breaking news
Cotton Sari
-
వన వైభవం
కాలానుగుణంగా డ్రెస్సింగ్ కాదుకళాత్మకంగా ఉండాలి.కాలాన్ని తట్టుకునేలా.. కాలాన్ని మరిపించేలా..కంటికి, మేనికిహాయిగొలిపేలా ఉండాలి. గిరిపుత్రుల కళారూపాలు ఎప్పుడూ మనల్ని పచ్చటి వనాలకు చేరువ చేస్తూనే ఉంటాయి. ఆ కళారూపాలు చీరల మీద కొలువుదీరితే వాటిని కట్టుకున్నవారు ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు.చూసినవారు వన వైభవంముంగిట్లోకి వచ్చిందని ముచ్చటపడతారు. వేసవి కాలం కాటన్ చీరల ఎంపిక సహజం. అయితే, కాలానికి అనుగుణంగా అనే ఆలోచన మాత్రమే కాకుండా కట్టుకున్న చీరకో ప్రత్యేకత ఉండేలా.. ఆ ప్రత్యేకత వస్త్రవైభవాన్ని పెంచేలా చూసుకోవచ్చు. ►భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు.. ఇలా పంచమహాభూతాల అంశాలను కొంగుల మీదుగా డిజైన్ చేసినవి ఎంచుకోవచ్చు ►పక్షులు, జంతువులు, గిరిజనుల శక్తిరూపాలూ ప్రత్యేకతను చూపుతాయి. ►చెట్టూ, చేమలు .. ప్రేమకావ్యాలను చిత్రించిన చీరలూ ఓ కొత్త భాష్యాన్ని చెబుతుంటాయి ►పసుపు, ఎరుపు, తెలుపు, నీలం రంగుల కాంబినేషన్లు ఆహ్లాదాన్ని పంచే అడవి పువ్వుల అందాలను అనుభూతిని తెస్తాయి ► రెండు రకాల సాదా రంగుల ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుని, వాటిని జత చేసి మీకు మీరే డిజైనర్ అయిపోనూ వచ్చు. ఫ్యాషన్ రంగంలో భారతీయ మూలాలను పట్టుకునేలా డిజైనర్లు ఎప్పటి కప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. ఎక్కడ ఉన్నా, ఎందరిలో ఉన్నా మన జానపదుల కళారూపాలకు ఆ శక్తి ఉండటం వల్లే చీరలు కొత్త సింగారాలతో ఆకట్టుకుంటున్నాయి. కళారూపాలు మాత్రమే కాదు వనాలను తలపించే రంగుల కాంబినేషన్లు, ప్రింట్లతో ఆకట్టుకునే డిజైన్లు కనువిందు చేస్తున్నాయి. ►సహజసిద్ధమైన రంగులతో తీర్చిన డిజైన్లు లెనిన్, కాటన్ ఫ్యాబ్రిక్స్ మీదా అందంగా రూపుకడుతున్నాయి ►ప్యాచ్‌వర్క్ గిరి పుత్రికల ప్రత్యేక కళ. పూర్తిగా చేతితోనే తీర్చిన ఈ డిజైన్ ఫ్యాబ్రిక్ ఏ వేడుకలోనైనా ప్రత్యేకత చూపుతుంది ►కొంగుల అంచులను సైతం చిన్నపాటి అల్లికతో ట్రైబల్ కళను తీసుకురావచ్చు ►అడవి బిడ్డల నివాసాలు, వాటి ముంగిట ముగ్గులు, అక్కడి జీవన విధానం.. ప్రతీది చీర íసింగారాన్ని పెంచేదే. -
శారీ నుంచి పలాజో...
న్యూలుక్ మోడ్రన్ టాప్స్, సంప్రదాయ కుర్తీలకు బాటమ్‌గా పలాజో ప్యాంట్స్ ఇప్పుడు ముందు వరసలో ఉన్నాయి. సౌకర్యం, స్టైల్ వల్ల నేటి మహిళ పలాజోను బాగా ఇష్టపడుతుంది. పలాజోలను ప్లెయిన్‌గా, సాదాగా ఇష్టపడని వారు తమదైన సృజనతో ఇలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.తమ దగ్గర ఉపయోగించని సిల్క్ లేదా కాటన్ చీరలను కుర్తీలకు మాత్రమే కాదు ఇలా పలాజో ప్యాంట్స్కూ వాడచ్చు. పెద్ద అంచు చీరలు పెద్దలు మాత్రమే కట్టుకుంటే బాగుంటుందని అనుకుని వాటిని పక్కన పెట్టేస్తుంటారు. అలాంటి వాటిని కూడా పలాజో స్కర్ట్స్లా డిజైన్ చేసి వాటికి అందమైన డోరీస్ను వేలాడదీసి ధరించవచ్చు. ప్లెయిన్ పలాజో ఉంటే దానికి చీర అంచును జత చేసి కలర్‌ఫుల్ పలాజోను డిజైన్ చేసుకోవచ్చు.టై అండ్ డై చేసిన ఫ్యాబ్రిక్, ఇకత్, పోచంపల్లి వంటి చేనేత చీరలను పలాజో ప్యాంట్గానూ, స్కర్ట్గానూ డిజైన్ చేయించుకోవచ్చు. వాటి మీదకు అనార్కలీ టాప్స్, కుర్తీలు, టీ షర్ట్స్ ధరించవచ్చు.