breaking news
chess games
-
రేపటి నుంచి అంధులకు చదరంగం పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : లూయీ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని అంధులకు ఈ నెల 2 నుంచి 4 వరకు చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు జాతీయ అంధుల సమాఖ్య అనంతపురం జిల్లా శాఖ అ«ధ్యక్ష, కార్యదర్శులు విజయభాస్కర్, రవి తెలిపారు. ఈ పోటీలు స్థానిక కృష్ణ కళా మందిరంలో జరుగుతాయన్నారు. అలాగే 3న నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో అంధుల క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. 4న ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జెడ్పీచైర్మన్ చమన్ ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. -
ముగిసిన జిల్లాస్థాయి చదరంగ పోటీలు
కరీంనగర్ స్పోర్ట్స్ :జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పెన్షనర్ల భవన్లో జరిగిన జిల్లాస్థాయి అండర్ 19, 25 చదరంగ పోటీలు ముగిశాయి. పోటీలకు జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు. ప్రతిభ కనబరిచినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అండర్ 25 విభాగంలో కె.విశ్వనాథ్, కె.శ్రీనివాస్, స్రవంతి, సుష్మారెడ్డి, మధురవాణి ఎంపికయ్యారు. కార్యక్రమంలో జిల్లా చదరంగ సమాఖ్య బాధ్యులు పాల్గొన్నారు.