breaking news
Daughter born
-
Karimnagar: కూతురు పుడితే రూ.5,116 డిపాజిట్
సాక్షి, తిమ్మాపూర్(కరీంనగర్): గ్రామంలో ఎవరికైనా కూతురు పుడితే పాప పేరిట రూ.5,116 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేశ్ ప్రకటించారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. ఆడపిల్లలపై వివక్ష చూపవద్దన్నారు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టినట్లుగా భావించాలని చెప్పారు. తల్లి, చెల్లి, భార్య ఆడవాళ్లే అయినప్పుడు పుట్టే బిడ్డ మాత్రం ఆడబిడ్డ కావొద్దని కోరుకోవడం మూర్ఖత్వమేనని పేర్కొన్నారు. పంచాయతీ రికార్డుల్లో జనన నమోదు చేసిన వెంటనే రమేశ్ అన్న కానుక పేరిట రూ.5,116 బ్యాంకులో డిపాజిట్ చేసి, సంబంధిత పత్రాలను తల్లిదండ్రులకు అందిస్తామని తెలిపారు. దసరా పండుగ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. సర్పంచ్ నిర్ణయాన్ని గ్రామస్తులు అభినందించారు. తిమ్మాపూర్ మెడికల్ ఆఫీసర్ ఇందు, ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ తిరుపతి రెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ తాజొద్దీన్ ఉన్నారు. చదవండి: వన్ డ్రైవ్ రెస్టారెంట్ కేసు: జువైనల్ హోంకు బాలుడి తరలింపు -
రావమ్మా.. మహాలక్ష్మి!
సాక్షి, కేసముద్రం: నేటి సమాజంలో ఆడపిల్ల పుట్టిందంటే చిన్నచూపు చూడటం సహజం. అయితే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని ఓ కుటుంబంలో ఆడపిల్ల పుట్టిందని తెగ సంబరపడిపోయారు. గ్రామానికి చెందిన సవీన్, రమ్య దంపతులకు మూడు నెలల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆడపిల్ల (సమస్వి) జన్మించింది. శనివారం కూతురితో రమ్య అత్తవారింటికి వచ్చింది. తమ ఇంట మహాలక్ష్మి పుట్టిందని సంబరపడుతూ.. పూలు చల్లి ఇంట్లోకి ఘనస్వాగతం పలికారు. పూల పాన్పులో శిశువును పడుకోబెట్టి ఆనందంతో గడిపారు. -
ఆడపిల్ల పుడితే..వైద్యం ఫ్రీ
మహాలక్ష్మి పుట్టిందని పెద్దలు అంటుంటారు. దీనిని నిజం చేస్తోంది మండపేటలోని నారాయణరెడ్డి హాస్పటల్. ఆడపిల్ల పుడితే చాలు నార్మల్ డెలివరీ అయినా, శస్త్ర చికిత్స అయినా కార్పొరేట్ వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్నారు. అమ్మాయి పుట్టగానే అదృష్టం కలిసొచ్చిందన్న ఆనందాన్ని ఆ కుటుంబంలో నింపుతున్నారు. రెండు నెలల వ్యవధిలో ఆడ శిశువులకు జన్మనిచ్చిన 45 మంది తల్లులకు ఉచితంగా పురుడు పోసి, లక్షలాది రూపాయల విలువైన కార్పొరేట్ వైద్యసేవలను ఉచితంగా అందించారు. సృష్టికి మూలం మహిళ. సాంఘిక దురాచారాలకు అనేక సందర్భాల్లో భ్రూణ స్థాయిలోనే అంతమవుతోంది. ఈ నేపథ్యంలో తన వంతుగా ఇలాంటి దురాగతాలను నిర్మూలించడంతో పాటు ఆడశిశువుల జనన శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ముందుకుసాగుతోంది మండపేటలోని నారాయణరెడ్డి హాస్పటల్స్. లయన్స్ క్లబ్ డెరైక్టర్, పారిశ్రామికవేత్త కర్రి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేట్ వసతులతో మండపేటలో ఏడాదిన్నర క్రితం ప్రారంభించిన నారాయణరెడ్డి హాస్పటల్స్ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందింది. ఉచితంగా పెద్దఎత్తున వైద్య శిబిరాలనూ నిర్వహిస్తోంది. లయన్స్ క్లబ్ డెరైక్టర్‌గా, సామాజిక కార్యకర్తగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నారాయణరెడ్డి చేతనైనంతలో ఆడ శిశువుల జనన శాతాన్ని పెంచాలన్న సంకల్పమే ఈ ఉచిత డెలివరీలకు నాంది పలికింది. తెల్లరేషన్ కార్డు ఉంటే.. పేద వర్గాలకు చెందిన వారు (తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారు) తమ ఆస్పత్రిలో డెలివరీ చేయించకుని, ఆడపిల్ల పుడితే నార్మల్ డెలివరీ అయినా, శస్త్ర చికిత్స అయిన నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు అందిస్తున్నారు. డిసెంబర్లో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మండపేట, అనపర్తి, కొత్తపేట, రామచంద్రపురం పరిసర ప్రాంతాలకు చెందిన 45మంది మహిళలకు ఆడ పిల్లలు జన్మించగా డెలివరీ, శస్త్రచికిత్సల రూపంలో లక్షలాది రూపాయలు విలువచేసే వైద్యసేవలను వారికి ఉచితంగా అందించారు. శస్త్ర చికిత్స అయితే మత్తు డాక్టర్, రక్తపరీక్షలు, మందులు చెల్లించుకుంటే సరిపోతుంది. ఎంత మందికి అయినా ఆడపిల్లలు జన్మించిన వారికి ఉచితంగా వైద్య సేవలందించాలన్నదే తమ లక్ష్యమని నారాయణరెడ్డి తెలిపారు. చాలా ఆనందంగా ఉంది నా భార్యకు నారాయణరెడ్డి హాస్పటల్స్‌లో పురుడు పోయిచాం. ఆపరేషన్ చేయగా ఆడపిల్ల జన్మించింది. ఆపరేషన్‌కు, వైద్య పరీక్షలకు డబ్బులేవి తీసుకోకుండా ఉచితంగా చేశారు. కేవలం మత్తు డాక్టర్‌కు, మందులకు డబ్బులు చెల్లించామంతే. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. రూ. ఐదు వేలకే రూ.25 వేల వైద్యసాయం రెండో డెలివరీలో నాకు ఆడపిల్ల జన్మించింది. రూ.25 వేల వరకు ఖర్చవుతుందని భావించాం. ఆడపిల్ల పుట్టడంతో ఆపరేషన్, వైద్య ఖర్చులేవీ తీసుకోలేదు. కేవలం రూ.ఐదు వేలు మాత్రమే ఖర్చయ్యాయి. నారాయణరెడ్డి హాస్పటల్స్ డాక్టర్లు కూడా దగ్గరుండి ఎంతో బాగా చూశారు. - ఈ.సునీత, మండపేట చేతననైనంతలో మార్పు తెచ్చేందుకు.. పెంట కుప్పల్లోనో, కాలువల్లోనో ఎక్కడో ఓ చోట ఆడ శిశువులు విగత జీవులుగా పడి ఉండటం నన్ను ఎంతో కలిచివేస్తోంది. భ్రూణహత్యల నియంత్రణకు మా వంతు తోడ్పాటుగా ఉచిత డెలివరీలకు శ్రీకారం చుట్టాం. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో రెండు నెలల్లో మా ఆస్పత్రి ద్వారా 45 మందికి ఉచితంగా పురుడు పోయడం ఆనందంగా ఉంది. - కర్రి నారాయణరెడ్డి, నారాయణరెడ్డి హాస్పటల్స్ అధినేత, మండపేట -
రాశికి కూతురు పుట్టింది
ప్రముఖ సినీ నటి రాశి తల్లి అయింది. శుక్రవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ పాపకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం నాడు తమ ఇంటికి సాక్షాత్తూ ఆ మహాలక్ష్మి వచ్చినట్లుగా ఉందని రాశి ఆనందం వ్యక్తం చేసింది.