breaking news
conflict for issue
-
భారత్, పాక్‌లది వెయ్యేళ్ల పోరు!
న్యూయార్క్: భారత్, పాక్ తమ ఉద్రిక్తతలను అంతర్గతంగానే పరిష్కరించుకుంటాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వెలిబుచ్చారు. పోప్ అంత్యక్రియల నిమిత్తం వాటికన్ వెళ్తూ శుక్రవారం ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ క్రమంలో హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్, పాక్‌కు ఇది కొత్తేమీ కాదు. కశ్మీర్ కోసం ఇరుదేశాల మధ్య వెయ్యేళ్లకు పైగా పోరు నడుస్తోంది. బహుశా 1,500 ఏళ్లుగా అనుకుంటా’’అని చెప్పుకొచ్చారు. అంతేగాక పహల్గాం ఉగ్ర దాడిలో 30 మందికి పైగా పర్యాటకులు మరణించారంటూ సంఖ్యను కూడా తప్పుగానే చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలను నెటిజన్లు ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. కశీ్మర్ ఘర్షణల గురించి ట్రంప్‌కు తెలిసినంతగా బహుశా ఇంకెవరికీ తెలియదేమో అంటూ ఒకరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ‘‘అవునా! నేనింకా పాకిస్తాన్ 1947లో పురుడు పోసుకుందనే అపోహలో ఉన్నా’’అని మరొకరు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
గజ్వేల్ వేదికగా మరో పోరు
మల్లన్నసాగర్ బాధితుల సంఘీభావ సభ ఏర్పాట్లను పరిశీలించిన దామోదర, సునీతారెడ్డి గజ్వేల్: మల్లన్నసాగర్ ముంపు బాధితులకు మద్దతుగా కాంగ్రెస్ మరో పోరుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ కేంద్రంగా సోమవారం సంఘీభావ సభ నిర్వహించేందుకు సమాయత్తమైంది. పట్టణంలోని దొంతుల ప్రసాద్ గార్డెన్ వేదికగా సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అతిక్రమించి రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేపడుతున్నారని నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ వేములఘాట్‌లో రిలే దీక్షలు వందో రోజుకు చేరుకున్న సందర్భంగా ఈ సభ నిర్వహిస్తోంది. సభలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు హాజరు కానున్నారు. ఉదయం 11గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా గజ్వేల్‌లో ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభ నిర్వహణ ఏర్పాట్లను ఆదివారం మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి హజారి వేణుగోపాల్‌రావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గాలెంక నర్సింలు, యూత్‌కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్ధార్‌ఖాన్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ కుంట్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.