breaking news
cheater Augustine arrested
-
మోస్ట్ వాంటెడ్ చీటర్ అగస్టిన్ అరెస్ట్
-
మోస్ట్ వాంటెడ్ చీటర్ అగస్టిన్ అరెస్ట్
హైదరాబాద్ : ప్రజాప్రతినిధులకు కోట్లలో కుచ్చుటోపి పెట్టిన మోస్ట్ వాంటెడ్ చీటర్ అగస్టిన్ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సోలార్ పవర్ కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ ప్రజాప్రతినిధుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. అనంతరం పరారీలో ఉన్న నిందితున్ని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అగస్టిన్ బాధితుల్లో నల్లగొండ జిల్లాకు ఓ ఎమ్మెల్యే సోదరుడితో పాటు పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. అగస్టిన్ మోసాలపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పోలీసులు అగస్టిన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.