controversial video
-
సొంత ప్రపంచంలో బతుకుతున్నారు.. బాబా రాందేవ్‌పై కోర్టు అసహనం
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్(Baba Ramdev) పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హమ్దార్డ్ సంస్థకి చెందిన రూ అఫ్జాపై మరో వీడియో విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అలా చేయకూడదని ఆదేశించినప్పటికీ.. అవమానకరమైన వ్యాఖ్యలతో రూ అఫ్జాపై రామ్‌దేవ్ మరో కొత్త వీడియోను రూపొందించారని, ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని పేర్కొంది.ఢిల్లీ: రాందేవ్ బాబా కొత్త వీడియో విషయాన్ని హమ్దార్డ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దానికి జస్టిస్ అమిత్ బన్సాల్ తీవ్రంగా స్పందిస్తూ.. రామ్‌దేవ్ ఎవరి నియంత్రణలో లేరని ఆయన చేష్టలు బట్టి అర్థమవుతోంది. ఆయన తన సొంత ప్రపంచంలో బతుకుతున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే ఆయన తన ఆలోచనలను తనలోనే ఉంచుకోవాలని, వాటిని బయటకు వ్యక్తపరచవలసిన అవసరం లేదని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను ఆయన ఉల్లంఘించారనేది స్పష్టం అవుతోందని.. కాబట్టి కోర్టు ధిక్కరణ కింద ఆయనకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. తాజా వీడియోలను సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ఫారంల నుంచి తొలగిస్తామని బాబా రాందేవ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీనికి సంబంధించిన వారంలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని.. ఈ పిటిషన్‌పై శుక్రవారం మరోసారి వాదనలు వింటామని జస్టిస్ అమిత్ బన్సాల్ తెలిపారు. పతంజలికి చెందిన గులాబ్ షర్బత్‌ను ప్రచారం చేసే క్రమంలో.. హయ్‌దార్డ్ రూఅఫ్జాను తక్కువ చేస్తూ బాబా రామ్‌దేవ్ తీవ్ర చేష్టకు దిగారు. రూఅఫ్జా ద్వారా వచ్చే ఆదాయాన్ని మదర్సాలు, మసీదుల నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు వినియోగిస్తున్నారని రామ్‌దేవ్ ఆరోపించారు. షర్బత్ జీహాద్ అంటూ రూఅఫ్జాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి టాయిలెట్ క్లీనర్లని, వాటి నుంచి ప్రజలను రక్షించడమే తమ ఉద్దేశమంటూ వ్యాఖ్యానించారు. అలాగే.. అదే ఈ గులాబ్ షర్బత్ (పతంజలి సంస్థకు చెందిన పానీయం) తాగితే.. గురుకులాలను నిర్మించవచ్చు. పతంజలి విశ్వవిద్యాలయాన్ని విస్తరించవచ్చని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై విచారణ చేపట్టాల్సిందిగా హమ్దార్డ్ కోర్టును ఆశ్రయించింది. రామ్‌దేవ్ వ్యాఖ్యలు సమర్థించలేనివని, దిగ్భ్రాంతికి గురిచేశాయని ఏప్రిల్ 22న విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కోర్టు వ్యాఖ్యానించింది. ప్రకటనలు, సోషల్‌మీడియా పోస్టులతో సహా ఆన్లైన్ కంటెంట్‌ను వెంటనే తొలగిస్తామని రామ్‌దేవ్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈహామీని ధృవీకరిస్తూ అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయినా కూడా ఆయన మరో వీడియో విడుదల చేయడంతో కోర్టు అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. ఇదిలా ఉంటే.. పతాంజలి ఉత్పత్తుల విషయంలో రామ్‌దేవ్ బాబా కోర్టు మెట్లెక్కడం ఇదేం కొత్త కాదు. గతంలో తప్పుదోవ పట్టించే ప్రకటనల (Misleading Ads Case) వ్యవహారంలో పతంజలి ఆయుర్వేద్ సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. ఇకపై అలాంటి యాడ్స్ ఇవ్వబోమని వారు కోర్టుకు విన్నవించారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం.. వారిపై ధిక్కరణ కేసును మూసివేసింది. అయితే, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. -
ఉపేక్షించలేని ప్రదర్శన!
చూడడానికి అది ఆరు సెకన్ల వీడియోనే కావచ్చు. కానీ, సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టిన ఆ వివాదాస్పద వీడియో ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించే పరిస్థితి తెచ్చింది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్వయంగా ఆమె అంగరక్షకులే పొట్టనపెట్టుకున్న ఘట్టాన్ని సమర్థిస్తూ రూపొందించిన ప్రదర్శన శకటం ఒకటి కెనడాలోని బ్రాంప్టన్ నగరవీధుల్లో తిరిగిన వైనం భారత్, కెనడాల్లో విస్తృత చర్చ రేపింది. వేర్పాటువాద ఖలిస్తాన్ మద్దతుదారుల ఈ శకట ప్రదర్శన ఏ రకంగా చూసినా ఆక్షేపణీయమే. భారత వ్యతిరేక వేర్పాటువాద, తీవ్రవాద శక్తులు బలం పుంజుకుంటున్న వైనానికి ఈ ప్రదర్శన మరో ఉదాహరణ. మన దేశ రాజకీయ పక్షాలన్నీ ముక్తకంఠంతో కెనడా ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టాయి. క్షమాపణ కోరాయి. కెనడా సైతం వెంటనే విచారం వ్యక్తం చేసింది కానీ, ఆ మాట సరిపోతుందా? భారత్‌తో సత్సంబంధాలు కొనసాగాలని ఆ దేశం నిజంగా కోరుకుంటే, చేయాల్సింది చాలానే ఉంది. అమృత్సర్ స్వర్ణదేవాలయంలో దాగిన సిక్కు తీవ్రవాదుల ఏరివేత కోసం 1984లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ వివాదాస్పద సైనిక చర్య ‘ఆపరేషన్ బ్లూస్టార్’కు దిగడం, అనంతరం కొన్నాళ్ళకు సొంత బాడీ గార్డ్లే విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆమెను పొట్టనపెట్టుకోవడం చరిత్రలో మహా విషాదం. ఆపరేషన్ బ్లూస్టార్ 39వ వార్షికోత్సవ సందర్భాన రెండు రోజుల ముందే జూన్ 4న కెనడాలో ఈ 5 కిలోమీటర్ల ప్రదర్శన శకటాల కవాతు జరిగింది. ప్రదర్శనలు జరిపే స్వేచ్ఛ కెనడా ప్రభుత్వం తన పౌరులకు ఇవ్వవచ్చు. కానీ, ఆ శకటంపై సిక్కు గార్డులు తుపాకీలు ఎక్కుపెట్టగా, చేతులు పైకెత్తి, తెల్లచీరలో ఎర్రటి రక్తపు మోడుగా మారిన మహిళ (ఇందిర) బొమ్మ పెట్టి, ‘దర్బార్ సాహిబ్‌పై దాడికిది ప్రతీకారం’ అంటూ వెనకాలే పోస్టర్ ప్రదర్శించడం సహించ రానిది. దారుణహత్యను సైతం ప్రతీకారంగా పేర్కొంటున్న ఈ ప్రదర్శనను అనుమతించే సరికి పొరుగుదేశ ప్రధాని హత్యను సమర్థిస్తున్నవారిని కెనడా వెనకేసుకొస్తోందని అనిపిస్తుంది. పంజాబ్‌లో తీవ్రవాదం తారస్థాయిలో ఉన్నరోజుల్లో కెనడా, అమెరికా తదితర దేశాలు ఈ వేర్పాటువాదులకు ఆశ్రయం కల్పించాయి. విదేశాల్లో స్థిరపడ్డ వేర్పాటువాదులు అక్కడ నుంచి భారతదేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్నే సవాలు చేస్తున్నారు. అక్కడ నుంచి రెచ్చగొట్టే ప్రకట నలు చేస్తూ, వేర్పాటువాదానికి నిధులు సమకూరుస్తూ, ఖలిస్తాన్ ఉద్యమానికి ఊపిరులూదు తున్నారు. అదే ఇప్పుడు పెద్ద సమస్య అయింది. భారత వ్యతిరేక రిఫరెండమ్‌లు, కార్యక్రమాలు జరపడమే కాదు... హిందూ ఆలయాలపై దాడులు, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాల్లో భారతీయులపై హింసాకాండ ఇటీవల తరచూ సంభవిస్తున్నాయి. ఈ ఏడాది బ్రిట న్లో భారత హైకమిషన్ కార్యాలయంలో ఖలిస్తానీలు పాల్పడ్డ భద్రతా ఉల్లంఘన ఘట్టం లాంటివి ఆందోళన పెంచుతున్నాయి. భారత వ్యతిరేక కార్యకలాపాల్లో తాజా శకట ప్రదర్శన పరాకాష్ఠ. చిత్రం ఏమిటంటే – భారత్‌లో, మరీ ముఖ్యంగా అమృత్‌సర్‌లో ఆపరేషన్ బ్లూస్టార్ స్మరణోత్స వాలు ఏళ్ళు గడిచేకొద్దీ హేతుబద్ధంగా మారాయి. పంజాబీలు పాత చేదు జ్ఞాపకాలను వెనక్కినెట్టి, చాలా ముందుకు వచ్చారు. శాంతిని కోరుకుంటున్నారు. అకాల్‌తఖ్త్ సైతం ఈ ఏడాది మాదక ద్రవ్యాలు, ఇతర సామాజిక రుగ్మతలతో సతమతమవుతున్న గ్రామాల్లో సంస్కరణ ఉద్యమానికి పిలుపునిచ్చింది. పంజాబ్‌లో పరిస్థితులు ఇలా ఉంటే, పరాయిగడ్డ మీది సిక్కులు వేర్పాటువాద ఉగ్రవాదానికి నారుపోసి, నీరు పెట్టాలనుకోవడం శుద్ధ తప్పు. కెనడాలో దాదాపు 2 శాతం జనాభా (దాదాపు 8 లక్షలు) ఉన్న సిక్కుల్ని ఓటు బ్యాంకుగా చూస్తున్న ఆ దేశ నేతలేమో ఖలిస్తానీల్ని లాలించి, బుజ్జగిస్తున్నారు. సాక్షాత్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం సిక్కు ఓటర్లను ఆకట్టుకొనేందుకు గతంలో అధికారిక నివేదికల నుంచి ఖలిస్తానీ తీవ్రవాద ప్రస్తావనలను సైతం తొలగించిన రకం. 2018లో భారత పర్యటనకు వచ్చినప్పుడు గతంలో భారత మంత్రిపై హత్యా యత్నం చేసిన ఖలిస్తానీ నిందితుడితోనే కలసి ఫోటోలు దిగడం వివాదాస్పదమైంది. 1985 ప్రాంతంలో టొరంటో నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానాన్ని ఖలిస్తానీ తీవ్రవాదులు పేల్చివేయగా, అందులోని 329 మందీ మరణించిన ఘటనను కెనడా నేతలు మర్చి పోయారా? ఆ మృతుల్లో అత్యధికులు కెనడియన్లే అయినా, ఓటుబ్యాంక్ లెక్కలతో దాన్ని ఇప్పటికీ భారతదేశానికి సంబంధించిన విషాదంగానే పరిగణిస్తున్న వైనాన్ని ఏమనాలి? పాలు పోస్తున్న పాము రేపు తమ చేతినే కాటు వేయదన్న నమ్మకం ఏముంది? ఇప్పటికైనా కెనడా కళ్ళు తెరవాలి. ప్రజాస్వామ్యం, బహుళ జాతీయతలకు తమ దేశం ప్రతీక అని జబ్బలు చరుచుకొంటూ ప్రజా స్వామ్యం, శాంతి, సౌభ్రాత్రం, చట్టబద్ధ పాలనపై భారత్‌కు తరచూ ఉపదేశాలిచ్చే ట్రూడో ముందు తమ పెరట్లో జరుగుతున్నదేమిటో తెలుసుకోవాలి. బోలెడంత భవిష్యత్తున్న భారత, కెనడా వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాల్లో కాలిముల్లుగా తయారైన ఖలిస్తాన్ లాంటి అంశాలపై నిర్ద్వంద్వమైన అవగాహనకు రావాలి. భారత విచ్ఛిన్నాన్ని కోరుతున్న శక్తులపై కఠినంగా వ్యవహరించాలి. మన ప్రభుత్వం కూడా ఈ విషయంలో కెనడాపై దౌత్య, రాజకీయ ఒత్తిడి పెంచాలి. విద్వేషం వెదజల్లే వారిని నయానో, భయానో వంచాలి. ఒక్క కెనడాలోనే కాక వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న ఖలిస్తానీ నిరసనలపై దృష్టి సారించి, విస్తృత దౌత్య వ్యూహంతో వాటిని మొగ్గలోనే తుంచాలి. ఇంటా, బయటా మరో ఆపరేషన్ బ్లూస్టార్ అవసరం రాకుండా చూడాలి. -
మెమోరబుల్ వీడియోతో విషెస్
-
మెమోరబుల్ వీడియోతో విషెస్
అది 1996 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. సెమీస్ బెర్త్ కోసం చిన్నస్వామి స్టేడియం(బెంగళూరు) దాయాది దేశాల మధ్య జరిగిన పోరును ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకిస్తోంది. భారత్ నిర్దేశించిన 287 పరుగుల భారీ స్కోరును చేధించేందుకు పాక్ రంగంలోకి దిగింది. పాక్ ఓపెనర్లు సయ్యద్ అన్వర్, అమీర్ సోహైల్ తొలి 10 ఓవర్లలో 84 పరుగులు చేశారు. అన్వర్ అవుటయిన సోహైల్ జోరు తగ్గలేదు. దీంతో మ్యాచ్‌పై పట్టు సాధించిన ఆనందంలో సోహైల్ వరుస బౌండరీలు బాది టీమిండియా బౌలర్ వెంకటేష్ ప్రసాద్‌ను రెచ్చగొట్టాడు. ఎక్స్ట్రా కవర్స్‌లో బంతిని కొట్టి ‘మళ్లీ అక్కడికే కొడతా... వెళ్లి తెచ్చుకో’ అంటూ బ్యాట్‌ను వెంకీ ఫేస్ వైపు చూపుతూ ఎగతాళి చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన వెంకీ తర్వాతి బంతిని ఆఫ్‌స్టంప్ బయటకు వేశాడు. అంతే బంతిని టచ్ చేయబోయిన సోహైల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఒక్కసారిగా పట్టరాని ఆవేశంతో వెంకీ ‘బా*ర్డ్... గో హోమ్’ అంటూ పెవిలియన్ వైపు దారి చూపడంతో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. నేడు ఈ మాజీ పేస్ దిగ్గజం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ బీసీసీఐ ఆ మెమోరబుల్ వీడియోను ట్వీట్ చేసింది. అన్నట్లు ఈ మ్యాచ్‌లో భారత్ 39 పరుగులు తేడాతో నెగ్గింది. -
ప్రతిపక్షంపై మరో సర్కారు మార్కు దాడి!
ఏపీ అసెంబ్లీలో అధికారపక్ష నాయకుడు బోండా ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యలతో ప్రభుత్వం తీవ్ర ఇరకాటంలో పడిపోయింది. దాంతో.. తమ పరువు కాపాడుకునే ప్రయత్నాలతో నష్ట నివారణ చర్యలకు టీడీపీ ప్రభుత్వం దిగింది. బోండా ఉమా తీవ్ర అభ్యంతర వ్యాఖ్యల తర్వాత అసెంబ్లీలో దృశ్యాలను మీడియాకు విడుదల చేసింది. అయితే ఎంపిక చేసుకున్న విజువల్స్‌ను మాత్రమే మీడియాకు టీడీపీ అందించింది. అసెంబ్లీ ప్రసారాల విషంలో వైఎస్సార్సీపీ సభ్యులు మొదటినుంచి అభ్యంతరాలు తెలుపుతున్నారు. తమ వెర్షన్ పోనీయకుండా ఏబీఎన్ ఛానల్ అడ్డుకుందని ఆరోపించారు. మధ్యాహ్నం మీడియా పాయింట్ వద్ద ఇదే అంశాన్ని పలుమార్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వివరించారు. అయినా.. అసలు అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల్లో ఎక్కడా రాకుండా.. కేవలం ఒక ఛానల్ వద్ద మాత్రమే ఉన్న దృశ్యాలను టీడీపీ విడుదల చేసింది. అందులో టీడీపీ సభ్యులు ఒక్కరు కూడా కనిపించలేదు. కేవలం వైఎస్సార్సీపీ సభ్యులు ఆవేశంగా మాట్లాడుతున్న దృశ్యాలను మాత్రమే ప్రత్యేకంగా ఎడిట్ చేసుకుని మరీ చూపిస్తూ.. పలు ఛానళ్లలో వాటిని ప్రసారం చేయించుకుని.. తమ సభ్యులను వైఎస్సార్సీపీ సభ్యులు దూషించారని, అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు గుప్పించారు.