breaking news
classic rapid chess tournment
-
ఆనంద్ నిష్ర్కమణ
లండన్: ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ పేలవ ఆటతీరుతో మూల్యం చెల్లించుకున్నాడు. లండన్ క్లాసిక్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆనంద్ ఓటమిపాలయ్యాడు. దీంతో టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. రష్యాకు చెందిన వ్లాదిమిర్ క్రామ్నిక్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆనంద్ 0.5-1.5 తేడాతో పరాజయం చెందాడు. తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న ఆనంద్... రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడుతూ 27 ఎత్తుల్లో ఓడిపోయాడు. క్వార్టర్స్ వరకు ఆనంద్ ఆటతీరు మెరుగ్గానే సాగినా కీలకమైన తరుణంలో తడబడ్డాడు. సెమీఫైనల్లో క్రామ్నిక్.. నకమురాతో, గెల్ఫాండ్.. ఆడమ్స్‌తో తలపడనున్నారు. -
క్రామ్నిక్‌తో ఆనంద్ గేమ్ డ్రా
లండన్: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ క్లాసిక్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్‌లో తొలి గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా)తో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌ను నల్లపావులతో ఆడిన ఆనంద్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. వీరిద్దరి మధ్యే మరో గేమ్ జరుగుతుంది. ఈ గేమ్‌లో నెగ్గిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు.