breaking news
Charitable funds
-
ఆపన్నులకు కానుక..అసలైన వేడుక..
అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో వేడుకలు నిర్వహించేందుకు అనేక మంది వ్యక్తులు, సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. తొలి దశలో తమ పుట్టినరోజులను జరుపుకోడానికి వీటిని నగరవాసులు ఎక్కువగా ఎంచుకున్నప్పటికీ, అనంతర కాలంలో క్రమంగా పెళ్లిరోజు, ప్రమోషన్, రిటైర్మెంట్ ఇలా ప్రతి సందర్భాన్నీ వారితో పంచుకునేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. ప్రత్యేక తేదీల నుంచి పండుగలు, నూతన సంవత్సరం వేడుకలు మొదలు.. అనేక రకాల వేడుకలు వీటికి జతకలిశాయి. బోలెడంత ఖర్చు పెట్టి పబ్స్, క్లబ్స్‌లో ఫ్రెండ్స్‌తో గడిపేకన్నా.. నిరుపేదల కడుపు నింపడమే మిన్న అని కొందరు అనుకుంటుంటే మరికొందరేమో.. అటు అన్నార్తులతోనూ, ఇటు బంధుమిత్రులతోనూ వేర్వేరుగా వేడుకలు నిర్వహించుకుంటున్నారు. మరికొందరైతే ఏకంగా వృద్ధాశ్రమాలు, అనాథశరణాయాలతోనే సరిపెట్టుకుంటున్నారు. తమకు తోచిన సాయాన్ని అందించడంతోపాటు వారికి అండగా నిలుస్తున్నారు. ఆద్యంతం.. ఆనందం.. ఈ తరహా వేడుకలు ట్రెండ్ నగరంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పలు స్వచ్ఛంద సంస్థలకు ప్రోత్సాహకరంగా మారింది. ఈ వేడుకల్లో భాగంగా ఆశ్రమాలు, హోమ్స్‌లో ఉన్నవారితో కలిసి కేక్ కటింగ్, ఆటపాటలతో అలరించడం, విందు వినోదాలు, బహుమతులను పంచడంతో పాటు కొందరు ఆర్థిక సహకారం కూడా అందిస్తున్నారు. తద్వారా నిర్వహణ భారాన్ని కూడా పంచుకుంటున్నారు. కొందరు మరింత ముందుకెళ్లి ఆయా హోమ్స్‌లో ఉంటున్నవారిని సినిమాలకు, జూ పార్క్, సిటీ టూర్స్.. తదితరాలకు తీసుకెళుతూ వారికి మరచిపోలేని అనుభవాలను, వారు వ్యక్తిగతంగా పొందలేని ఆనందాన్ని, అనుభవాలను వారికి అందిస్తున్నారు. ఒంటరితనాన్ని దూరంచేస్తూ.. ఇలాంటి కార్యక్రమాలు తమకు ఎవరూ లేరనే ఆవేదనను ఆపన్నుల నుంచి తాత్కాలికంగానైనా దూరం చేస్తున్నాయి. ‘ఎంత డబ్బులు ఖర్చు చేశాం అనేదాని కన్నా ఎంత మందికి నిజమైన సంతోషాన్ని అందించగలిగాం? అనేదే ముఖ్యం. వారిలోని ఒంటరితనాన్ని దూరం చేసేందుకు.. నా పుట్టిన రోజును ప్రతిసారీ ఏదో ఒక వృద్ధాశ్రమంలో, ఆర్ఫన్ హోమ్స్‌లో జరుపుకోవడం ఒక అలవాటుగా మార్చుకున్నాను’ అని చెప్పారు హైదరాబాద్ నగరానికి చెందిన మహిళా వ్యాపారవేత్త విభాజైన్. తనను చూసి తన స్నేహితులు మరికొంత మంది కూడా ఇదే బాట అనుసరిస్తున్నారంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు. మేము సైతం అంటున్న ఈవెంట్ ఆర్గనైజర్లు.. హైదరాబాద్ నగరవాసుల్లో ఈ తరహా వేడుకల నిర్వహణ పట్ల పెరుగుతున్న ఆసక్తి దీని కోసం ప్రత్యేకంగా ఈవెంట్ మేనేజర్లు సైతం పుట్టుకురావడానికి దోహదం చేసింది. సంపన్న వ్యాపారుల పుట్టిన రోజులు, పెళ్లి రోజులు వంటివి అనాథలు, నిరుపేదల నడుమ జరుపుకునేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేయడం ద్వారా పలువురు ఈవెంట్ నిర్వాహకులు సిటీలో ఈ తరహా కార్యక్రమాలు ఊపందుకోడానికి కారణమవుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి వేడుకలకు సోషల్ మీడియా ద్వారా అద్భుతమైన స్పందనను రాబట్టే పని సైతం వీరే నిర్వహిస్తుండడం విశేషం. ఏది ఏమైనా నగరంలో నిరుపేదలకు, అనాథలకు ఈ తరహా వేడుకలు ఎంతో ఉపయుక్తంగా మారాయనేది నిస్సందేహం.పండుగలు సైతం.. తొలుత ఆర్ఫన్ హోమ్స్, ఆశ్రమాల్లో సిటిజనులు పుట్టినరోజులే ఎక్కువగా జరుపుకునే వారు. అయితే ఆ ధోరణి మరింతగా పుంజుకుంటుండగా.. ప్రస్తుతం కాదేదీ సాయానికి అనర్హం అన్నట్టుగా మరికొన్ని ముఖ్యమైన సందర్భాలనూ వాటికి జతచేస్తున్నారు. ముఖ్యంగా వినాయకచవితి రోజునఅనాథ చిన్నారులతో కలిసి వినాయక ప్రతిమలు తయారు చేయడం వంటివి, అలాగే దీపావళి రోజున వృద్ధులు, చిన్నారులతో కలిసి టపాసులు కాల్చడం.. వంటివి చేస్తున్నారు. ఇలా సంప్రదాయ పండుగలు జరుపుకోవడం మొదలుకుని.. ఫ్రెండ్ షిప్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, న్యూ ఇయర్ వంటి ఆధునిక పార్టీల వరకూ ఈ ట్రెండ్‌కు జతచేస్తున్నారు. ‘నా కన్నతల్లి నాకు దూరమైనప్పటి నుంచీ మాతృదినోత్సవం రోజున ఓ వృద్ధాశ్రమంలో ఎందరో కన్నతల్లులతో కలిసి గడపడం ఒక అలవాటుగా మార్చుకున్నాను. అది నాకెంతో సంతృప్తిని అందిస్తోంది’ అని చెబుతున్నారు నగరానికి చెందిన డిజైనర్ రజితారాజ్. (చదవండి: అమ్మానాన్నల హక్కు కాదు..! అది కేవలం పిల్లల హక్కు..) -
షాకింగ్! బ్రిటన్ ప్రిన్స్‌కు బిన్ లాడెన్ కుటుంబం నుంచి విరాళాలు!
లండన్: బ్రిటన్ రాజవంశ వారసుడు ప్రిన్స్ చార్లెస్.. ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి ఒక మిలియన్ పౌండ్లు(రూ.9.6కోట్లు) విరాళంగా తీసుకున్నారని ది సండే టైమ్స్ వెల్లడించింది. ఈ మొత్తం చార్లెస్‌కు చెందిన చారిటబుల్ ట్రస్టులో జమ అయినట్లు తెలిపింది. అమెరికా ట్విన్ టవర్లపై దాడి(9/11) ఘటనలో బిన్ లాడెన్ ప్రధాన సూత్రధారి. అలాంటిది ఆయన సోదరులు బకర్ బిన్ లాడెన్, షఫీక్‌ల నుంచి ప్రిన్స్ చార్లెస్ భారీ విరాళం తీసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే సౌదీకి చెందిన వీళ్లు ఏదైనా తప్పు చేశారా? అనే విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. కానీ ఇప్పటికే నేరపూరిత ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్స్ చార్లెస్ చారిటబుల్ ట్రస్టులపై అధికారుల నిఘా మరింత పెరిగింది. 2013లో బకర్ లాడెన్‌ను ప్రిన్స్ చార్లెస్ లండన్‌లో కలిసినప్పుడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చారిటబుల్ ఫండ్(పీడబ్ల్యూసీఎఫ్)కు విరాళం అందిందని నివేదిక తెలిపింది. ట్రస్టు సలహాదారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రిన్స్ దీన్ని అంగీకరించారని పేర్కొంది. అయితే ఆ సమయంలో ట్రస్టులోని ఐదుగురు సభ్యులు విరాళం తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారని పీడబ్ల్యూసీఎఫ్ ఛైర్మన్ ఇయాన్ చెషైర్ వెల్లడించారు. సౌదీ వ్యాపారవేత్తతో క్యాష్ ఫర్ ఆనర్స్ కుంభకోణం ఆరోపణలపై ప్రిన్స్ చార్లెస్‌కు చెందిన మరో చారిటబుల్ ట్రస్టుపై బ్రిటిష్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆరోపణలపై అంతర్గత విచారణ అనంతరం ప్రిన్స్ పౌండేషన్ ముఖ్య అధికారి గతేడాదే రాజీనామా చేశారు. చదవండి: సర్వస్వం కోల్పోయినా పెంపుడు కుక్కను మాత్రం వదల్లేదు.. -
ఏం మాయ చేశారో..!
- మొన్న ఎంఈవోల సస్పెన్షన్.. నిన్న ఎత్తివేత - అవినీతి, అక్రమాలకు అధికారుల జేజేలు - ఎమ్మెల్యే ఒత్తిడితో జీ హుజూర్ - పది రోజుల్లోనే సస్పెన్షన్ల ఎత్తివేత - ఆర్జేడీ కేంద్రంగా తారుమారైన ఉత్తర్వులు సాక్షిప్రతినిధి, కరీంనగర్: బాల కార్మికులకు నిర్దేశించిన రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లలో (ఆర్‌ఎస్‌టీసీ) భారీగా అవినీతి జరిగింది. పర్యవేక్షణ లోపంతోనే స్వచ్ఛంద నిధులు దుర్వినియోగం చేసిన అభియోగాలపై ప్రాథమిక బాధ్యులుగా అయిదుగురు ఎంఈవోలను, ఒక ఆల్స్కో కో-ఆర్డినేటర్‌ను సస్పెండ్ చేశారు. విజిలెన్స్ నివేదికల ఆధారంగా కలెక్టర్ సిఫారసు మేరకు వరంగల్‌లోని విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజులు తిరక్కముందే కథ మొదటికొచ్చింది. వీరిలో కొందరి సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్లు శనివారం ఆర్జెడీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వారం రోజుల్లోనే ఏం జరిగిందో...? ఎవరు సచ్ఛీలురని తేలిందో.. ఉన్నపళంగా సస్పెన్సన్లను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ కావటం అనుమానాలకు తెరలేపింది. వరంగల్‌లోని ఆర్జెడీ కార్యాలయం కేంద్రంగా జరిగిన ఈ సస్పెన్షన్ల వ్యవహారం ప్రహసనాన్ని తలపించింది. ఇంతకీ తెర వెనుక ఏం జరిగింది... రాజకీయ నేతల ఒత్తిళ్లా... అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలా.. డబ్బులు, పైరవీలకు ఫైళ్లు కదిపారా... అనేది అందరి నోటా చర్చనీయాంశంగా మారింది. కారణమేదైనా.. ఆర్జేడీ కార్యాలయం నుంచి ఇటీవల వెలువడ్డ సప్పెన్షన్ ఉత్తర్వులు ఒక్కటొక్కటిగా అభాసుపాలైన తీరు విద్యాశాఖ పరువును బజారుకీడిస్తున్నాయి. ఏప్రిల్‌లో మల్లాపూర్ ఎంఈవో రవీందర్ సస్పెండయ్యారు. ప్రైవేటు పాఠశాలలో చదివిన తన కుమార్తెకు ప్రభుత్వ పాఠశాలలో చదివినట్లు తప్పుడు సర్టిఫికెటు ఇప్పించినఫిర్యాదులపై ఆయనపై విచారణ జరిగింది. డీఈవో ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్జేడీ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలోనే ఆయన సస్పెన్షన్ ఎత్తివేయటంతో పాటు ఎల్కతుర్తి ఎంఈవోగా బాధ్యతలు అప్పగించారు. దీంతో జిల్లాలోని ఉపాధ్యాయ వర్గాలు బిత్తరపోయాయి. తప్పు చేసినందుకు రవీందర్‌పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. సస్పెన్షన్ చేసినట్లు నాటకమాడి తాను కోరుకున్న చోటికి బదిలీ చేయటం విమర్శల పాలైంది. బదిలీల నిషేధం అమల్లో ఉన్న సమయంలో తాము కోరుకున్న చోటికి బదిలీ చేసేందుకు ఆర్జేడీ కేంద్రంగా సస్పెన్షన్ల డ్రామా సాగుతోందని.. పైసలు, పైరవీలతోనే అక్కడ ఫైళ్లు కదులుతున్నాయనే ఆరోపణలకు తెరలేచింది. అదే వరుసలో బాలకార్మికుల ప్రత్యేక శిక్షణ కేంద్రాల సస్పెన్షన్లు సైతం ఇప్పుడు నవ్వుల పాలయ్యాయి. ఈనెల 3న ఆర్‌ఎస్‌టీసీల్లో అక్రమాలకు బాధ్యులుగా జిల్లాలో అయిదుగురు ఎంఈవోలు, ఆర్వీఎం ప్రత్యామ్నాయ పాఠశాలల కో-ఆర్డినేటర్‌ను సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ బాలయ్య ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ ఎంఈవో వేణుగోపాల్, ఎల్లారెడ్డిపేట ఎంఈవో రాజయ్య, రామగుండం ఎంఈవో మధుసూదన్, కాటారం ఎంఈవో కిషన్‌రావు, మంథని ఎంఈవో గంగాధర్, అలెస్కో జిల్లా కో-ఆర్డినేటర్ జయరాజ్ సస్పెండైన వారిలో ఉన్నారు. వీరి పర్యవేక్షణ లోపంతోనే ఆర్ఎసీటీసీల్లో భారీగా నిధులు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ సిఫారసు మేరకు ఈ వేటు పడింది. కనీసం పది రోజులు తిరక్కముందే... వీరి సస్పెన్షన్లు ఎత్తి వేయటం అనుమానాలకు తావిచ్చింది. ఆర్‌ఎస్‌టీసీ నిధుల విషయంలో తమ ప్రమేయం లేదని ఎంఈవోలు అధికార పార్టీకి చెందిన ఓ యువ ఎమ్మెల్యేకు విన్నవించుకోవటంతో... ఆయనే ఆర్జేడీపై ఒత్తిడి పెంచి సస్పెన్షన్లు ఎత్తి వేయించినట్లు తెలుస్తోంది. నిధులు దుర్వినియోగమవుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తిన తరుణంలోనే జిల్లా అధికారులు ఆర్‌ఎస్‌టీసీలకు విడుదల చేసే నిధుల్లో 30 శాతం కోత విధించారు. దీంతో అవినీతికి మోకాలడ్డనట్లయింది. అదే నిధుల కోతను సాకు చూపించి.. అవినీతి, అక్రమాల్లో తమ ప్రమేయం లేదని ఎంఈవోలు సస్పెన్షన్ల వేటు నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఆర్‌ఎస్‌టీసీలు అవినీతి కూపాలుగా మారినట్లు విజిలెన్స్ విభాగం వేలెత్తి చూపటం కొసమెరుపు.