకు సై అంటారు. ఆ పాత్రల్లో గుర్తు పట్టలేనంతగా మారిపోయిన కథానాయికల గురించి తెలుసుకుందాం. స్వాగతం బంగారం తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ‘తంగమ్’గా తయారయ్యారు హీరోయిన్ జాన్వీ కపూర్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ చిత్రంలోని జాన్వీ కపూర్ పాత్ర పేరు తంగమ్ (బంగారం) . దేశంలో విస్మరణకు గురైన తీర ప్రాంంతాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఓ మురికివాడ బస్తీలో జీవనం సాగించే తంగమ్ అనే యువతి పాత్రలో జాన్వీ కపూర్ కనిపిస్తారని తెలిసింది. కథ రీత్యా జాన్వీ కపూర్ కొన్ని సీన్స్‌లో డీ గ్లామరస్‌గా కనిపిస్తారు. తెలుగులో చేస్తున్న తొలి సినిమాతో జాన్వీ ఇలాంటి ఓ డీ–గ్లామరస్ రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఆమె పాత్రలో ఎంత డెప్త్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వేషధారణ, తెలుగు భాష ఉచ్ఛరణ వంటి అంశాల్లో స్పష్టత ఉండేలా జాన్వీ ‘దేవర’ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట. కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిరిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం అక్టోబరు 10న రిలీజ్ కానుంది. ‘కల్కి’ కోసం... బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ఫుల్ గ్లామరస్‌గా కనిపించారు. ఈ బ్యూటీ హీరోయిన్గా కెరీర్నుప్రాంరంభించింది తెలుగు చిత్రం ‘లోఫర్’తోనే. 2015లో విడుదలైన ‘లోఫర్’ తర్వాత బాలీవుడ్లో దిశా ఫుల్ బిజీ అయ్యారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత దిశా పటానీ తెలుగులో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు సైన్ చేశారు. ప్రభాస్ హీరోగా, దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో దిశా కొన్ని సీన్స్‌లో డీ గ్లామరస్‌గా కనిపిస్తారని సమాచారం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ ఫిక్షనల్ ఫ్యూచరిస్ట్ సైంటిఫిక్ చిత్రాన్ని సి. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్న ‘కల్కి 2898ఏడీ’ మే 9న విడుదల కానుంది. సరికొత్త మేకోవర్ ‘తంగలాన్’ సినిమా కోసం కొత్త మేకోవర్‌లోకి మారిపోయారు హీరోయిన్లు మాళవికా మోహనన్, పార్వతి. విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో ఆదివాసీ తెగ అమ్మాయిలుగా కనిపిస్తారట మాళవిక, పార్వతి. ‘‘తంగలాన్’ సినిమాలో నా పాత్ర చాలా బలమైనది. ఈ పాత్ర చేయడం నాకు సవాల్‌గా అనిపించింది’’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు మాళవికా మోహనన్. ఈ చిత్రంలో మాళవిక పాత్రకు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని టాక్. 18వ శతాబ్దంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది. ‘రాయన్’లో... వరలక్ష్మీ, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి... ఫుల్ డీ గ్లామరస్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఈ ముగ్గురూ ఈ చాలెంజ్‌ను తీసుకున్నది ‘రాయన్’ చిత్రం కోసం. హీరో ధనుష్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ప్రకాశ్‌రాజ్, సెల్వారాఘవన్, వరలక్ష్మీ శరత్‌కుమార్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, అనిఖా సురేంద్రన్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేశారు. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ‘రాయన్’. కథ రీత్యా ఈ చిత్రంలోని హీరోయిన్లందరూ డీ గ్లామరస్ రోల్స్‌లో కనిపిస్తారని ఇప్పటికే విడుదలైన వారి ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్పష్టం చేస్తున్నాయి. ధనుష్ కెరీర్లో 50వ సినిమాగా తెరకెక్కిన ‘రాయన్’ని సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఇలా డీ గ్లామరస్ సవాల్ తీసుకున్న కథానాయికలు ఇంకొందరు ఉన్నారు. -
పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్లో కీర్తి సురేష్.. ఏ సినిమాలో అంటే
నటి కీర్తీసురేష్‌కి కోలీవుడ్, టాలీవుడ్‌లలో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. మహానటి చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈ అమ్మడు ఈ తరువాత నటించిన కొన్ని హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలు నిరాశ పరచడంతో ఇక లాభం లేదనుకుందేమో గ్లామర్‌కు మారిపోయింది. అలా కొన్ని చిత్రాల్లో గ్లామర్ పాత్రలకే పరిమితం అయిన కీర్తీసురేశ్ ఇటీవల తమిళంలో సానికాగితం అనే చిత్రంలో డీగ్లామర్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అందులో ఈమె పోలీస్ పాత్రలో నటించింది. కాగా తాజాగా మరోసారి లాఠీ చేత పట్టడానికి రెడీ అవుతోంది. ఈ బ్యూటీ తాజాగా తమిళంలో జయంరవికి జంటగా నటించడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం ద్వారా ఆంటోని భాగ్యరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇంతకు ముందు హీరో, విశ్వాసం, అన్నాత్తే చిత్రాలకు కథా రచయితగా పని చేశారు. ఇంతకు ముందు అడంగ మరు, భూమి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన హోమ్ మీడియా మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈనెల 29న ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. కాగా ఇందులో నటి కీర్తీసురేష్ పోలీస్ ఇన్స్పెక్టర్గా నటించనున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంతో పాటు ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా మామణిదన్ చిత్రంలోనూ కీర్తీసురేశ్ కథానాయికగా నటిస్తోంది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. -
పల్లెటూరి పిల్లలా..
‘రంగస్థలం’ సినిమాలో సమంతను అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో చూపించారు దర్శకుడు సుకుమార్. ఈసారి రష్మికా మందన్నాను కూడా పల్లెటూరి అమ్మాయిలా మార్చేసే ప్లాన్‌లో ఉన్నారని తెలిసింది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక. ఈ సినిమాలో రష్మిక పాత్ర కట్టు, బొట్టు, మాట తీరు అన్నీ కొత్తగా ఉంటాయని సమాచారం. ఇప్పటివరకూ రష్మిక చేసిన పాత్రలకు ఈ పాత్ర విభిన్నంగా ఉంటుందట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ నెలలో సెట్స్ మీదకు వెళ్ల నుందని సమాచారం. -
మేకప్ లేకుండా నటిస్తోందట..!
నటన పరంగా పెద్దగా మార్కులు సాధించకపోయినా తన గ్లామర్ షోతో బండి నెట్టుకొస్తున్న సౌత్ హీరోయిన్ తాప్సీ. తెలుగుతో పాటు తమిళ్లో స్టార్ ఇమేజ్ సాధించిన ఈ బ్యూటీ, బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇన్నాళ్లు ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తూ వచ్చిన ఈ భామ త్వరలో ఓ ఛాలెజింగ్ పాత్రకు రెడీ అవుతోంది. తన ఇమేజ్ను పక్కన పెట్టి డీ గ్లామరస్ రోల్లో మేకప్ లేకుండా నటించడానికి రెడీ అవుతోంది. రానా హీరోగా సంకల్పరెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న వార్ డ్రామా ఘాజీ. ఈ సినిమాలో పాకిస్థాన్ శరణార్థిగా నటిస్తోంది తాప్సీ. అంతేకాదు ఈ పాత్ర కోసం బరువు కూడా తగ్గుతున్న ఈ బ్యూటీ.. ఎలాంటి మేకప్ లేకుండా నటించాలని నిర్ణయించుకుంది. ఇన్నాళ్లు తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకునే అవకాశం రాకపోవటంతో గ్లామర్ షోతో సరిపెట్టేసిన ఈ భామ, ఈసారి తన నటనతోనూ ఆకట్టుకోవడానికి రెడీ అవుతోంది. మరి ఘాజీ మూవీతో అయినా టాలీవుడ్లో తాప్సీకి బ్రేక్ వస్తుందేమో చూడాలి.