సుబ్రహ్మణ్యస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోసారి మతసహనాన్ని భంగపర్చే కామెట్లు చేశారు. మసీదులంటే కేవలం నిర్మాణాలే తప్ప ప్రార్థనా మందిరాలు కావని, వాటిని ఎప్పుడైనా కూల్చివేయొచ్చని అన్నారు.
గువాహటిలో శనివారం జరిని ఓ సమావేశంలో ప్రసంగించిన ఆయన.. ఇస్లాంను పరిపూర్ణంగా విశ్వసించే గల్ఫ్ దేశాల్లో సైతం రోడ్లకు అడ్డంగా ఉన్న మసీదుల్ని కూలగొడతారని, భారత్‌లో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని, ఈ విషయంపై ఎవరితోనైనాసరే చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్ననన్నారు.
స్వామి వ్యాఖ్యలపై పలు మైనారిటీ సంఘాలతోపాటు బీజేపీ అసోం శాఖ సైతం మండిపడింది. ఆయన వ్యాఖ్యలు అర్థరహితమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. మత సహనం కోల్పోయి తరచూ వివాదాలు రేకేతిచ్చే సుబ్రహ్మణ్య స్వామి మరోసారి అసోం రాకుండా నిషేధం విధించాలని కిసాన్ ముక్తి సంగ్రామ్ సమితి సంస్థ.. సీఎం తరుణ్ గొగోయ్‌ని కోరింది. స్వామిపై ఐపీసీ 120(బీ), 153(ఏ) సెక్షన్లకింద కేసు నమోదు చేసినట్లు గువహటి పోలీసులు తెలిపారు.