breaking news
cooch behar cricket tournament
-
సంహిత్‌రెడ్డి డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ బ్యాట్స్‌మన్ ఎం. సంహిత్‌రెడ్డి (272 బంతుల్లో 210; 30 ఫోర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. సంహిత్ దూకుడుగా ఆడటంతో జింఖానా మైదానంలో జమ్మూకశ్మీర్‌తో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ భారీస్కోరు సాధించింది. 293/3 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఆట కొనసాగించిన హైదరాబాద్ 144 ఓవర్లలో 7 వికెట్లకు 619 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో హైదరాబాద్‌కు 267 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. సంహిత్తో పాటు అజయ్ దేవ్ గౌడ్ (108) సెంచరీ సాధించగా, సాయి ప్రజ్ఞయ్‌రెడ్డి (76; 9 ఫోర్లు), వరుణ్ గౌడ్ (64; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. సంతోష్ (39), అనికేత్ (48) రాణించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన జమ్మూకశ్మీర్ మూడోరోజు ఆటముగిసే సమయానికి 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. అనికేత్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే జమ్మూ జట్టు ఇంకా 207 పరుగులు చేయాల్సి ఉంది. -
కూచ్ బెహర్ క్రికెట్ టోర్నీ:కష్టాల్లో హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. సూరత్‌లో గుజరాత్ జట్టుతో సోమవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలిరోజు ఆటముగిసే సమయానికి 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 15 పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్ బౌలర్లలో ఎన్ఏ దేశాయ్ కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ వెన్నువిరిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 74.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. వీఏ సోలంకి (30), ఎస్ఎస్ సూర్యల్ (32) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో భగత్ వర్మ 2 వికెట్లు తీయగా... విద్యానంద్ రెడ్డి, జీవీ వినీత్ రెడ్డి చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు.