దంపతుల దారుణ హత్య
విజయవాడ ప్రతి రోజు సంచలన ఘటనలతో వార్తల్లోకెక్కుతోంది. విజయవాడ నగరంలోని రామలింగేశ్వరనగర్లో చేపల మార్కెట్ పక్కన దంపతులను గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఆదివారం వేకువజామున చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఉదయం 11 గంటల ప్రాంతంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. గంగాధర్(45) ఆటో డ్రైవర్గా పనిచేసేవాడు. ఆయన భార్య రామాంజులమ్మ(40). ఇద్దరూ రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా దండగులు ప్రవేశించి కత్తులతో ఇద్దరి గొంతులు కోసి హతమార్చారు. ముఖాలపై కారంపొడిని చల్లారు. ఈ విషయాన్ని ఇరుగుపొరుగువారు ఉదయం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రంభించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.