breaking news
chemical bottle
-
హైదరాబాద్ ముషీరాబాద్‌లో బాంబు కలకలం
-
స్కూల్ ల్యాబ్‌లో పగిలిన కెమికల్ బాటిల్
-
స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే: ఆర్డీవో
హైదరాబాద్ : హైదరాబాద్ టోలీచౌకీలోని 'ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్'లో విష వాయువుతో 16మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సికింద్రాబాద్ ఆర్డీవో తెలిపారు. విద్యార్థులకు క్యాండీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్కూల్లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తుండగా ల్యాబ్‌లో కెమికల్ బాటిల్ పగిలి విద్యార్థులు స్వల్పంగా గాయపడిన అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఆర్డీవో మాట్లాడుతూ గాయపడిన 12మంది విద్యార్థులకు శస్త్రచికిత్స చేసి డిచ్చార్జ్ చేశారని, మరో నలుగురికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. 7వ తరగతి వరకే స్కూల్ నిర్వహించేందుకు అనుమతి ఉందని, అయితే 10వ తరగతి వరకూ నడిపిస్తున్నారని, స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందన్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
స్కూల్ ల్యాబ్‌లో పగిలిన కెమికల్ బాటిల్
హైదరాబాద్: పాతబస్తీ పరిధిలోని టోలీచౌకీ ప్రాంతంలో ఓ స్కూల్ ల్యాబ్‌లో కెమికల్ బాటిల్ పగిలి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వాళ్లందరినీ అక్కడకు సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సికింద్రాబాద్ ఆర్డీవో మాట్లాడుతూ స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే ఘటనకు కారణమని ...7వ తరగతి వరకే గుర్తింపు ఉన్నా టెన్త్ వరకూ నడిపిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.