breaking news
dassarah
-
రాజుగారి నాలుగో గది.. హిట్ కాంబో మరోసారి
దసరా సందర్భంగా కొత్త సినిమాల అప్డేట్స్ వస్తుంటాయి. ఈసారి కూడా అలానే పలు చిత్రాలవి వచ్చేశాయి. వీటిలో హారర్ ఫ్రాంచైజీ అయిన రాజుగారి గది నాలుగో భాగం ఒకటి కాగా.. సామజవరగమన కాంబో మళ్లీ రిపీట్ అయింది. ఈ క్రమంలోనే పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. షూటింగ్ అప్డేట్ కూడా ఇచ్చేశారు.(ఇదీ చదవండి: నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం)యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారిన తర్వాత 'రాజుగారి గది' సినిమాలతో ఫేమస్ అయ్యాడు. అయితే తొలి పార్ట్ సూపర్ హిట్ అయింది. రెండు, మూడో పార్ట్స్ మాత్రం యావరేజ్ అనిపించుకున్నాయి. మూడో భాగం 2019లో రాగా దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు నాలుగో భాగాన్ని అనౌన్స్ చేశారు. ఓంకార్ దర్శకత్వం వహిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. త్వరలో షూటింగ్ కూడా మొదలు కానుందని చెప్పుకొచ్చారు. ఈసారి కాళికా దేవి బ్యాక్ డ్రాప్ స్టోరీతో మూవీ తీయబోతున్నట్లు పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతోంది.2023లో అంచనాల్లేకుండా వచ్చి హిట్ అయిన సినిమా 'సామజవరగమన'. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకుడు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో కొత్త సినిమాను ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దసరా సందర్భంగా లాంఛనంగా పూజతో ప్రాజెక్టుని ప్రారంభించారు. అయితే ఇది 'సామజవరగమన' సీక్వెలా లేదంటే కొత్త స్టోరీతో తీస్తున్నారా అనేది కొన్నిరోజులు ఆగితే క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' సినిమా రివ్యూ) -
దసరాకు సిద్దిపేట జిల్లా షురూ
సిద్దిపేట తాత్కలిక కలెక్టరేట్‌గా ఎల్లంకి కళాశాల భవనాన్ని పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్: దసరా పండుగ నుంచి సిద్దిపేట జిల్లాకు రాజముద్ర పడనుందని, అధికారికంగా జిల్లా ప్రక్రియ ప్రారంభమవుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సిద్దిపేట జిల్లా కేంద్రం లాంఛనంగా ప్రారంభమవుతుందని రాష్ర్ట నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేట తాత్కాలిక కలెక్టరేట్ కోసం ఎంపిక చేసిన పట్టణ శివారులోని ఎల్లంకి కళాశాలను బుధవారం మంత్రి పరిశీలించారు. రాష్ర్టంలో సిద్దిపేట ఎంతో ఖ్యాతి గడిచిందని, జిల్లా కేంద్రంగా మారనున్న సిద్దిపేట కలెక్టరేట్‌కు కావాల్సిన భవన సముదాయాలు ఎల్లంకి కళాశాలలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. కలెక్టరేట్ కానున్న దృష్ట్యా కళాశాలలోని ప్రతి భవనాన్ని మంత్రి పరిశీలించారు. పార్కింగ్‌కు అనువైన మైదానం, మౌలిక వసతులను ఆరా తీశారు. ఆయన వెంట ఓఎస్డీ బాల్‌రాజు, తహసీల్దార్ శ్రీనివాస్, పట్టణానికి చెందిన కౌన్సిలర్లు, మచ్చవేణుగోపారెడ్డి, చిప్ప ప్రభాకర్, గ్యాదరి రవి, సాకి అనంద్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.