breaking news
Chickballapur
-
సరదాకు చేసిన ఫీట్ ప్రాణాల మీదకు తెచ్చింది.. వీడియో వైరల్
సరదాకు చేసిన ఓ ఫీట్ యువకుడిని ఆసుపత్రిపాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చింది. పోలీసులు హెచ్చరించినా వినిపించుకోకపోవడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇటీవల కర్నాటకలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొర్లిపొంగాయి. ఈ క్రమంలో చిక్కబళ్లాపూర్‌లోని శ్రీనివాస సాగర డ్యామ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో డ్యామ్ వద్ద ఉన్న గోడపై నుంచి డ్యామ్ నీళ్లు కిందకు వస్తున్నాయి. వేసవిలో దీన్ని చూసేందుకు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు(20) పై నుంచి నీళ్లు వస్తున్న సమయంలో సరదాకు ట్రెక్కింగ్ చేయబోయాడు. అతడు దాదాపు 25 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత పట్టుజారి పోవడంతో కింద పడిపోయాడు. కాగా, ఆనకట్ట దాదాపు 50 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఈ ప్రమాదంలో గాయపడిన యువకుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. ప్రమాదకర ఫీట్ చేయవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరించినా పట్టించుకోకుండా యువకుడి ఇలా చేయడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A man fell down the wall of Srinivasa Sagara Dam in #Chikkaballapur and got injured while he was attempting to scale the wall. Reports @dpkBopanna pic.twitter.com/KUpU1NRgyR — Sanjay Jha (@JhaSanjay07) May 23, 2022 ఇది కూడా చదవండి: మోదీని సర్ప్రైజ్ చేసిన బాలుడు.. ఆశ్యర్యపోయిన ప్రధాని -
నిద్రలోనే ఎత్తుకెళ్లి రేప్.. మర్డర్
సాక్షి, బెంగళూర్: మైనర్ బాలికను నిద్రలోనే కాటువేసింది ఓ మానవ మృగం. కిడ్నాప్, రేప్ చేసి ఆపై దారుణంగా ప్రాణం తీశాడు. కర్ణాటక చికబల్లాపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. బుధవారం సాయంత్రం ఇంటి బయట నిద్రించిన బాలికపై స్వయానా ఆమె మేనమామే తప్పతాగి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎత్తుకెళ్లి ఊరి బయట ఉన్న ఓ ఫామ్ హౌజ్ లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం హత్య చేసి సమీపంలోని పొదల్లో పడేశాడు. కూతురు కనిపించకపోయే సరికి కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతకగా, శవమై కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అనంతరం 25 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేశారు.