breaking news
cyclone intensity
-
బలహీనపడుతున్న 'మాది' తుపాను
విశాఖపట్నం: 'మాది' తుపాన్ క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 400 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన మాది తుపాను రేపటికి మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. దీని ప్రభావం వల్ల రాగల 48గంటల్లో కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ తుపాను ప్రభావంతో గంటకు 40-50కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తీరంలో అలల ఉధృతి ఎక్కువ ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. -
వణుకుతున్న విశాఖ ఏజెన్సీ
పాడేరు రూరల్/చింతపల్లి(విశాఖ జిల్లా), న్యూస్‌లైన్: విశాఖ ఏజెన్సీని చలి వణికించేస్తోంది. ఈ మధ్య వరకూ అల్పపీడనం, తుపాను ప్రభావంతో అంతగా ప్రభావం చూపని చలిగాలులు మంగళవారం రాత్రి నుంచి విజృంభించాయి. బుధవారం ఏజెన్సీ పాడేరు ఘాట్‌లోని అమ్మవారి పాదాలు వద్ద 7 డిగ్రీలు, లంబసింగిలో 9, మినుములూరులో 10, చింతపల్లిలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనవరి నెలాఖరుకు ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పడతాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ప్రదీప్‌కుమార్ తెలిపారు. మన్యంలో పరిస్థితి దయనీయంగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. చిన్నపాటి వర్షం మాదిరి మంచు పడుతోంది. ఉదయం 9 గంటలు దాటితే గానీ ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది.