breaking news
chokes
-
అందరూ చూస్తుండగానే సోషల్ మీడియా స్టార్ కన్నుమూత : దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు.. అన్నాడో సినీ కవి. నిజమే కదా..ఏ విషాదం ఎలా ముంచుకొస్తుందో, ఎవరి మరణం ఎలా దూసుకొస్తుందో తెలియదు. ఆహార నియమాలుపాటిస్తూ, నిరంతరం వ్యాయామం చేస్తూ ఎంతో ఫిట్‌గా ఉన్నాం అనుకునేవారు కూడా గుండెపోటుతో విలవిల్లాడుతూ కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సోషల్ మీడియా స్టార్ అకాల మరణం ఇలాంటి నిర్వేదాన్ని మిగులుస్తోంది. అప్పటివరకూ ఎంతో సంతోషంగా, ఆడుతూపాడుతూ ఉన్న ఆమెను మృత్యువు కబళించిన తీరు పలువురి చేత కంటతడి పెట్టిస్తోంది.27 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కరోల్ అకోస్టా అనూహ్య మరణి ఆమె ఫ్యాన్స్‌ను విషాదంలోకి నెట్టేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 6 మిలియన్లకు పైగా ఫాలోవర్లున్న కరోల్, న్యూయార్క్‌లో(NewYork) తన కుటుంబంతో కలిసి డిన్నర్ చేస్తుండగా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. భోజనం చేస్తున్న సమయంలో ఆహారం గొంతులో ఇరుక్కొని ఉక్కిరి బిక్కిరైంది. కుటుంబ సభ్యులందరూ చూస్తుండగానే ప్రాణాలొదిలేసింది. కరోల్ ఆన్లైన్లో ‘కిల్లడమెంటే’(‘Killadamente’) అనే పేరుతో కూడా సుపరిచితురాలు. ఫ్యాషన్, జీవనశైలి, మాతృత్వంపై వీడియోలను షేర్ చేస్తే ఆదరణ పొందింది. బాడీ పాజిటివిటీని ప్రోత్సహిస్తూ, తన వ్యక్తిగత విషయాలు, తాను నెట్టుకొచ్చినతీరు ముఖ్యంగా ఆందోళన, నిరాశతో తన స్ట్రగుల్ గురించి నిస్సంకోచంగా తెలియజేస్తూ అభిమానుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. కరోల్ మరణవార్తను ఆమె సోదరి కట్యాన్(Katyan) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియ జేసింది.“నేను నిన్ను ప్రేమిస్తున్నాను సోదరీ.ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.. ఇంత మంచి మనసున్న సోదరిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది. నీకు మనశ్సాంతి సోదరీ” అంటూ భావోద్వేగంతో ఒక సందేశం పోస్ట్ చేసింది. ఈ విషాదంలో తమకు సానుభూతి తెలిపిన అకోస్టా అభిమానులకు కృతజ్ఞతలు కూడా వ్యక్తం చేసింది. అయితే ఈ పోస్ట్ ఇపుడు కనిపించడం లేదు. మరో పోస్ట్‌లో కరోల్ తన సోదరి మాత్రమే కాదని, పార్ట్నర్, బెస్ట్ ఫ్రెండ్ అంటూ కట్యాన్ గుర్తు చేసుకుంది. View this post on Instagram A post shared by Reina (@killadamente) న్యూయార్క్ పోస్ట్ నివేదికల ప్రకారం, జనవరి 3న కరోల్ డిన్నర్ చేస్తుండగా ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది పడిందని, వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కరోల్ మరణానికి గల అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉందని సోదరి కట్యాన్ శవపరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని, అప్పుడే అసలు విషయం తెలుస్తుందని పేర్కొంది. కరోల్ అకోస్టా మరణంపై ఫాలోవర్లు సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాధగా ఉంది, ఇంత చిన్న వయసులో వెళ్లిపోయావు, వి మిస్ యూ , ఆర్ఐపీ, అన్న సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. -
సీటు వెనక్కి నెట్టిందని..
లాస్ ఏంజెల్స్ : స్వల్ప వివాదం కారణంగా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన సౌత్ వెస్ట్ ఎయిర్వేస్ జెట్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. కేవలం తన సీటును వెనక్కి నెట్టిన కారణంగా ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల తోటి ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. దీంతో విమానంలో ఉన్న 136 మంది ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ కారణంగా పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. స్వల్ప విషయానికే అసహనానికి గురైన అతగాడు.. ప్రయాణికురాలి గొంతు పట్టుకుని నులిమేశాడు. ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడకుండా చేసి తలపై తీవ్రంగా కొట్టాడు. దీన్ని గమనించిన తోటి ప్రయాణీకులు అప్రమత్తమై అతడిని వారించి, సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అతగాడిని అదుపులోకి తీసుకున్నారు. విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత బాధిత మహిళ రిలాక్స్‌గా తన సీటును వెనక్కి జరిపిందని... అయితే ఆమె వెనక సీటులో కూర్చున్న ప్రయాణికుడు ..ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ...అకస్మాత్తుగా ఆమె గొంతుపట్టుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో ఆమె భయంతో బిక్కచచ్కిపోయిందన్నారు. ఈ వివాదంతో సుమారు అయిదుగంటల పాటు విమానం ఆగిపోయింది. దీంతో మిగతా వారిని వేరే విమానంలో శాన్ ఫ్రాన్సిస్కోకు తరలించారు. కాగా ఈ ఆలస్యం విలువ సుమారు రెండు లక్షల డాలర్లని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ తెలిపింది. -
ఆయువు తీసిన అన్నంముద్ద
ధర్మపురి, న్యూస్‌లైన్: ప్రేమతో తినిపించిన గోరుముద్దలు బాలుడి నిండుప్రాణం తీశాయి. అప్పటివరకు తల్లిదండ్రుల ఒడిలో అల్లారుముద్దుగా ఆటలాడుకొన్న ఆ చిన్నారికి క్షణాల్లో నూరేళ్లు నిండాయి. కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని తోట్లవాడకు చెందిన రాచకొండ శ్రీనివాస్-మనీష దంపతులకు కుమారులు మణిశేఖర్(5), శ్రీహర్షత్(8నెలలు) సంతానం. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం శ్రీహర్షత్‌కు గోరుముద్దలు తినిపిస్తుండగా, గొంతులో ముద్ద అడ్డుపడి బాలుడికి ఊపిరాడలేదు. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికి బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి ఊపిరితిత్తుల్లోకి ముద్ద వెళ్లి ఊపిరాడక మృతిచెంది ఉంటాడని వైద్యులు తెలిపారు.