కంటోన్మెంట్ డిపోలో మెరుపు సమ్మె
హైదరాబాద్: కార్మికులను అకారణంగా విధుల నుంచి తొలగించారంటూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ డిపో ఆర్టీసీ కార్మికులు బుధవారం ఉదయం మెరుపు సమ్మెకు దిగారు. విధుల్లో పాల్గొనబోమంటూ భీష్మించారు. తమ విధుల్లో అలసత్వం వహించారంటూ డిపోనకు చెందిన ఒక డ్రైవర్, కండక్టర్లను ఇటీవల ఆర్టీసీ ఆర్ఎం తొలగించారు. ఇందుకు నిరసనగా బుధవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మెరుపు సమ్మెకు పూనుకున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు రాకపోవటంతో డిపోలో బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.