breaking news
cheap prices
-
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
భారతదేశంలో బంగారం ధర (10 గ్రాములకు) రోజుకు రోజుకు రయ్ మంటూ దూసుకెళ్లి రూ.లక్షను తాకింది. ఇక రవ్వంత బంగారమైనా కొనగలమా అని సామాన్యులను నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలో భారత్ కంటే చవగ్గా బంగారం దొరికే దేశాలు ఏమైనా ఉన్నాయా అనే ఆలోచన చాలా మందిలో వచ్చే ఉంటుంది.తక్కువ దిగుమతి సుంకాలు, పన్ను మినహాయింపులు, పోటీ మార్కెట్లు, కరెన్సీ మారకం రేట్ల కారణంగా అనేక దేశాలు భారత్ కంటే తక్కువ ధరలలో బంగారాన్ని అందిస్తున్నాయి. 2025 ఆరంభంలో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా భారతదేశం కంటే చౌకగా బంగారం లభించే దేశాలేవో ఇక్కడ తెలియజేస్తున్నాం.దుబాయ్, యూఏఈ ఇక్కడ 24-క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.78,960 (2025 ఫిబ్రవరి నాటికి). ఎందుకు చౌక అంటే.. దుబాయ్ పన్ను రహిత బంగారం షాపింగ్‌కు ప్రసిద్ధి చెందింది. బంగారం కొనుగోళ్లపై వ్యాట్ లేదా దిగుమతి సుంకాలు ఉండవు. డీరాలోని గోల్డ్ సౌక్ అంతర్జాతీయ రేట్లకు దగ్గరగా పోటీ ధరలను అందిస్తుంది. భారతీయ ప్రయాణికులు పురుషులైతే 20 గ్రాములు, మహిళలైతే 40 గ్రాములు వరకు డ్యూటీ ఫ్రీగా తీసుకెళ్లవచ్చు. కానీ ఎక్కువ మొత్తంలో దిగుమతి చేస్తే 6% కస్టమ్స్ డ్యూటీ పడుతుంది.హాంకాంగ్ ఈ దేశంలో 24-క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.79,400 (2025 ఫిబ్రవరి నాటికి) ఉంది. హాంకాంగ్ తక్కువ పన్నులు, పోటీ బంగారం మార్కెట్ నుండి ప్రయోజనం పొందుతుంది. బంగారం వాణిజ్య కేంద్రాలకు సమీపంలో ఉండటం, దిగుమతి సుంకాలు తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ భారతదేశం కంటే బంగారం ధరలు తక్కువగా ఉంటాయి.టర్కీ ఇక్కడ 24-క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.79,310 (2025 ఫిబ్రవరి నాటికి). ఇస్తాంబుల్‌లోని గ్రాండ్ బజార్లో టర్కీ శక్తివంతమైన బంగారం మార్కెట్ తక్కువ దిగుమతి సుంకాలు, బంగారం హస్తకళ సంప్రదాయం నుండి ప్రయోజనం పొందుతుంది, ధరలను పోటీగా చేస్తుంది. అయితే హస్తకళ, మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా ధరలు మారవచ్చు.👉ఇది చదవారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’ఇండోనేషియా 24-క్యారెట్ బంగారం 10 గ్రాములకు సుమారు రూ.71,880 (2024 అక్టోబర్ నాటికి). ఇండోనేషియా తక్కువ పన్నులు, పోటీ బంగారం మార్కెట్‌ను కలిగి ఉంది. జకార్తాలోని స్థానిక ఆభరణ వ్యాపారులు సరసమైన రేట్లకు బంగారాన్ని అందిస్తారు. 2025 ఏప్రిల్ నాటికి ధరలు కొద్దిగా పెరిగి ఉండవచ్చు. కానీ ఇండోనేషియాలో బంగారం ధర భారతదేశం కంటే గణనీయంగా చౌకగానే ఉంటుంది.మలావీ ఇక్కడ 24-క్యారెట్ బంగారం 10 గ్రాములకు సుమారు రూ.72,030 (2024 అక్టోబర్ నాటికి). పన్నులు లేదా సుంకాలు వంటి అదనపు ఖర్చులు తక్కువగా ఉండటం మలావీని ప్రపంచవ్యాప్తంగా బంగారానికి అతి చౌకైన మార్కెట్లలో ఒకటిగా చేస్తుంది. అయితే అంతర్జాతీయ కొనుగోలుదారులకు సౌకర్యం పరిమితంగా ఉండవచ్చు.కంబోడియా ఇక్కడ 24-క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.72,060 (అక్టోబర్ 2024 నాటికి). ఈ దేశంలో బంగారం ధర ఎందుకు చౌకగా ఉంటుందంటే.. కంబోడియా బంగారం మార్కెట్ తక్కువ పన్నులు, సుంకాల నుండి ప్రయోజనం పొందుతుంది. తక్కువ ధరలలో ఉన్నతమైన బంగారాన్ని అందిస్తుంది.కెనడాఈ దేశంలో 24-క్యారెట్ బంగారం 10 గ్రాములకు సుమారు రూ.72,070 (2024 నవంబర్ నాటికి). ఇక్కడ ఎందుకు చౌక అంటే.. కెనడా బంగారం మార్కెట్ తక్కువ పన్నులు, బంగారం ఉత్పత్తికి సమీపంలో ఉండటం నుండి ప్రయోజనం పొందుతుంది, ధరలను పోటీగా ఉంచుతుంది. అయితే కరెన్సీ మారకం హెచ్చుతగ్గులకు ధరలు లోబడి ఉంటాయి.ఇంగ్లండ్ఇంగ్లండ్లో 24-క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.70,370 (నవంబర్ 2024 నాటికి). ఇంగ్లండ్ బంగారం మార్కెట్ అత్యంత పోటీతత్వం కలిగి ఉంది. భారత్‌లో విధించే 3% జీఎస్టీ, దిగుమతి సుంకాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ పన్నులు ఉన్నాయి. అయితే రూపాయితో పోలిస్తే పౌండ్ బలం ధరలను ప్రభావితం చేస్తుంది.ఆస్ట్రేలియాఇక్కడ 24-క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.72,440 (2024 నవంబర్ నాటికి). ఈ దేశంలో బంగారం ధరలు చౌకగా ఉండటానికి కారణం ఇక్కడి దేశీయ ఉత్పత్తి, తక్కువ దిగుమతి సుంకాలు.ధరల అస్థిరత గ్లోబల్ ట్రెండ్లు, కరెన్సీ మారకం రేట్లు, భౌగోళిక రాజకీయ కారకాల కారణంగా బంగారం ధరలు రోజువారీగా హెచ్చుతగ్గులకు లోనవుతాయి. పైన పేర్కొన్న ధరలు 2024 అక్టోబర్ నుండి 2025 ఫిబ్రవరి వరకు డేటా ఆధారంగా ఉంటాయి. 2025 ఏప్రిల్ నాటికి కొద్దిగా మారి ఉండవచ్చు. -
భారత్ చమురు ఉత్పత్తుల జోరు
న్యూఢిల్లీ: చౌక ధరలో ఆఫర్ చేస్తుండటంతో రష్యా నుంచి భారత్ చమురును భారీగా దిగుమతి చేసుకుంటోంది. దిగుమతైన చమురుతో కొంతమేర పెట్రోలియం ప్రొడక్టులను రూపొందిస్తోంది. వీటిని తిరిగి ఎగుమతి చేస్తోంది. అయితే వీటిలో మూడో వంతు ప్రొడక్టులను జీ–7 తదితర సంపన్న దేశాలకు ఎగుమతి చేస్తుండటం ప్రస్తావించదగ్గ అంశం! ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా పలు యూరోపియన్ దేశాలు రష్యన్ చమురు ధరలపై పరిమితులు విధించాయి. అయితే శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను ఆయా దేశాలు కొనుగోలు చేసేందుకు విధానాలు అనుమతిస్తున్నాయి. వెరసి చట్టబద్ధంగా భారత్ నుంచి చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. నిజానికి రష్యా చమురు కొనుగోలుపై జీ7, ఈయూ, ఆ్రస్టేలియా ఎలాంటి ఆంక్షలనూ అమలు చేయనప్పటికీ 2022 డిసెంబర్లో బ్యారల్ ధర 60 డాలర్లకు మించి కొనుగోలు చేయకుండా పరిమితి విధించుకున్నాయి. తద్వారా రష్యాకు అధిక ఆదాయం లభించకుండా అడ్డుకునేందుకు నిర్ణయించాయి. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు జోరందుకోవడంతో రష్యా అదనపు లబ్ధి చేకూరకుండా చెక్ పెట్టేందుకు తీర్మానించాయి. అయితే ఆపై భారత్ నుంచి రష్యా చమురు ద్వారా తయారైన 6.65 బిలియన్ డాలర్ల(6.16 బిలియన్ యూరోలు) విలువైన చమురు ఉత్పత్తులు ఆయా దేశాలకు ఎగుమతి అయినట్లు ఫిన్లాండ్ సంస్థ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్(సీఆర్ఈఏ) వెల్లడించింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన గుజరాత్ జామ్‌నగర్ రిఫైనరీ నుంచి 5.2 బిలియన్ యూరోల ఎగుమతులున్నట్లు ఒక నివేదికలో పేర్కొంది. -
చైనాలో చవగ్గా ఎలక్ట్రిక్ వాహనాలు.. వెస్ట్రన్ ఆటో దిగ్గజాల్లో దిగులు!
యునైటెడ్ స్టేట్స్లో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే సాధారణ పెట్రోల్, డీజీల్ వాహనాల కంటే రెండు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే చైనాలో అయితే కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనాలంటే మామూలు పెట్రోల్, డీజీల్ వాహనం కంటే చవగ్గా దాదాపు 9 శాతం తక్కువ ధరకే లభిస్తుంది. ఇదే అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజాలకు గుబులు పుట్టిస్తోంది. ఆటోమోటివ్ పరిశ్రమలో విస్తృతంగా పెరుగుతున్న ధరల అంతరానికి ఇది సంకేతంగా నిలుస్తోంది. యూఎస్, యూరప్, ఇతర ప్రాంతాలలో లెగసీ ఆటోమేకర్లు విక్రయిస్తున్న ఈవీలు ఇప్పటికీ వాటి సంప్రదాయ ఇంధన వాహనాల కంటే ఎక్కువ ధరను కలిగి ఉన్నాయి. కానీ చైనాలో సామాన్యులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయగలిగేలా వాటి ధరలు ఉన్నాయి. చైనాలో సగం ధరకే.. గ్లోబల్ ఆటోమోటివ్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జేఏటీవో డైనమిక్స్ (JATO Dynamics) డేటా ప్రకారం.. 2023 ప్రథమార్థంలో సగటు ఈవీ ధర యూరోప్‌లో 66,864 యూరోలు (ప్రస్తుత మారకపు ధరల ప్రకారం రూ.59 లక్షలు), యూఎస్‌లో 68,023 యూరోలు (రూ.60 లక్షలు) . దీనికి విరుద్ధంగా చైనాలో మాత్రం సగటు ఈవీ ధర సగం కంటే తక్కువ అంటే కేవలం 31,165 యూరోలు (రూ.27.5 లక్షలు) ఉంది. -
లాభాల బాటలోనే స్పైస్‌జెట్..
భారీగా తగ్గిన ఇంధన, ఇతర వ్యయాలు న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో రూ.24 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇంధనం ధరలతో పాటు ఇతర వ్యయాలు కూడా భారీగా తగ్గడంతో ఈ క్వార్టర్లో లాభం వచ్చిందని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. కంపెనీకి లాభాలు రావడం ఇది వరుసగా మూడో క్వార్టర్ అని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో కంపెనీకి రూ.310 కోట్ల నికర నష్టాలు వచ్చాయని తెలిపారు. అయితే గత క్యూ2లో రూ.1,450 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో 28 శాతం క్షీణించి రూ.1,040 కోట్లకు పడిపోయిందన్నారు. ఇంధనం బిల్లు రూ.788 కోట్ల నుంచి 57% క్షీణించి రూ.338 కోట్లకు, ఇతర వ్యయాలు రూ.1,749 కోట్ల నుంచి రూ.1,068 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఈ క్యూ2లో 92.8% లోడ్ ఫ్యాక్టర్ సాధించామని, దేశీ విమానయాన రంగంలో ఇదే అత్యధికమని చెప్పారు. -
చంద్రన్న సంక్రాంతి కానుక డౌటే !
కడప సెవెన్‌రోడ్స్ : సంక్రాంతి పర్వదినానికి ప్రభుత్వం పేదలకు అందించే గిఫ్ట్ సరుకులు సకాలంలో అందుతాయూ అనేది సందేహంగా ఉంది. పండుగ రోజు పిండి వంటలతో పేదల ఇళ్లు ఘుమఘుమ లాడాలని రాష్ట్ర ప్రభుత్వం ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పేరుతో ఆరు సరుకుల గిఫ్ట్ ప్యాక్‌ను చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, సంక్రాంతికి సకాలంలో అందించగలమా? అని పౌరసరఫరాల అధికారుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సమయం చాలా తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. పైగా సంచుల కొరత, ప్యాకింగ్ వంటి సమస్యలు వేధిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా ఉన్నతాధికారులు మాత్రం ఈనెల 6వ తేదీ నుంచి గిఫ్ట్ ప్యాక్‌లను జిల్లాలకు సరఫరా చేసేందుకు చర్యలు చేపడతామంటున్నారు. ఒకవేళ అన్నీ అనుకూలిసే ్త ఈ నెల 10వ తేదీ నాటికి గిఫ్ట్ ప్యాక్‌లు జిల్లాకు చేరుకునే అవకాశం ఉంటుందని ఇక్కడి అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నాటికి చౌక ధరల దుకాణాలకు గిఫ్ట్ ప్యాక్‌లు చేరాలని ప్రభుత్వం చెబుతోంది. అలా చేరినపుడే పండుగ సమయానికి ప్రజలకు ప్యాక్‌లు అందజేయడానికి అవకాశం ఉంటుంది. గిఫ్ట్ ప్యాక్‌లో ఒకటైన శనగలను అధికారులు జిల్లా స్థాయిలోనే సేకరించారు. గిఫ్ట్ ప్యాక్‌లు ఈనెల 10వ తేదీకి జిల్లాకు చేరినప్పటికీ శనగల ప్యాకెట్లను కూడా వాటిలో చేర్చి అన్నీ కలిపి ఒక సంచిలో నింపడానికి సమయం పడుతుందని అంటున్నారు. ప్యాక్ చేసిన కానుకలను మండల స్థాయి స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి చౌక ధరల దుకాణాలకు సరఫరా చేయడానికి కొన్ని రోజుల సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఆరు సరుకులు ఇవే... జిల్లాలో బియ్యం కార్డులు 6,14,924, రచ్చబండ కూపన్లు 26,718, అంత్యోదయ అన్న యోజన కార్డులు 59,289, అన్నపూర్ణ కార్డులు 799 వెరసి 7,01,730 ఉన్నాయి. ఒక్కో కార్డుదారుకు ఒక గిఫ్ట్ ప్యాక్ చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఒక్కో ప్యాక్‌లో అర కిలో కందిపప్పు, కిలో శనగలు, అరకిలో బెల్లం, కిలో గోధుమపిండి, అరకిలో పామోలిన్, 100 గ్రాముల నెయ్యి ఉంటాయి.