breaking news
cole scame
-
ఎవరి ప్రలోభాలకు లొంగలేదు..
ఢిల్లీ: హిందాల్కో బొగ్గు గనుల కేటాయింపు సందర్భంగా తాను ఎవరి ప్రలోభాలకు లొంగలేదని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన శుక్రవారం సీబీలో కోర్టులో తన స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. బొగ్గు గనుల కేటాయింపుకోనం తాను ఎవర్నీ ప్రభావితం చేయలేదని మన్మోహన్ సీబీఐ కోర్టుకు స్పష్టం చేశారు. కుమార మంగళం బిర్లాకు గనుల కేటాయింపు చేస్తానంటూ ఎవరికీ హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనికోసం బిర్లా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనకు లేఖలు రాశారని తెలిపారు. అయితే ఆ లేఖలను నిశిత పరిశీలన కోసం సంబంధిత శాఖలను పంపించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో తాను ఎక్కడా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని తెలిపారు. కాగా యూపీఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై కోల్ గోట్ స్కాం మన్మోహలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
'బొగ్గు' సమన్లపై సుప్రీంకోర్టుకు మాజీ ప్రధాని
-
'బొగ్గు' సమన్లపై సుప్రీంకోర్టుకు మాజీ ప్రధాని
కోల్ గేట్ కుంభకోణంలో ప్రత్యేక విచారణకోర్టు జారీచేసిన సమన్లు రద్దుచేయాలని కోరుతూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం ఆయన తరఫు లాయయర్లు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. గత జనవరిలో మన్మోహన్ను ప్రశ్నించింది. ఈ కేసు విచారణకై ఏర్పాటయిన ప్రత్యేక కోర్టు.. సీబీఐ దాఖలు చేసిన తుదిచార్జిషీట్ను పరిశీలించిన అనంతరం ఏప్రిల్ 8 లోగా తన ముందు హాజరుకావాలని మన్మోహన్ సహా మరో ఐదుగురికి సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే.