breaking news
Chief Minister Tarun Gogoi
-
'నీ సర్టిఫికెట్ నెహ్రూకు అవసరం లేదు'
గువాహటి: భారత తొలి ప్రధాని పండిట్ జవహార్ లాల్ నెహ్రూకి కేంద్రమంత్రి కిరేణ్ రిజిజు నుంచి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అన్నారు. ఇప్పటి వరకు తన సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌కు కాస్తయినా మంచి చేయని కిరేణ్కు దేశం గర్వించదగిన మాజీ ప్రధాని గురించి మాట్లాడే యోగ్యత లేదన్నారు. శనివారం కిరేణ్ హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ 1962నాటి ఇండియా చైనా యుద్ధ సమయంలో నెహ్రూ ఈశాన్య ప్రాంత ప్రజలను గాలికొదిలేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై గొగోయ్ ఆదివారం స్పందించారు. నెహ్రూపై కేంద్రమంత్రి తప్పుడు ప్రచారం, అభాండాలు మోపడం మానుకుంటే మంచిదని చెప్పారు. ఎలాంటి క్లిష్టపరిస్థితులు చైనాతో ఏర్పడినా నెహ్రూ ప్రజలను వదిలేయలేదని, ఆయన సమర్థతను నిరూపించుకున్నారని, తన సొంత రాష్ట్రాన్ని పట్టించుకోని ఓ కేంద్రమంత్రి(కిరేణ్) నుంచి సర్టిఫికెట్ పొందాల్సిన అవసరం నెహ్రూకు లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అరుణాచల్ ప్రదేశ్‌కు ఓ రాష్ట్రంగా గుర్తింపు వచ్చిందని, అభివృద్ధి బాటపట్టిందనే విషయం కిరేణ్ గుర్తుంచుకుంటే బాగుంటుందన్నారు. ఎన్డేయే హయాంలో అరుణాచల్ ప్రదేశ్‌కు ఏం చేశారని మండిపడ్డారు. -
'చైనా డ్యామ్‌లతో ఎలా.. మోదీ జీ పట్టించుకోండి'
గువాహటి: బ్రహ్మపుత్ర నదిపై చైనా పెద్ద పెద్ద ఆనకట్టలు కడుతుండటం పట్ల అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్ధం కావడం లేదని అన్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. చైనాను అలాగే అనుమతిస్తే అసోం మొత్తం ప్రమాదపుటంచుల్లోకి వెళుతుందని, ఆ డ్యాంల దిగువ ప్రాంతాలన్నీ కూడా దెబ్బతింటాయని అన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ మౌనాన్ని వీడి వెంటనే తీవ్రంగా స్పదించాలని కోరారు.