breaking news
cinema city
-
శివరాత్రికి కానుకగా ‘పైసా పరమాత్మ’
కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. అలా సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న చిత్రం 'పైసా పరమాత్మ' . సాంకేత్, సుధీర్, కృష్ణ తేజ్, జబర్దస్త్ అవినాష్, రమణ, అనూష, అరోహి నాయుడు, బనీష, జబర్దస్త్ దీవెన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై టి.కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ కిరణ్ తిరుమల దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది.. కాగా ఈ చిత్రం మహా శివరాత్రి సందర్బంగా మార్చి 12 భారీగా విడుదల కానుంది.. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శక, నిర్మాత కిరణ్ కుమార్ తిరుమల, హీరోలు సాకేత్, సుధీర్, నటులు కృష్ణ తేజ, ముక్కు అవినాష్, రమణ, హీరోయిన్స్ ఆరోహి నాయుడు, భనిష, సంగీత దర్శకుడు కనిష్క, కోడైరెక్టర్ రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. దర్శక, నిర్మాత కిరణ్ కుమార్ తిరుమల మాట్లాడుతూ.. ' మానవ నిత్య జీవితంలో అందరూ నమ్మేది, నమ్మించేది పైసా.. దానిని బేస్ చేసుకొని 8 క్యారెక్టర్స్ చుట్టూ కథ జరుగుతోంది.. ప్రధానంగా సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించాం. రెగ్యులర్ సినిమాలా కాకుండా కథ, కథనం చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి సన్నివేశం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా కనిష్క ఇచ్చిన మ్యూజిక్, అర్ అర్ సినిమాకి మెయిన్ హైలెట్. ఆర్ ఆర్ సాంగ్స్ రింగ్ టోన్స్ పెట్టుకుంటారు. అంత అద్భుతంగా కనిష్క్ చేసాడు. అలాగే బాబు ఇచ్చిన విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. సస్పెన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో యాక్షన్ డ్రామా థ్రిల్లర్ చిత్రం ఇది. మార్చి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయదు.. అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క మాట్లాడుతూ.. ' డిఫరెంట్ సబ్జెక్ట్ తో రూపొందిన పైసా పరమాత్మ చిత్రం అందరికీ నచ్చుతుంది. నటీ నటులు అందరూ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఈ చిత్రంలో రెండు సాంగ్స్ ఒక రిమిక్ సాంగ్ ఉంటుంది.. సినిమా చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.. అన్నారు. హీరో సాకేత్ మాట్లాడుతూ.. ' ఈ చిత్రంలో హీరోగా నటించే ఛాన్స్ ఇచ్చిన కిరణ్ గారికి ఋణపడి ఉంటాను. అందరం కలిసి ఒక మంచి సినిమా చేశాం.. సస్పెన్స్ థ్రిల్లర్ తో రూపొందిన ఈ చిత్రం అనేక ట్విస్ట్ లతో సాగుతుంది.. అన్నారు. మరో హీరో సుధీర్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ఉన్న సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.. మా పైసా పరమాత్మ కూడా కొత్త కంటెంట్ తో వస్తోంది. ఆడియెన్స్ అందరూ మా చిత్రాన్ని ఆదరించాలి అన్నారు. నటుడు కృష్ణ తేజ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఒక ముఖ్యపాత్రలో నటించాను. నా 14ఏళ్ళు సినీ కేరియర్ లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసిన చిత్రం ఇది. మెస్మరైజింగ్ చేస్తుంది. ప్రతీ ఒక్కరూ నా క్యారెక్టర్ ని ఓన్ చేసుకుంటారు. అంత అద్భుతంగా కిరణ్ డిజైన్ చేసాడు.. ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమా కూడా ఇంకా బాగుంటుంది.. అన్నారు. హీరోయిన్ ఆరోహి నాయుడు మాట్లాడుతూ.. కంప్లీట్ టీం వర్క్ ఇది. డైరెక్టర్ కిరణ్ గారు ప్రతి క్యారెక్టర్ ని అద్భుతంగా డిజైన్ చేశాడు. మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశాను.. నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన కిరణ్ గారికి నా థాంక్స్.. అన్నారు. నటి బనిష మాట్లాడుతూ.. ' నేను, అవినాష్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. టీమ్ అందరం చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. ముఖ్యంగా కిరణ్ గారు వన్ మాన్ షోలా ఈ చిత్రాన్ని చేశారు. ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది.. అన్నారు. కమిడియన్ ముక్కు అవినాష్ మాట్లాడుతూ.. కెమెరామెన్ జియల్ బాబు కాల్ చేసి ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ ఉంది చేయాలి అన్నారు.. కిరణ్ చెప్పిన సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సినిమా చాలా బాగా వచ్చింది.. అందరికీ నచ్చుతుంది.. అన్నారు. నటుడు రమణ మాట్లాడుతూ.. కథని నమ్మి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేశారు. ఒక ముఖ్యపాత్రలో నటించాను. సినిమా చూశాను.. చాలా బాగుంది.. అందరికీ నచ్చుతుంది.. అన్నారు. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ' కిరణ్ గారు అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని చేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. సినిమా బాగా వచ్చింది.. మార్చి 12న విడులవుతుంది.. సినిమాని చూసి పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను.. అన్నారు. -
హాలీవుడ్ స్థాయిలో సినిమాసిటీ: కేసీఆర్
హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో హాలీవుడ్‌ను తలపించేలా తెలంగాణలో సినిమా సిటీని నిర్మించతలపెట్టినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రవి కొత్తరకార, సి.కళ్యాణ్, శశికుమార్, నందకుమార్, ఎన్.శంకర్, హెచ్డి గంగరాజు, కాట్రగడ్డ ప్రసాద్, ఉదయ్‌సింగ్, ఎ.రాజ్‌కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సినిమా సిటీ కేవలం సినిమాలు తీయడానికే పరిమితం కాకుండా, టీవీ సీరియళ్లు, కార్యక్రమాల రూపకల్పన, గ్రాఫిక్ ఎఫెక్ట్స్, యాని మేషన్, ప్రజా సమస్యలపై లఘుచిత్రాలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఎక్కడ, ఎలా నిర్మిం చాలనే దానిపై త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. ముంబై సినీ పరిశ్రమ ప్రతినిధులు, భారతదేశ సినీరంగపెద్దలు, తెలుగు సినీపరిశ్రమకు చెందిన ప్రతినిధులను ఆహ్వానించి వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పా రు. అనంతరం ఫిల్మ్‌ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారత్ కేం ద్రంగా తెలంగాణ ఫిల్మ్‌సిటీ మారాలనే సంకల్పానికి తాము కూడా చేయూతనందిస్తామని తెలిపారు. రెండువేల ఎకరాల్లో ప్రారంభించే ఈ ఫిల్మ్‌సిటీ అన్ని భాషల సినిమాల తయారీకి కేంద్రం కావాలని ఆశిస్తున్నామన్నారు. సీఎంతో టర్కీ కాన్సూల్జనరల్ భేటీ ఈ ఏడాది అక్టోబర్ 24న హైదరాబాద్‌లో జరగనున్న తమ జాతీయ దినోత్సవాల్లో పాల్గొనాలని టర్కీ కాన్సూల్జనరల్ మురాత్ ఒమెరోగ్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. దీనికి కేసీఆర్ సమ్మతించారు. సోమవారం సచివాలయంలో మురాత్ తెలంగాణ సీఎంతో భేటీ ఆయ్యారు. కాగా, మరోసారి సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించాలని నిర్ణయించారు. టర్కీలోని ఇస్తాంబుల్ ఇప్పుడు నవీకరించిన నగరమని, దీనిని సందర్శించాలనే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాటుచేస్తామని మురాత్ ఒమెరోగ్లు హామీ ఇచ్చారు. -
ఇక్కడా ‘అమ్మ’ థియేటర్లు రావాలి!
‘‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ‘సినిమా సిటీ’ కోసం రెండువేల ఎకరాలు కేటాయించడం ఆనందంగా ఉంది. కానీ, చిత్రసీమ అభివృద్ధి కోసం కృషి చేసేవారికే భూమి కేటాయించాలి. అంతేకానీ, గుత్తాధిపత్యం వహించేవారికి అప్పగించకూడదని మనవి చేసుకుంటున్నా’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పారు. రెండు వేల ఎకరాలు కేటాయించినంత మాత్రాన సమస్యలు సమసిపోవనీ, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని భరద్వాజ్ చెబుతూ -‘‘థియేటర్ల గుత్తాధిపత్యాన్ని అరికట్టాలంటే టిక్కెట్ విధానాన్ని కంప్యూటరైజింగ్ చేయాలి. దానివల్ల పారదర్శకత రావడంతో పాటు ప్రభుత్వానికి కూడా పన్నులు సక్రమంగా అందుతాయి. అలాగే, చిన్న చిత్రాలకు ఆటలను ఐదుకి పెంచడంతో పాటు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలి. అది వెంటనే ఆచరణలో పెడితే నిర్మాతలు, థియేటర్ అధినేతలు, పంపిణీదారులకు మేలు జరుగుతుంది. తమిళనాడులో చిన్న చిత్రాలను ప్రదర్శించుకోవడానికి ‘అమ్మ’ పేరుతో, కర్నాటకలో ‘జనత’ పేరిట థియేటర్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కేరళలో ఇప్పటికే కొన్ని థియేటర్లు ఉన్నాయి. గుజరాత్లో కూడా కట్టించాలనుకుంటున్నారు. మన రెండు రాష్ట్రాల్లోనూ ఇలా థియేటర్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. కేసీఆర్ ప్రతిపాదించిన రెండు వేల ఎకరాల ‘చిత్రనగరి’లో మీకు స్టూడియో కట్టాలనే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు -‘నాకస్సలు అలాంటి కోరికలేవీ లేవు. రెండు రాష్ట్రాల్లోనూ పరిశ్రమ అభివృద్ధి చెందితే ఆనందపడతాను. అంతేకానీ నాకు భూములు వద్దు’’ అని భరద్వాజ్ స్పష్టం చేశారు.