breaking news
Crop farm
-
పంట పొలంలో విషాదం
పంట పొలంలో సోమవారం ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. సాయంత్రమయ్యేసరికి ఉరుములతో కూడిన చిరుజల్లులు మొదలయ్యాయి. తలదాచుకునేందుకు అందరూ పొలంలో ఉన్న పూరిపాకలోకి వెళ్లారు. కాసేపటికే...వారుండే పాకపై పెద్దశబ్దంతో కూడిన అగ్గిపిడుగు పడింది. అంతే... అందులో ఉన్న ఆరుగురిలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో రైతులిద్దరూ అన్నదమ్ములు కాగా.. ఇంకొకరు ఉపాధ్యాయుడు. జియ్యమ్మవలస: మండలంలోని ఎస్సీమరువాడ, చినతోలుమండ గూడకు మధ్యలో ఉండే పంట పొలాల్లో మృత్యుకేకలు ఘోషించాయి. పిడుగు పాటుకు ఎస్సీ మరువాడకు చెందిన బెలగాపు పారయ్య(62), బెలగాపు పండయ్య(52), చినతోలుమండగూడకు చెందిన ఉపాధ్యాయుడు సీమల నాగభూషణం(36)లు దుర్మరణం చెందారు. పండయ్య భార్య రమణమ్మ, కుమార్తెలు నయోమి, సాత్వికలు ప్రమాదం నుంచి బయట పడ్డా రు. వీరంతా పత్తిచేను లో పనిచేస్తున్నారు. సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురవడంతో అక్కడే ఉన్న పూరిపాకలోకి వెళ్ళారు. అదే సమయంలో పిడుగు పడడంతో పారయ్య, పండయ్య, నాగభూషణంలు దుర్మరణం చెందారు. పండయ్య భార్య, పిల్లలు స్పృహతప్పి పడిపోయారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. రైతులైన పారయ్య, పండయ్యలు అన్నదమ్ములు. ఇద్దరినీ ఒకేసారి మృత్యువు కాటేయడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చినతోలుమండగూడకు చెందిన భూషణంకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాఠశాలకు సెలవు కావడంతో పొలం పనికి వెళ్లి పిడుగుపాటుకు గురయ్యాడు. గూడలోని పిల్లలను విద్యావంతులు చేస్తున్న ఉపాధ్యాయుడి మృతితో గ్రామస్తులు కలతచెందుతున్నారు. చినమేరంగి ఎస్ఐ బి.శివప్రసాద్ కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
శాంతించిన పాతాళగంగ
కృష్ణాజిల్లా కొణతనపాడులో బోరు నుంచి ఎగిసిపడుతున్న గంగమ్మ ఎట్టకేలకు శాంతించింది.గ్యాస్ నిక్షేపాల వల్లే జలం ఎగిసిపడిందంటూ వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. ప్రొద్దుటూరుకు చెందిన రైతు బీహెచ్.గిరిరెడ్డి పంట పొలంలో బోరులోంచి శనివారం జలధార ఎగిసిన విషయం విదితమే. పొలంలో ఉన్న 40 అడుగుల లోతు బోరుకు నీరు అందక లోతు తీయించడంతో సుమారు 150 అడుగుల వద్ద జల వచ్చింది. ఇది 70 అడుగుల ఎత్తున ఎగిసిపడింది. ఈ జలధార ఆదివారం తెల్లవారుజాము రెండుగంటల వరకు కొనసాగింది. నీటితోపాటు బలమైన గాలి శబ్దం వస్తుండడంతో గ్యాస్ నిక్షేపం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.వాటికి తెరదించుతూ తెల్లవారుజాము నుంచి నీటి ఉధృతి తగ్గుతూ వచ్చింది. నమూనాల సేకరణ: జలధార ఎగిసిపడుతున్న విషయం తెలుసుకున్న ఓఎన్జీసీ బృందం ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొణతనపాడు చేరింది. బోరు గొట్టం నుంచి వస్తున్న నీటి శ్యాంపిళ్లను సేకరించారు. ఆ సంస్థ రాజమండ్రి డీజీఎం గాజుల శ్రీహరి, జిల్లా నోడల్ అధికారి మురుగేశన్, ఎస్ఈ చంద్రశేఖర్‌రావు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి పొరల్లో ఉన్న గాలి.. ఒత్తిడితో నీటిని తోసుకుంటూ వస్తోందన్నారు. -కంకిపాడు