నిరుద్యోగుల‘చలో టీఆర్ఎస్ భవన్’
- అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్: జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల నియామాకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి ‘చలో టీఆర్ఎస్ భవన్’ పేరిట ర్యాలీగా టీఆర్ఎస్ భవన్కు బయలుదేరారు. దీంతో అప్రమత్తమైన ఓయూ పోలీసులు విద్యార్థులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులు ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు.