breaking news
csection- 8
-
నొప్పులు పడుతూ కోర్టుకి హాజరు..!
అత్యంత అరుదైన వింత కేసు. నొప్పులు పడుతున్న టైంలో ఎవ్వరైన ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. కానీ ఈ మహిళ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. భావోద్వేగభరితమైన ఆ సమయంలో విచారణకు హాజరుకావడం విచిత్రం అనుకుంటే..అక్కడ ఆమె వాదన న్యాయమూర్తిని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఎవ్వరిని ఎలాంటి నిర్ణయం తీసుకోకుండ కట్టుదిట్టం చేసి అందర్నీ భయాందోళనలకు గురి చేసింది. చివరికి ఆ మహిళ..ఇప్పటికీ కోర్టుని, వైద్యులపై ఆరోపణలు చేస్తూ తిట్టిపోస్తూనే ఉంది. అసలేం జరిగిందంటే..ఈ వింత ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఫ్లోరిడాకు చెందిన చెరీస్ డోయ్లిఆస్ప్రతి బెడ్‌పై నొప్పులు పడుతోంది. ఇంకొద్ది క్షణాల్లో డెలివరీ అనగా..బలవంతంగా కోర్టు ముందుకు హాజరుపరిచారు వైద్యులు. అంతేగాదు ఆమె అనుమతి లేకుండానే ఇదంతా జరగడం విశేషం. వర్చువల్ కోర్టు విచారణకు ప్రసవ వేదనతో ఉన్న గర్భణీని బలవంతంగా ప్రవేశపెట్టారు. ఈ దురదృష్టకర ఘటన 2024లో చోటుచేసుకుంది. ప్రసవ వేదన మొదలైన వెంటనే రాత్రికి రాత్రే ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా హెల్త్ హాస్పిటల్‌కు చేరుకుంది.అయితే ఆమె 12 గంటల పాటు ప్రసవ నొప్పులు అనుభవిస్తోంది. ఆ సమయంలోనే ఆమెను వర్చువల్ కోర్టు ముందు హాజరుపరిచారు వైద్యులు. తను వర్చువల్ కోర్టు ముందున్న విషయం తెలుసుకుని ఆ నిండు గర్భిణీ కంగుతింది. డోయ్యి వృత్తిపరంగా ప్రసవ సహాయకురాలైన నర్సు. అయితే ఆమె నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఆమెకు కచ్చితంగా సీసెక్షన్ చేయాల్సిన ఎమర్జెన్సీ. కానీ అందుకు ససేమిరా అంటోంది డోయ్లి. ఎందుకంటే ముగ్గురు పిల్లల తల్లిగా గతంలో జరిగిన సీ సెక్షన్ల నుంచి కోలుకోవడం కష్టంగా ఉందని, దానివల్ల రక్తస్రావంతో అనేక సమస్యలు వస్తున్నాయని వాదిస్తోంది. ఆమె పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నా..మొండిగా ప్రవర్తించడంతో అక్కడి ప్రభుత్వ అత్యవసర పిటిషన్ దాఖలు చేసి కోర్టు ముందు హాజరపర్చింది. ఆ విషయాన్నే పేషెంట్ డోయ్లికి వివరించారు కూడా. అందువల్లే డోయ్లి నొప్పులు పడుతూనే కోర్టులో విచారణకు హాజరైంది. అయితే వైద్యులు ఆమె గనుక నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే..గర్భాశయం చిట్లిపోయే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీ సెక్షన్ చేయక తప్పదని వాదిస్తుండటం గమనార్హం. అంతేగాదు డోయ్లి వైద్యులు గనుక సాధారణ ప్రసవం చేయలేకపోతే గనుక మరొక ఆస్పత్రికి తరలించమని కూడా అభ్యర్థించింది. అయితే ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి..ఆమెకు తక్షణమే ఆపరేషన్ చేయమని ఆదేశించలేదు గానీ, విపత్కర పరిస్థితి ఎదురైతే ఆమె సమ్మతితో పనిలేకుండానే ఆస్పత్రి శస్త్ర చికిత్స చేయవచ్చని సూచించింది. అయితే రాత్రికి ఆమె బిడ్డ పల్స్ రేట్ పడిపోవడంతో హుటాహుటినా..డోయ్లికి సర్జరీ చేసి బిడ్డను బయటకు తీయక తప్పలేదు వైద్యులకు.ఆ తర్వాత ఆమెను మళ్లా కోర్టు ముందు హాజరుపర్చారు. అప్పుడు కూడా, వైద్యులపై మండిపడుతూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ సంఘటన జరిగి ఏడాదికి పైగా గడిచినా ఇప్పటికీ దాన్ని ఆమె అవమానంగా భావిస్తూ..కోర్టుని, సదరు ఆస్పత్రి వైద్యులను తిట్టిపోస్తుండటం గమనార్హం. View this post on Instagram A post shared by Joel Bervell, MD (@joelbervell) (చదవండి: రూ. 50 లక్షల వేతనం వదులుకుంది..! కట్‌చేస్తే..) -
భార్య సిజేరియన్ వల్లే..అనారోగ్యానికి గురయ్యానంటూ ఓ భర్త..
చాలా విచిత్రమైన కేసులు చూసుంటాం. ఇలాంటి విచిత్రమైన కేసు చూసే అవకాశం లేదు. అవకాశం దొరకాలే కానీ చిన్న కారణంతో అవతల వాళ్లని ఇబ్బంది పెట్టి డబ్బులు గుంజాలని చూస్తుంటారు కొందరూ. అలాంటి కోవకు చెందని వాడే భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ వ్యక్తి. ఎంత విచిత్రమైన ఆరోపణలతో కోర్టు మెట్లు ఎక్కాడో వింటే ఆశ్చర్యపోతారు. కేసు నిలబడుతుందనుకున్నాడో, తన వాదన నెగ్గుతుందనో తెలియదు చాలా హాస్యస్పదమైన ఆరోపణలతో కేసు వేశాడు. చివరికీ ఏమైందంటే.. ఆస్ట్రేలియాకు చెందిన భారత సంతతి వ్యక్తి అనిల్ కొప్పుల అనే వ్యక్తి భార్యకు 2018లో రాయల్ ఉమెన్స్ హాస్పటల్స్ సీజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. అక్కడ ఆస్పత్రి నిబంధనల ప్రకారం భార్య ఆపరేషన్ టైంలో భర్త పక్కనే ఉండి ధైర్యం చెప్పేలా ప్రోత్సహిస్తారు. అతడు కూడా ఆపరేషన్ థియోటర్లో వైద్యుల తోపాటే ఉన్నాడు. అప్పటి నుంచి మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యాను. మానసిక అనారోగ్యానకి గురయ్యాను. ఆ ఆపరేషన్‌లో నా భార్య అంతర్గత అవయవాలు, బ్లీడింగ్ చూడటం కారణంగా తన వైవాహిక జీవితం కూడా సరిగా లేదని ఆరోపణలు చేస్తూ కోర్టు మెట్లు ఎక్కాడు అనిల్ కొప్పుల. తన మానసికా ఆరోగ్యం, వైవాహిక జీవితం దెబ్బతినడానికి కారణమైన సదరు ఆస్పత్రిపై చర్యలు తీసుకోవడమే గాక అందుకు ప్రతిగా రూ. 5వేల కోట్లు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కేసు పెట్టాడు. సోమవారం విక్టోరియాలోని సుప్రీం కోర్టు వాదోపవాదనలు విన్నాక తల్లి బిడ్డల సంరక్షణ విషయమై వైద్యులు సీజేరియన్ ఆప్షన్ ఎంచుకుంటారు. తల్లి, బిడ్డల సంరక్షణ కోసం భర్తను థియెటర్లోని అనుమతించడం అనేది కూడా సర్వసాధారణ విషయం. దీని వల్ల అతను ఎలాంటి ఆర్థిక నష్టాన్ని చవిచూడలేదు. పైగా అతను ఆరోపిస్తున్న మానసికి అనారోగ్యం అనేది తీవ్రమైన గాయం కింద పరిగణించేది కాదని తేల్చి చెప్పింది. అందువల్ల అతనికి ఎలాంటి నష్ట పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ..కోర్టు అతడి కేసుని తోసిపుచ్చింది. (చదవండి: బొప్పాయి గింజలు పడేస్తున్నారా..? తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..) -
విదేశాల్లో బాబుకు భద్రత కల్పించింది ఎవరు?
న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఏపీ నాయకులు, ప్రజలకు భద్రత లేదన్న టీడీపీ మంత్రులపై ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి విరుచుకుపడ్డారు. భద్రత కోసం తమ రాష్ట్ర పోలీసులనే వినియోగించాలనే ఏపీ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. 'సింగపూర్, చైనా దేశాలలో పర్యటించిన సమయంలో చంద్రబాబుకు భద్రత కల్పించింది ఎవరు? అక్కడి ప్రభుత్వాలా? లేక ఏపీ పోలీసులా?' అని వేణుగోపాలాచారి ప్రశ్నించారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ చంద్రబాబు రాజ్యాంగ వ్యతిరేక మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు స్వరమేనని, లై డిటెక్టర్ పరీక్షలు జరిపినా అదేవిషయాన్ని ఘంటాపథంగా చెబుతానని చారి అన్నారు.


