breaking news
China protests
-
దీక్షగా ‘ఆయుష్మాన్ భారత్’
ఇటానగర్: సుమారు 50 కోట్ల మందికి ఆరోగ్య రక్షణ కల్పించే ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ను ప్రభుత్వం దీక్షగా చేపడుతోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమైన ఈ పథకంతో ఆరోగ్య రంగంలో సమూల మార్పులు వస్తాయన్నారు. మోదీ గురువారం అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో టోమో రీబా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ భవనానికి శంకుస్థాపన చేశాక నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల పరిమితిలో ఆరోగ్య రక్షణ కల్పించే వ్యవస్థను దేశంలో ప్రవేశపెట్టేందుకు ఇదే తగిన సమయం’ అని అన్నారు. అరుణాచల్ పర్యటనపై చైనా నిరసన ప్రధాని మోదీ అరుణాచల్‌లో పర్యటించడాన్ని చైనా తప్పు పట్టింది. ఆ భూభాగం తమ అధీనంలోని దక్షిణ టిబెట్‌లో భాగమని పునరుద్ఘాటించింది. సరిహద్దు వివాదాన్ని సంక్లిష్టం చేసేలా వ్యవహరించొద్దని భారత్‌కు సూచించింది. మోదీ పర్యటనపై భారత్‌కు దౌత్య మార్గాల్లో తీవ్ర నిరసన తెలుపుతామని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి షువాంగ్ చెప్పారు. సరిహద్దు సమస్యలపై చైనా వైఖరి స్పష్టంగా ఉందన్నారు. -
మోదీ పర్యటనకు చైనా నిరసన
షాంగై: ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను ఇరుదేశాల మధ్య సంబంధాల కోసం కాదని దీనికి చైనా అధికారికంగానే నిరసన తెలిపినట్టు ఆ దేశం శుక్రవారం ప్రకటించింది. మనదేశానికి చైనాతో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమస్యలున్నాయి. వారు ఆ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా పిలుస్తారు. అక్కడి తవాంగ్ ప్రాంతం టిబెట్ బుద్ధిజానికి ముఖ్యప్రదేశం. చైనా ఆ ప్రాంతాన్ని 1962 యుద్దం సందర్భంగా ఆక్రమించిన విషయం తెలిసిందే. భారత్, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు మోదీ ఈ పర్యటనకు రావడం లేదని చైనా పేర్కొంటుంది. ప్రధాని మోదీ శుక్రవారం అరుణాచల్ ప్రదేశ్ లో ఓ రైల్వే లైన్, పవర్ స్టేషన్ లను ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో మౌలికవసతుల కల్పనకు, అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తామని చెప్పారు. 'గత 28 ఏళ్లలో ఎప్పుడు జరగని అభివృద్ధి కార్యక్రమాలను కేవలం ఈ ఐదేళ్లలో చేసి చూపిస్తాం' అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఆ ప్రాంత అభివృద్దికి దోహదం చేస్తాయన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గత జనవరిలో భారత్ పర్యటనతో ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలు మెరుగైనట్టు కనిపిస్తున్నాయి. ఒబామా పర్యటన చైనాపై చాలా ప్రభావం చూపించింది. దీంతో చైనా నౌకా దళాలు హిందూ మహాసముద్రంపై తమ ఆధిక్యం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కనపిస్తోంది.