breaking news
Chintamaneni gang
-
రెడ్‌బుక్ దౌర్జన్యకాండ.. అబ్బయ్య చౌదరి ఇంటిపై దాడి!
సాక్షి, ఏలూరు: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం దర్జాగా అమలు చేస్తున్నారు కూటమి నేతలు. దెందులూరులో టీడీపీ నాయకుడు చింతమనేని కనుసన్నల్లో రెడ్‌బుక్ అమలు జరుగుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి టీడీపీ శ్రేణులు మూకుమ్మడి దాడికి చేశాయి. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.దెందులూరులో చింతమనేని కనుసన్నల్లో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి కూటమి నేతలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నివాసంపై టీడీపీ మూకలు దూసుకెళ్లారు. అంతేకాకుండా అబ్బయ్య చౌదరికి చెందిన చేనులో పామాయిల్ గెలలు కోస్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు వారిని ప్రశ్నించగా దాడికి దిగారు. దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. -
ముసునూరులో ఉద్రిక్తత
‘వనజాక్షి’ ఘటన విచారణ కమిటీ ఎదుటే చింతమనేని వర్గం దౌర్జన్యం సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దాడికి పాల్పడిన ఘటనలో విచారణ ఉద్రిక్తతకు దారి తీసింది. ద్విసభ్య కమిటీ సభ్యులు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ, సెర్ప్ సీఈఓ సాల్మన్ ఆరోగ్యరాజ్ గురువారం విచారణ జరిపారు. ఘటన జరిగిన ముసునూరు మండలం, రంగంపేట, పెదవేగి మండలం విజయరాయి ఇసుక రీచ్లప్రాంతాన్ని పరిశీలించేందుకు బృందం వెళ్లింది. వనజాక్షిపై దాడికి దారితీసిన పరిస్థితులను ముసునూరు నాయకుడు, మాజీ ఎంపీపీ వైఎస్సార్ చౌదరి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులకు వివరిస్తుండగా, అప్పటికే డ్వాక్రా మహిళల ముసుగున వందలాది మంది మహిళలు, అనుచరగణంతో అక్కడికి చేరుకున్న చింతమనేని వర్గం అడ్డుతగిలి దాడికి యత్నించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కమిటీ సభ్యులు విజయవాడ సబ్-కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరుపుతామంటూ అక్కడి నుంచి నిష్ర్కమించారు. విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో విచారణకు బాధితురాలు వనజాక్షి, చింతమనేని హాజరయ్యారు. దాదాపు 5 గంటలపాటు విచారణ కమిటీ అందరి అభిప్రాయాలు సేకరించింది. తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వనజాక్షి కమిటీ సభ్యులను కోరారు. రంగంపేట-విజయరాయి ఇసుక క్వారీ వివాదం నేపథ్యంలో రీ-సర్వే చేసి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తాను తప్పు చేసినట్టు తేలితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలుగుతానని చింతమనేని స్రవాల్ విసిరారు.