breaking news
CK naidu tourny
-
భారత తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత కన్నుమూత
న్యూఢిల్లీ: భారతదేశపు తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత చంద్ర నాయుడు(88) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఇండోర్‌లోని తన నివాసంలో పరమపదించారు. చంద్ర నాయుడు క్రికెట్ దిగ్గజం డా. సీకే నాయుడు కుమార్తె. క్రికెట్ వ్యాఖ్యానంతోపాటు ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించిన ఆమె.. 50 వ దశకంలో జాతీయ జట్టు తరఫున క్రికెట్ ఆడారు. అయితే, ఆరోజుల్లో మహిళల క్రికెట్‌కు అంతగా ప్రాముఖ్యత లేని కారణంగా, ఆమె కామెంటరీపై దృష్టి సారించి, భారతదేశపు తొలి మహిళా వ్యాఖ్యాతగా రికార్డుల్లోకెక్కారు. క్రికెట్ పట్ల ఆమెకున్న ఆసక్తి ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో బీసీసీఐ, ఐసీసీ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. చంద్ర నాయుడు మృతి పట్ల మాజీ క్రికెటర్, మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఎంపీసీఏ) అధ్యక్షుడు సంజయ్ జగ్దలే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చదవండి: పృథ్వీషా ఆ అలవాటును మార్చుకోవాలి: పాంటింగ్ -
భారీ స్కోరు దిశగా విదర్భ
సాక్షి, హైదరాబాద్: సీకే నాయుడు అండర్-23 టోర్నీలో భాగంగా హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో విదర్భ జట్టు భారీస్కోరు దిశగా పయనిస్తోంది. నాగ్‌పూర్ వేదికగా సోమవారం తొలి రోజు ఆటలో విదర్భ జట్టు 90 ఓవర్లలో 4 వికెట్లకు 306 పరుగులు చేసింది. ఎస్ కే నాథ్ (94) కొద్దిలో సెంచరీ చేజార్చుకోగా...కార్తీకేయ (61), ఎంఆర్. కాలే (57) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ బౌలర్లలో టి. రవితేజ 3 వికెట్లు, తనయ్ త్యాగరాజన్ ఒక వికెట్ తీశాడు.