నేరం ఎవరిది?
                  
	విజయనగరం ఫోర్ట్:  స్థానిక రైల్వేస్టేషన్‌కు ఎదురుగా ఉన్న మురు గు కాలువలో శుక్రవారం  తెల్లవారుజామున 3గంటల సమయంలో ఓ మగశిశువు ఏడుపు వినిపిం చడంతో అటుగా టీ తాగడానికి వెళ్లిన రైల్వే కలాసీ రెడ్డి సత్యనారాయణ చూసి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది  సంఘటన స్థలానికి చేరుకుని శిశువును చికిత్స నిమిత్తం ఘోషాఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు.  ఘోషాఆస్పత్రి వైద్యులు శిశువుకు వైద్యసేవలు అందిస్తున్నారు.
	 
	ఆస్పత్రికి వచ్చిన బాలల సంరక్షణ ప్రతినిధులు
	శిశువు ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న చైల్డ్‌లైన్, శిశుగృహ, బాలల సంరక్షణ విభాగం, బాలల సంక్షేమ కమిటీ ప్రతినిధులు ఆస్పత్రికి చేరుకుని శిశువు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.  ఆస్పత్రి వద్దే ఉండి శిశువు వైద్యానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
	 
	కన్న మమకారంతో ఆస్పత్రికి  వచ్చిన ఓ మహిళ
	ఏతల్లికన్నబిడ్డో, ఎంత కష్టం వచ్చిందో అని ఆస్పత్రి సిబ్బంది అనుకుంటున్న సమయంలో ఓమహిళ  వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది తనబిడ్డేనని,  బిడ్డను ఇచ్చేయాలని కోరింది.  తనది విజయనగరంలోని బొగ్గులదిబ్బ ప్రాంతమని, పేరు యడ్ల అచ్చియ్యమ్మ అని చెప్పింది. గురువారం రాత్రి ఇంటి వద్దే  ప్రసవించానని తెలిపింది. తనకు  ఇదివరలో ఒక పాప ఉందని, భర్తకు  పిల్లలు ఇష్టం లేకపోవడంతో శిశువును మురుగు కాలువ వద్ద పడేశానని చెప్పిందని శిశు గృహ మేనేజర్ చలం తెలిపారు.
	 
	పూర్తిస్థాయిలో విచారణ తరువాత శిశువు అప్పగింత
	శిశువు ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత పూర్తిస్థాయిలో విచారించి  ఆమె బిడ్డ అని నిర్ధారణ అయితే శిశువును అప్పగిస్తామని బా లల సంక్షేమ కమిటీ చైర్మన్ కేసలి అప్పారావు  తెలిపారు.