breaking news
colour code
-
వెహికల్పై ఆ స్టిక్కర్లు లేకుంటే రూ.5000 జరిమానా
ఢిల్లీ మోటార్ వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఇంధన రకాన్ని సూచించే కలర్ కోడెడ్ స్టిక్కర్లను తప్పకుండా అంటించాలి. ఈ నియమాన్ని అతిక్రమించిన వాహనాలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ వెల్లడించింది.నిబంధనలు పాటించకపోతే మోటారు వాహన చట్టం కింద రూ. 5000 జరిమానా విధిస్తారు. ఈ స్టిక్కర్లు 2012-13లో ప్రవేశపెట్టబడిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ (HSRP)లో భాగంగా తీసుకొచ్చారు. ఆ తరువాత 2019 నాటికి అన్ని వాహనాలను ఈ స్టిక్కర్లు తప్పనిసరి అంటూ ఢిల్లీ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.వాహనాలకు కలర్ కోడెడ్ స్టిక్కర్లను అతికించని వాహనదారులు జరిమానా చెల్లించడం మాత్రమే కాకుండా.. పొల్యూషన్ సర్టిఫికెట్ (PUCC) కూడా పొందలేరు. నిబంధనల ప్రకారం, డీజిల్ వాహనాలకు నారింజ రంగు స్టిక్కర్లు, పెట్రోల్ & సీఎన్జీ వాహనాలకు లేత నీలం రంగు స్టిక్కర్లు.. మిగిలిన అన్ని వాహనాలకు బూడిద రంగు స్టిక్కర్లు తప్పనిసరిగా అతికించాలి. -
హాస్పిటల్స్ కు కలర్ కోడ్
- అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఒకే రకమైన రంగులు - కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా సర్కార్ దవాఖానలు - బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు, అధికారులతో సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. అందుకు తగ్గ నిధులను బడ్జెట్లో కేటాయించామని తెలిపారు. బుధవారం ఆయన వివిధ విభాగాల అధిపతులు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇక ముందు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఒకే రంగులో కనిపించేలా చర్యలు చేపట్టాలన్నారు. బడ్జెట్లో గణనీయంగా కేటాయింపులు ఇచ్చామని... వాటితో బోధనాసుపత్రులను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రుల్లో పరిశుభ్రత పాటించాలని మంత్రి ఆదేశించారు. రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షల కోసం సరిపడా నిధులు ఇచ్చామన్నారు. అన్ని రకాల పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయడానికి కావాల్సిన పరికరాలు, పనిముట్ల జాబితాను ఆసుపత్రుల వారీగా సిద్ధం చేసి త్వరగా సిద్ధం చేయాలని ఆదేశించారు. సర్జికల్స్, డిస్పోజబుల్స్ తదితర వాటి జాబితాను కూడా సిద్ధం చేయాలన్నారు. ఆసుపత్రులకు చేపట్టాల్సిన మరమ్మతులు, కొత్త నిర్మాణాలు, రోగులకు వారి సహాయకులకు కావాల్సిన సదుపాయాలను గుర్తించి వెంటనే వాటిని పూర్తి చేయాలన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచే సీఎం లక్ష్యాల మేరకు పనులు మొదలు కావాలని కోరారు. నాణ్యమైన వైద్యాన్ని రోగులకు అందించాలన్నారు. పాత మంచాలను, పరుపులను వెంటనే మార్చాలని... వాటి స్థానంలో కొత్త వాటిని సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ రమణి, నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ మనోహర్, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ జయలత తదితరులు పాల్గొన్నారు.