breaking news
cut-off marks
-
జేఈఈ అడ్వాన్స్డ్: సప్లిమెంటరీ మెరిట్ జాబితా
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ 2018 అర్హుల సంఖ్య పెరిగింది. తొలుత ఆదివారం జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫలితాలకు అదనంగా మరికొంత మంది అర్హుల జాబితాను గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటీ కాన్పూర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదివారం విడుదలైన ఫలితాల్లో 18,138 మంది అర్హత సాధించారు. తాజాగా అనుబంధ(సప్లిమెంటరీ) మెరిట్ జాబితాలో 13,842 మంది అదనంగా అర్హత సాధించినట్టు పేర్కొన్నారు. అంటే మొత్తం 31,980 మంది విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు పొందనున్నారు. గత ఏడేళ్లతో పోలిస్తే ఈ ఏడాదే తక్కువ మంది అర్హత సాధించడంతో కేంద్ర మానవ వనరులు శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. భారీగా ఐఐటీ సీట్లు ఉండటం, ఒక్కో సీటుపై కేంద్ర ప్రభుత్వం భారీగా వెచ్చిస్తుండటంతో.. కొత్త మెరిట్ లిస్ట్‌ను రూపొందించాల్సిందిగా ఐఐటీ కాన్పూర్‌కు సూచించింది. ఈ సందర్భంగా కేంద్ర మానవ వనరులు శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఐఐటీ సీట్లు ఖాళీగా ఉండటానికి వీల్లేదన్నారు.. ప్రభుత్వం ఐఐటీల కోసం భారీగా ఖర్చు చేస్తుందని గుర్తుచేశారు. దీంతో కట్ ఆఫ్ తగ్గించిన ఐఐటీ కాన్పూర్ కొత్త జాబితాను రూపొందించింది. అయిన్పటికీ గతేడాదితో పోల్చితే ఇది తక్కవే అని చెప్పాలి. 2017లో 50,455 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించారు. ఈ ఏడాది మే 20న నిర్వహించిన ఈ పరీక్షకు 1,55,158 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఐఐటీ కటాఫ్‌పై అయోమయం
జనరల్ విద్యార్థులకు 492, ఓబీసీకి 503 మార్కులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వింత విధానం మన విద్యార్థులు నష్టపోయే అవకాశం హైదరాబాద్ : ఎక్కడ ఏ భర్తీలు జరిగినా జనరల్ అభ్యర్థుల కంటే ఓబీసీకి కటాఫ్ మార్కులు తక్కువగా ఉంటుంది. అది సహజం. కానీ ఐఐటీల్లో ప్రవేశాలకు ఖరగ్‌పూర్ ఐఐటీ సోమవారం రాత్రి ఇంటర్మీడియెట్‌లో టాప్-20 పర్సంటైల్‌కు ప్రకటించిన కటాఫ్ మార్కులు తీవ్ర గందరగోళానికి కారణమవుతున్నాయి. జనరల్ విద్యార్థుల కన్నా ఓబీసీ విద్యార్థులకు కటాఫ్ మార్కులు ఎక్కువ నిర్ణయించడమే దీనికి కారణం. అంతేకాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కటాఫ్ మార్కులపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాము విద్యార్థుల మార్కుల సీడీ మాత్రమే పంపించామని, అంతకుమించి తాము కటాఫ్ మార్కులకు సంబంధించిన అదనపు సమాచారం ఇవ్వలేదని ఇంటర్మీడియెట్ బోర్డు పేర్కొంటోంది. కటాఫ్‌పై అటు సీబీఎస్ఈ గానీ, ఐఐటీ ఖరగ్‌పూర్ గానీ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. రెండు రాష్ట్రాల నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరైన విద్యార్థుల టాప్-20 పర్సంటైల్ కటాఫ్ విషయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర మార్కులను లేదా ఇంటర్మీయట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర మార్కులను కలిపి చూపించుకోవచ్చని స్పష్టం చేసింది. దాని ప్రకారం పరీక్షకు హాజరైన తెలుగు విద్యార్థులకు కేవలం ద్వితీయ సంవత్సర మార్కుల మేరకు 530కి గాను టాప్-20 పర్సంటైల్‌కు కటాఫ్‌ను జనరల్ అభ్యర్థులకు 492గా ఓబీసీలకు 503, ఎస్సీలకు 464, ఎస్టీలకు 463, వికలాంగులకు 463గా ప్రకటించింది. ఇక రెండేళ్ల (ఇంటర్ ప్రథమ, ద్వితీయ కలిపి) మార్కులను తీసుకుంటే మొత్తం 1000 మార్కులకు జన రల్ అభ్యర్థులకు 920 మార్కులను కటాఫ్‌గా ప్రకటించింది. అదే ఓబీసీలకు 867 మార్కులు, ఎస్సీలకు 810, ఎస్టీలకు 807, వికలాంగులకు 807 మార్కులను కటాఫ్‌గా పేర్కొంది. రెండు సంవత్సరాల మార్కులను కలిపి చూస్తే బాగానే ఉన్నా... ద్వితీయ సంవత్సరం ఒక్కటే పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఓబీసీ అభ్యర్థులు నష్టపోయే స్థితి ఉంది. ఈ పద్ధతిలో జనరల్ అభ్యర్థికంటే ఓబీసీ అభ్యర్థి కటాఫ్‌లో 11 మార్కులు ఎక్కువుంది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మొదటి దశ సీట్లు కేటాయింపు... ఇదిలాఉండగా, మొదటి దశ సీట్ల కేటాయింపులను మంగళవారం ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రకటించింది. రెండో దశ సీట్ల కేటాయింపును జూలై 7న, మూడో దశ సీట్ల కేటాయింపును జూలై 12న ప్రకటించనుంది. అయితే సీట్ల కేటాయింపును ప్రకటించినా వెబ్సైట్లో వివరాలు ఓపెన్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం తరువాత ఛాయిస్ ఇచ్చేందుకు అవకాశం లభించింది. వారు జూలై 4 వరకు ఫీజు చెల్లించవచ్చు. తెలుగువిద్యార్థులకు నష్టం: మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఓబీసీ కటాఫ్ మార్కు ఎక్కువగా ఉండడంతో తెలుగు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. తెలుగు వారు ఎక్కువగా ఐఐటీకి రాకుండా తగ్గించే కుట్ర చేశారు. సీబీఎస్ఈ కటాఫ్‌ను అన్ని రాష్ట్రాలకు ప్రామాణిక ంగా అమలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అపుడు ఎవరికి అన్యాయం జరగదు. ప్రతిభావంతులే ఐఐటీలకు వెళతారు.