breaking news
chodaram
-
ధర్మశ్రీ చతురత!
చోడవరం: జిల్లాలో చోడవరం నియోజకవర్గం ఓ సంచలనం సృష్టించింది. గతంలో ఎప్పుడూలేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేయడంలో సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రదర్శించిన చతురుత ప్రత్యర్థి పార్టీ నాయకులకు దిమ్మతిరిగేలా చేసింది. గతంలో టీడీపీకి కంచుకోగా ఉన్న చోడవరం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో సత్తా చూపిన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా ఏకగ్రీవ స్థానాలు దక్కించుకొని మరోసారి ప్రత్యర్థుల స్థానాల్లో పాగా వేసింది. నియోజకవర్గంలో నాలుగు జెడ్పీటీసీ, 77 ఎంపీటీసీ స్థానాలు ఉండగా చరిత్రలో ఎప్పుడూలేని విధంగా రోలుగుంట, రావికమతం మండలాల జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 11 ఎంపీటీసీ స్థానాలు కూడా ఏకగ్రీవం కాగా మరో 30 స్థానాలు టీడీపీ అభ్యర్థులు విత్‌డ్రా అయ్యేలా చేయడంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ చేసిన ప్రయత్నం పార్టీ కేడర్‌లో నూతనుత్సాహాన్ని నింపింది. రోలుగుంట, రావికమతం జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఆయన పావులు కదిపి విజయం సా«ధించారు. రోలుగుంట జెడ్పీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోగా రావికమతం జెడ్పీటీసీ స్థానం టీడీపీ అభ్యర్థి విత్‌డ్రా అయ్యారు. జనసేన అభ్యర్థి విత్‌డ్రాకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ సమాయానికి ఆయన అందుబాటులో లేకపోవడంతో పోటీ కేవలం నామమాత్రంగానే మారింది. దీనితో జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలో రెండు జెడ్పీటీసీలను వైఎస్సార్సీపీ దక్కించుకున్నట్టయ్యింది. ఇక చోడవరం, బుచ్చెయ్యపేట జెడ్పీటీసీ స్థానాలు కూడా ఆ పార్టీ దక్కించుకునేలా ధర్మశ్రీ చూపిన చొరవ ఆ పార్టీ విజయానికి చేరువ చేసినట్టుగా ఉంది. నాలుగు మండలాల్లో 80 శాతానికి పైగా ఎంపీటీసీ స్థానాలు దర్కించుకుని నాలుగు ఎంపీపీ స్థానాలు కూడా వైఎస్సార్సీపీ దక్కించుకునేలా ఎమ్మెల్యే ధర్మశ్రీ పావులు కదిపి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను సైతం తమకు అనుకూలంగా మార్చుకొని సత్తాచాటారు. ధర్మశ్రీ చొరవ వైఎస్సార్సీపీలో నూతనుత్తేజాన్ని నింపింది. స్థానిక ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేస్తామని ఎమ్మెల్యే ధర్మశ్రీ చెప్పారు. -
రాజుగారి దెబ్బా... మజాకా?!
బినామీ క్వారీలతో రవాణా వ్యవస్థ ధ్వంసం కూలిపోయిన బొడ్డేరు, జంపెన వంతెనలు రాత్రి, పగలూ రవాణాతో జనం ఆగ్రహం చోడవరం,న్యూస్‌లైన్: గ్రానైట్ వ్యాపారంతో జిల్లాలో వెలిగిపోతున్న చోడవరం మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు రాళ్ల దెబ్బలు అటు జనం సహనాన్ని, ఇటు రోడ్లను దెబ్బతీస్తున్నాయి. నాలుగేళ్లుగా అక్రమ రవాణాతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్క రోడ్డు, కల్వర్టు నిర్మించని రాజు చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని ప్రధాన రహదారులు దెబ్బతినడానికి మాత్రం కారణమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో లేకపోవడం వల్లే నియోజకవర్గం అభివృద్ధి చేయలేకపోయానని చెప్పే రాజు తన సొంత అభివృద్ధికి మాత్రం పెద్దపీట వేసుకున్నారు. మాడుగుల, రావికమతం తదితర మండలాల్లో కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే తెల్లగ్రానైట్ క్వారీలు 20 వరకు ఆయనకున్నాయని సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సహకారంతో కోట్లు విలువచేసే గ్రానైట్ క్వారీల లీజులు తెచ్చుకున్న ఎమ్మెల్యే రాజు నియోజకవర్గం సమస్యలను పరిష్కరించడానికి ఎందుకు చొరవ చూపలేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కొత్త సమస్యలు నిత్యం 40 టన్నులకు మించిన సామర్థ్యం ఉన్న వాహనాలు రోడ్లపై ప్రయాణిస్తుండడంతో చాలావరకు కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నా యి. రోడ్లు ధ్వంసమయ్యాయి. జాతీ య రహదారిపై తప్ప గ్రామీణ రోడ్లై పై 15 టన్నులకు మించి బరువున్న వాహనాలు ప్రయాణించకూడదు. నిబంధనలను అతిక్రమించి భారీ వా హనాలు తిరగడంతో బి.ఎన్.రోడ్డు, మాడుగుల, గొటివాడ-వీరవిల్లి అగ్రహారం, చింతలూరు, కవగుంట, వి.జె.పురం-రావికమతం రోడ్లలో వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. మూడేళ్ల కిందటే చోడవరం సమీపంలో బొడ్డేరు వంతెన కూలి పోగా, ఏడాది కిందట పెద్దేరు నదిపై జంపెన వంతెన కూలిపోయింది. పెద్దేరు, తాచేరు, శారదా నదులపై ఉన్న వడ్డాది, వీరవిల్లి, గోవాడ వంతెనలతోపాటు ఈరోడ్లలోని చాలా కల్వర్టులు కూలిపోయే స్థితికి చేరాయి. ఇవి ఎప్పుడు కూలిపోతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణికులు నానాపాట్లు పడుతున్నారు. అధికారుల హెచ్చరికలతో పగటిపూట రవా ణా నిలిచిపోయినా రాత్రిపూట కొనసాగుతోంది. ప్రజాసమస్యలను గాలి కి వదిలేసి సొంత అభివృద్ధికే పెద్దపీట వేసిన ఇటువంటి నాయకులను పక్కనపెట్టి తమకోసం పనిచేసే వారిని గెలిపించుకోవాలని నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు.