breaking news
Chennai building collapse victims
-
నాయుడు కుటుంబానికి జగన్ పరామర్శ
-
నాయుడు కుటుంబానికి జగన్ పరామర్శ
విజయనగరం: చెన్నైలో బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు శాసనసభలో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయనగరం జిల్లాకు వచ్చారు. దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురం వెళ్లి పతివాడ బంగారు నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. నేలపై కూర్చుని వారి సాదకబాదకాలు సావధానంగా ఆలకించారు. ధైర్యం కోల్పోవద్దని ఓదర్చారు. అన్నివిధాలా అండగా ఉంటామని భరోసాయిచ్చారు. మరో ఆరు కుటుంబాలను ఈ రోజు పరామర్శించనున్నారు.