breaking news
climate details
-
ప్రజల జీవితాలను మార్చేలా పరిశోధనలు
సాక్షి, బెంగళూరు: వాతావరణ సమస్యలు మొదలుకొని వ్యవసాయం, వైద్యం, ఔషధ రంగం వరకు మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్నమైన పరిష్కారాల దిశగా విస్తృతమైన పరిశోధనలు జరపాలని శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. సోమవారం బెంగళూరులోని జవహార్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జేఎన్ సీఏఎస్‌ఆర్)ను ఆయన సందర్శించారు. అనంతరం విద్యార్థులు, శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు, వారి జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చేం దుకు పరిశోధనలు జరగాలన్నారు. శాస్త్రీయ సమాజం, వ్యవసాయరంగంలో నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పని చేస్తూ అద్భుతాలు సృష్టించే దిశగా పని చేస్తున్న స్టార్టప్స్‌ను ప్రోత్సహించడంతో పాటు 300కు పైగా పేటెంట్ హక్కులను సాధించారని జేఎన్సీఏఎస్ఆర్ శాస్త్రవేత్తలను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్, సీఎం బసవరాజ బొమ్మై, జేఎన్సీఏఎస్ఆర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ జీయూ కులకర్ణి, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు పాల్గొన్నారు. -
కోస్తాంధ్రలో చల్లబడిన వాతావరణం
విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని విశాఖలోని వాతావరణ విభాగం వెల్లడించింది. చాలా చోట ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదు కావడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని సమాచారం. ప్రస్తుతం పడుతున్న వర్షాలు మాన్సూన్ ఆన్సెట్ అయ్యే ముందు పడే ప్రీ మాన్సూన్ షవర్స్గా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ద్రోణి ఇంకా కొనసాగే అవకాశం ఉందని వారు వెల్లడించారు. ద్రోణ కారణంగా నేడు రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.