breaking news
Datsun Go Models
-
రూ.11వేలకే డాట్సన్ గో, గో ప్లస్ బుకింగ్
సరికొత్త డాట్సన్ గో, గో ప్లస్ ఎంపీవీ కార్లను దేశీయ మార్కెట్లోకి ఆవిష్కరించింది డాట్సన్ ఇండియా. ఈ కొత్త అప్డేటెడ్ మోడల్స్ బుకింగ్స్‌ను దేశవ్యాప్తంగా ఉన్న డాట్సన్ డీలర్‌షిప్‌ల వద్ద కంపెనీ ప్రారంభించింది. 11 వేల రూపాయలకు వీటిని బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. అప్డేట్ చేసిన డాట్సన్ గో, డాట్సన్ గో ప్లస్ మోడల్ పలు అప్డేట్లతో కంపెనీ లాంచ్ చేస్తోంది. వెర్టికల్ హౌజింగ్‌లో ఎల్ఈడీ డీఆర్ఎల్తో కొత్త బంపర్స్‌ను ముందు వైపు ఇది కలిగి ఉంది. హెడ్‌ల్యాంప్స్‌ను, ఫ్రంట్ గ్రిల్‌ను రీడిజైన్ చేశారు. వెనుక వైపు బంపర్‌ను కూడా రీడిజైన్ చేసింది డాట్సన్ కంపెనీ. వెనుక వైపు కూడా వాషర్, వైపర్ ఉన్నాయి. కారు లోపల, పునరుద్ధరించిన డ్యాష్‌బోర్డు, 6.75 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఆపిల్ కారుప్లే, ఆండ్రాయిడ్ ఆటోలకు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అనుకూలంగా ఉంది. నాలుగు డోర్లకు కూడా పవర్ విండోస్‌ను కలిగి ఉండటం ఈ మోడల్స్ ప్రత్యేకత. అయితే ఈ ఫీచర్ కేవలం టాప్ స్పెషిఫికేషన్ మోడల్స్‌కు మాత్రమే ఉంది. గో, గో ప్లస్ మోడల్స్ రెండూ అంతకముందు మాదిరే 1.2 లీటరు పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. ఇవి మార్కెట్లోకి వచ్చాక, మారుతీ సుజుకీ ఆల్టో కే10కు, అప్‌కమింగ్ హ్యుందాయ్ శాంట్రోకు, అప్‌కమింగ్ మారుతీ సుజుకీ వాగన్ ఆర్కు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. అప్డేట్ చేసిన ఈ మోడల్స్ ధరను డాట్సన్ పాత వాటి కంటే రూ.10వేల నుంచి రూ.15వేలు అదనంగా పెంచింది. డాట్సన్ గో ప్రస్తుతం మార్కెట్లో రూ.3.38 లక్షల నుంచి రూ.4.41 లక్షల మధ్యలో లభ్యమవుతుండగా.. గో ప్లస్ మోడల్ రూ.3.95 లక్షల నుంచి రూ.5.25 లక్షలకు విక్రయిస్తోంది. అంటే కొత్త మోడల్స్, పాత మోడల్స్ కంటే రూ.10వేల నుంచి రూ.15వేలు ఎక్కువగా పలుకనున్నాయి. -
మార్కెట్లోకి నిస్సాన్ డాట్సన్ గో లిమిటెడ్ ఎడిషన్
ధర రూ. 4.1 లక్షలు న్యూఢిల్లీ : నిస్సాన్ మోటార్ ఇండియా కంపెనీ డాట్సన్ గో మోడల్లో లిమిటెడ్ ఎడిషన్, డాట్సన్ గో నెక్స్ట్ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధర రూ.4.1 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని కంపెనీ ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ కార్లు ఈ ఏడాది అగస్టు-డిసెంబర్ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఉన్న 196 అవుట్లెట్లలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. సౌకర్యవంతమైన ఫీచర్లతో ఈ కారును రూపొందించామని, రూ. 5,000 అధిక ధరకే రూ.20,000 విలువైన యాడ్-ఆన్స్‌ను అందిస్తున్నామని వివరించారు. నిస్సాన్ కంపెనీ ఏడు సీట్ల డాట్సన్ గో కారును ఈ ఏడాది జనవరిలో మార్కెట్లోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ కారు ధరలు రూ.3.79 లక్షల నుంచి రూ.4.85 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయి.