breaking news
D A Somayajulu
-
అంకెలన్నీ ఆచరణ సాధ్యమా?
-
అంకెలన్నీ ఆచరణ సాధ్యమా?
హైదరాబాద్: నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి ఆర్థిక బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు అన్నారు. బడ్జెట్లో పేర్కొన్న అంకెలన్నీ ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో ప్రస్తావించిన అనేక అంశాలు బడ్జెట్ ప్రసంగంలో లేవని చెప్పారు. ఏపీకి కేటాయింపులు ఆశించిన స్థాయిలో లేవని పెదవి విరిచారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఏపీ పరిస్థితి దుర్భరంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విధాన పరమైన నిర్ణయాల్లో కొన్ని మాత్రమే సానుకూలంగా ఉన్నాయని అన్నారు. ఏపీకి స్పెషల్ కేటగిరి హోదా, రాజధాని నిర్మాణం, రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్ట్ , ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలకు బడ్జెట్ ప్రసంగంలో చోటు దక్కలేదని సోమయాజులు తెలిపారు. -
చిదంబరం బడ్జెట్ నిరాశజనకం: సోమయాజులు
కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిరాశజనకంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డి ఎ సోమయాజులు అన్నారు. చిదంబరం ప్రవేశపెట్టిన ఆ బడ్జెట్‌పై ఆయన సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో స్పందించారు. చిదంబరం వాస్తవ విరుద్ధమైన లెక్కలతో అటు పార్లెమెంట్ను, ఇటు దేశ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ద్రవ్యలోటు, రెవెన్యూలోటులను తగ్గించి చూపారన్నారు. ప్రస్తుత యూపీఏ ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా గెద్దదిగిపోతే మేలని దేశ ప్రజలు భావిస్తున్నారని సోమయాజులు పేర్కొన్నారు.