breaking news
crores of corruption
-
భారీ అవినీతి ఆరోపణలు: పెదవి విప్పిన మారుతీ ఛైర్మన్
సాక్షి,ముంబై: దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీలోని ఎగ్జిక్యూటివ్స్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై తొలిసారి స్పందించారు సంస్థ ఛైర్మన్ ఆర్సీ భార్గవ. ఈ ఆరోపణలపై సమగ్రమైన దర్యాప్తు చేయిస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు విచారణకు ఆదేశించినట్లు ఛైర్మన్ చెప్పారు. కంపెనీ పాలసీ ప్రకారం తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వెండర్స్‌కు కోట్లాది రూపాయల విలువైన ప్రయోజనాలు చేకూర్చడంతో పాటు అధిక ధరకు విడి భాగాలను కొందరు ఎగ్జిక్యూటివ్స్ సరఫరా చేసి వ్యక్తిగత లబ్ది పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర దర్యాప్తునకు మారుతీ సిద్ధమైంది. అవినీతి ఆరోపణలు రుజువైతే.. చట్టపరమైన చర్యలు తప్పవని సంస్థ ఛైర్మన్ హెచ్చరించారు. పర్చేజ్ డిపార్టమెంట్ లో కొందరు కీలక అధికారులు అవకతవకలకు పాల్పడి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదు నేపథ్యంలో కంపెనీ తొలిసారిగా స్పందించింది. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ బాధ్యతలను KPMGకు అప్పగించినట్లు వెల్లడించారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ ను ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్‌కు ఇప్పటికే పంపినట్లు చెప్పారు మారుతీ సుజుకీ ఛైర్మన్. కాగా దేశంలోని తయారీ ప్లాంట్లకు అవసరమైన 95 శాతం ముడిసరుకు సప్లయిర్ల నుంచే కొనుగోలు చేస్తుంది మారుతి సుజుకీ. 84 శాతం సప్లయిర్లు.. తయారీ ప్లాంట్లకు వంద కిలోమీటర్ల దూరంలోనే ఉంటారు. ఈ క్రమంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్టు పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. -
అవినీతి ‘కిరణాలు’
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : రాజీవ్ యువకిరణాల్లో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతోందని లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు అల్లు శివరమేష్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీవ్ యువకిరణాలు పేరుతో డమ్మీ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి * కోట్లకు కోట్లు దిగమింగారని, ఆ పథకం వల్ల యువతకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. రెండు రోజుల క్రితం తమ పార్టీ అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు ఒంగోలు నగరంలో 20 ప్రాంతాల్లో సేకరించిన శాంపిళ్లను టెస్ట్వైల్స్ ద్వారా పరీక్షించి నివేదికలు తయారు చేయించిన ట్లు తెలిపారు. ప్రగతి కాలనీ, విరాట్‌నగర్‌లో ప్రజలకు సరఫరా చేస్తున్న నీరు పూర్తిగా కలుషితమయ్యాయన్నారు. గొడుగుపాలెం, నల్లవాగు, జయరాం సెంటర్, గద్దలగుంటలలో నీరు కూడా కలుషిత మయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా మంచినీటి శాంపిళ్లను ఆయన మీడియాకు చూపెట్టారు. మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి అయినా ప్రజల కష్టాల గురించి ఏనాడూ పట్టించుకున్న పాపానపోలేదని ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యం ఏమైనా ఫర్వాలేదు, తాము పదవుల్లో కొనసాగితే చాలనే ధోరణిలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని ఎద్దేవా చేశారు. రాజీవ్ యువకిరణాల్లో అవినీతి, మద్యం బాధితులకు న్యాయం, కలుషిత నీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 70 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని చెప్పుకుంటున్న అధికారులు.. బోగస్ కంపెనీల పేర్లతో దొంగ జాబితాలు చూపిస్తున్నారని విమర్శించారు. మద్యానికి బానిసై మృతి చె ందిన వారి కుటుంబాలకు *3000 పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందుగా క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చప్పిడి రత్నకుమారి,మహ్మద్ రఫీ, వరికూటి ఆంజనేయులు, చిరంజీవిరెడ్డి, రంగారావు, మారుతీప్రసాద్, ప్రసాద్ పాల్గొన్నారు.