కొత్త పుస్తకాలు
క్రీస్తు అద్భుత గీతాలు
దేవునితో భేటీ ఉంది నాకీ రోజున
ఆశీర్వదించబడిన విశ్రాంతి దినం నాడు
అతడి ప్రియమైన గృహానికి వెళ్లి కలుస్తాను
నాలా పవిత్ర యాత్రలో ఉన్న ప్రయాణికులనూ...
ఇలాంటి క్రీస్తు గీతాలు ప్రపంచవ్యాప్తంగా వేలాదిగా ఉన్నాయి. తమ గీతాల పంక్తులను క్రీస్తు పాదాల వద్ద ఉంచాలని తపించని భక్తులు ఉంటారా? రెండువేల యేళ్లుగా ఆ కరుణామయుడు మానవజాతికి కాపరిగానే ఉంటూ వచ్చాడు. ఆయన స్తోత్రగీతాలు ఎనలేని ఓదార్పును పంచుతూనే ఉన్నాయి. అలాంటి గీతాలను సేకరించి అనువదించి పుస్తకంగా అందించారు డాక్టర్ లంకా శివరామప్రసాద్. 100 గీతాల ఈ పుస్తకం ఒక మంచి కానుక.
వెల: రూ.150 ప్రతులకు: 8897849442
జిప్సీ....
శ్రీరామకవచం సాగర్ కవిత్వంలో ప్రయోగశీలి అని ఇది వరకే గుర్తింపు పొందారు. వచనంలో కూడా కొత్త తరహా వస్తువులను ఎంచుకుని ముందుకుసాగడం ఆయన పద్ధతి. సాగర్ కొత్త పుస్తకం ‘జిప్సీ’ మూడు వచన పద్యాల సమూహం అయిన ‘ముక్కాణి’ అనే నిర్మాణంలో రాసింది. వస్తువిస్తృతి కోసం, గాఢత కోసం దీనిని అవలంబించానుంటున్నాడు కవి.
వెల: రూ.100 ప్రతులకు: 9885473934
సిక్కెంటిక - కథలు
తమిళ రచయిత జయకాంతన్ నవల ‘ఒరు నడిగై నాడగం పార్కిరాళ్’ను ‘కల్యాణి’ పేరుతో అనువాదం చేసి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన రచయిత జిల్లేళ్ల బాలాజీ. స్వతహాగా కథకుడైన బాలాజీ తాను రాసిన 16 కథలను సంపుటిగా తీసుకొచ్చారు. గ్రామీణ జీవితం, మార్జినలైజ్డ్ సమూహాల జీవన ఘర్షణలు ఇందులో కనిపిస్తాయి.
వెల: రూ.90; ప్రతులకు: 9866628639