breaking news
cleaning acid
-
ర్యాగింగ్: విద్యార్థినితో యాసిడ్ తాగించారు!
ర్యాగింగ్ భూతం వెర్రితలలు వేస్తోంది. కర్ణాటకలోని ఓ నర్సింగ్ కాలేజిలో సీనియర్లు జూనియర్ విద్యార్థినితో బలవంతంగా బాత్రూంలు శుభ్రం చేసే యాసిడ్ తాగించారు. గుల్బర్గాలోని అల్ ఖమర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో గత నెలలో ఈ ఘటన జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు బాధితురాలు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూనే ఉంది. కేరళకు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను కోజికోడ్‌లోని వైద్యకళాశాలకు తరలించారు. ఆమెకు శరీరం లోపలి భాగాల్లో కాలిన గాయాలయ్యాయి. కర్ణాటక ఆస్పత్రిలోని ఐసీయూలో వారం ఉంచిన తర్వాత కోజికోడ్ తీసుకొచ్చారు. ఆమె పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది. బాధితురాలి తల్లి రోజుకూలీగా పనిచేస్తుంటారు. తన కూతురు మంచి నర్సు కావాలన్న ఉద్దేశంతో రూ. 3 లక్షలు అప్పు చేసి మరీ ఆమెను గుల్బర్గా కాలేజిలో చేర్పించారు. తన కూతురు కనీసం తిండి కూడా తినలేకపోతోందని, వాళ్లు ఎందుకిలా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను దాదాపు ఐదు నెలలుగా చిత్రహింసలు పెడుతున్నారని, మూడో సంవత్సరం విద్యార్థినులు ఈ ఆగడాలకు పాల్పడ్డారని బాధితురాలు చెప్పింది. తాను నల్లగా ఉన్నానని, అందుకే ఎవరూ తనను ఇష్టపడరని, తనకు తండ్రి లేరని కూడా వాళ్లు కామెంట్లు చేస్తున్నారని వాపోయింది. బలవంతంగా చేతులు పైకెత్తి, తననోరు తెరిచి, యాసిడ్ తాగించారని తెలిపింది. అయితే ఇది ర్యాగింగ్ కాదని నర్సింగ్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ ఈస్తర్ అంటున్నారు. ఆమె కుటుంబ సమస్యల కారణంగానే ఫినాయిల్ తాగిందని చెప్పారు. ఈ కేసు విచారణకు గుల్బర్గా పోలీసులు ప్రత్యేక బృందాన్ని నియమించారు. -
మద్యానికి డబ్బివ్వలేదని యాసిడ్ తాగాడు
హైదరాబాద్ : మద్యానికి బానిసైన ఓ వక్తి తాగడానికి డబ్బు ఇవ్వలేదని యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై నర్సయ్య కథనం ప్రకారం... మల్లాపూర్ బ్రహ్మపురి కాలనీకి చెందిన బి.గోపాల్ (60) మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం మద్యం తాగడానికి డబ్బు ఇవ్వాలని కుటుంబ సభ్యులను అడగ్గా... అందుకు వారు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన గోపాల్ బాత్రూంలోకి వెళ్లి క్లీనింగ్ యాసిడ్ తాగాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న గోపాల్‌ను నాచారం ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.