breaking news
Chandigarh Municipal Corporation
-
బీజేపీకిలోకి ముగ్గురు కౌన్సిలర్లు.. ఆసక్తికరంగా చండీగఢ్ రాజకీయాలు
చండీగఢ్: బీజేపీకి భారీ షాక్ తగిలింది. చంఢీగఢ్ మేయర్ పదవికి ఆ పార్టీ నేత మనోజ్ సోంకర్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై నేడు(సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలో సోంకర్ రజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలిసి బీజేపీ చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో మోసాలకు పాల్పడిందని ఆప్, కాంగ్రెస్‌లు ఆరోపిస్తున్నాయి. జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కుల్దీప్ కమార్‌ను ఓడించి మేయర్‌గా గెలుపొందారు. బీజేపీకి 16 ఓట్లు రాగా.. కాంగ్రెస్ ఆప్‌కు సంబంధించి ఉమ్మడి అభ్యర్ధి కుల్దీప్ సింగ్‌కు 12 ఓట్లు సాధించారు. అయితే ఆప్ అభ్యర్థికి వచ్చిన 8 ఓట్లు చెల్లవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఆప్ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. చదవండి: Kejriwal: ఈడీ విచారణకు ఆరో‘సారీ’! రిటర్నింగ్ అధికారిపై సుప్రీం కోర్టు మండిపాటు ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 5న విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎన్నికల అధికారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసినట్లు వీడియో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. 'ఎన్నికల నిర్వహణ తీరు ఇదేనా? ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇది ప్రజాస్వామ్యం హత్యే. ఆయనపై విచారణ జరపాలి' అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు, వీడియోగ్రఫీని భద్రపరచాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి వ్యక్తిగతంగా హజరు కావాలని చెప్పి, తదుపరి విచారణను ఫిబ్రవరి 19కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఆప్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేశారు. పూనవ్ దేవి, నేహా, గుర్చరణ్ కాలా ఆదివారం కాషాయ కండువా కప్పుకున్నారు. మొతం 35 మంది సభ్యులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ 14 మంది కౌన్సిలర్లు ఉండగా తాజా చేరికలతో ఆ సంఖ్య 17కు చేరింది. వీరికి శిరోమణి అకాలీదళ్‌కు చెందిన ఓ కౌన్సిలర్ మద్దతు కూడా ఉంది. అంతేగాక బీజేపీ చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్‌కు కూడా ఎక్స్ ఆఫీషియోగా ఓటు హక్కును కలిగి ఉన్నారు. దీంతో బీజేపీకి మద్దతు సంఖ్య మొత్తం 19కి చేరింది. ఇక ఆప్‌కు 10 మంది కౌన్సిలర్లు ఉండా కాంగ్రెస్‌కు ఏడుగురు ఉన్నారు. -
పాత వస్తువుల విక్రేత నుంచి మేయర్ పీఠానికి..
చండీగఢ్ : గతంలో పాత వస్తువులు విక్రయించి పొట్టుపోసుకున్న రాజేష్ కలియా చండీగఢ్ నూతన మేయర్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 27 ఓట్లకు గాను 16 ఓట్లు రాబట్టిన కలియా అత్యున్నత పదవిని అలంకరించారు. తిరుగుబాటు నేత సతీష్ కైంథ్కు కేవలం 11 ఓట్లు పోలయ్యాయి. వాల్మీకి వర్గానికి చెందిన తాను అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్ధాయికి చేరుకున్నానని బీజేపీ తనను అక్కునచేర్చుకుని అందలం ఎక్కించిందని చెప్పుకొచ్చారు. తన తండ్రి కుందన్ లాల్ స్వీపర్‌గా పనిచేసేవారని, తన సోదరుల్లో ఒకరు ఇప్పటికీ స్వీపర్‌గా పనిచేస్తున్నారని చెప్పారు. తాను బాల్యంలో స్కూల్‌కు వెళ్లివచ్చిన తర్వాత పాత బట్టలు సేకరించి తన సోదరులతో కలిసి విక్రయించేవాడినని చెప్పారు. తాను ఎదుర్కొన్న కష్టాల నేపథ్యంలో తాను మేయర్‌గా ఎదుగుతానని ఎన్నడూ ఊహించలేదని కలియా పేర్కొన్నారు. 1984లో బీజేపీ, ఆరెస్సెస్‌లో చేరి ఈస్ధాయికి ఎదిగానన్నారు. రామ మందిర ఉద్యమంలో పాల్గొన్నందుకు తాను 15 రోజులు జైలు జీవితం గడిపానని చెప్పారు. -
మునిసిపల్ ఎన్నికల్లో కాషాయం కూటమి హవా
ఛండీగఢ్: ఛండీగఢ్ మునిసిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)- శిరోమణి అకాలీదళ్ హవా కొనసాగింది. డిసెంబర్ 18వ తేదీన జరిగిన మునిసిపాలిటీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నేడు నిర్వహించారు. అయితే మొత్తం 26 స్థానాలుండగా, 21 సీట్లను బీజేపీ-అకాలీదళ్ కూటమి కైవసం చేసుకుని విజయం సాధించింది. కాగా, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో గెలుపొందింది. 26 వార్డుల్లో మొత్తం 122 మంది అభ్యర్థులో పోటీచేయగా, 67 మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు. ఈ ఎన్నికల్లో 57 శాతం ఓటింగ్ నమోదైంది.