breaking news
Central team tour
-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
-
అత్యధిక కరోనా మరణాల రేటు ఆ రాష్ట్రంలోనే
కోల్‌కతా : 12.8 శాతం కరోనా వైరస్ మరణాల రేటుతో పశ్చిమ బెంగాల్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఆ రాష్ట్రంలో పర్యటించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం పేర్కొంది. సోమవారం కేంద్ర బృందం అధ్యక్షులు అపూర్వ చంద్ర.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. రెండు వారాల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించి కరోనా పరిస్థితులపై సమీక్షించిన కేంద్ర బృందం పట్ల ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించలేదని తెలిపారు. కరోనా కేసులపై ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్ బులిటెన్‌లోని కేసుల సంఖ్యకు, కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్న సంఖ్యకు పొంతన లేదని పేర్కొన్నారు. ( లాక్డౌన్ ఎఫెక్ట్ : పీఎంఐ రికార్డు కనిష్టం ) మరణాల రేటు ఎక్కువగా ఉండటాన్ని బట్టి, రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నట్లు అర్థమవుతోందని అన్నారు. కేసులను గుర్తించటంలోనూ, వాటిపై నిఘా పెట్టడంలోనూ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. కాగా, పశ్చిమ బెంగాల్లో ఇప్పటివరకు 922 కేసులు నమోదు కాగా, 33 మంది మృత్యువాత పడ్డారు. ( మందు బాబులపై పేలుతున్న జోకులు ) -
రహస్యంగా కేంద్ర బృందం పర్యటన
కర్నూలు(అగ్రికల్చర్): బీజీ–3 పత్తి విత్తనాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృంద సభ్యులు సోమవారం జిల్లాలో రహస్యంగా పర్యటించారు. విత్తన కంపెనీల ప్రతినిధులను కలవనీయకుండా, రైతులతో సమావేశాలు నిర్వహించకుండానే వీరి పర్యటన సాగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. నాగపూర్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ (సీఐసీఆర్) బయోటెక్నాలజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్, కేంద్ర వ్యవసాయశాఖ ప్లాంట్ ప్రొడక్షన్ జేడీఏ ఏఎన్ సింగ్, ఇతర ప్రముఖులు బాలకృష్ణ, ఎస్జే రహిమాన్, శ్రీవత్స, చక్రవర్తి, వీఎస్‌రెడ్డి, బాలసుబ్రమణి, ఎస్ఆర్ రావుతో పాటు జేడీఏ ఉమామహేశ్వరమ్మ, కమిషనరేట్ జేడీఏ రామరాజు, శాస్త్రవేత్తలు చెంగారెడ్డి, రామారెడ్డి, జయకృష్ణ జిల్లాలో పర్యటించారు. ముందుగా వ్యవసాయశాఖ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం కేంద్ర బృంద సభ్యులు.. రైతులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమై బీజీ–3 పత్తి విత్తనాలపై అభిప్రాయాలు సేకరించాల్సి ఉంది. ఇవేవీ లేకుండా పర్యటన ముగించారు. ఇదిలావుండగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మోన్‌శ్యాంటో కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ ఉన్నతాధికారే కేంద్ర బృందం ప్రతినిధులతో రైతులు, విత్తన మేనేజర్లు కలవకుండా అడ్డుపడినట్లు తెలుస్తోంది. విత్తన కంపెనీల ప్రతినిధులతో సమావేశమైతే వ్యవసాయ శాఖ ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీలు, దాడులతో పాటు బీజీ–3కి కేంద్ర అనుమతి లేదన్న విషయాన్ని గోప్యంగా ఉంచడంపై విరుచుకుపడే ప్రమాదం ఉందని, దీనివల్ల కేంద్రానికి వ్యతిరేక నివేదిక వెళ్లే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సమావేశం నిర్వహించకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. జిల్లాకు వచ్చిన కేంద్ర బృందంలో ఎనిమిది మంది ఉన్నతాధికారులు ఉన్నారు. వీరు ముందుగా కర్నూలులోని గౌతమీసీడ్స్, కర్నూలు సీడ్స్‌లో తనిఖీలు నిర్వహించారు. పత్తి విత్తనాలను కాకుండా పత్తి శ్యాంపిల్స్ సేకరించినట్లు సమాచారం. తర్వాత గూడూరు మండలంలోని పత్తి పొలాల్లోకి వెళ్లి ఆకులను సేకరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దొర్నిపాడు మండలంలోని వివిధ గ్రామాల్లో సాగైన బీజీ–2 పత్తి పంటను పరిశీలించి..ఆకులు, పత్తి, కాయల శ్యాంపిల్స్ తీసినట్లు తెలుస్తోంది. కేంద్ర బృందం పర్యటన గురించి వ్యవసాయ అధికారులను సంప్రదించగా.. ఎవరూ వరాలను వెల్లడించలేదు. కేంద్ర బృందం సభ్యులు మీడీయాకు సమాచారం ఇవ్వొద్దని చెప్పారంటూ కనీసం ఎక్కడెక్కడ పర్యటించిందీ వెల్లడించకపోవడం గమనార్హం. -
25 నుంచి ఉత్తరాంధ్రలో కేంద్ర బృందం పర్యటన
న్యూఢిల్లీ: ఈ నెల 25 నుంచి 27 వరకు ఉత్తరాంధ్రలో కేంద్ర బృందం పర్యటించనుంది. గత నెలలో సంభవించిన హుదూద్ తుపాను కారణంగా ఉత్తరాంధ్ర అతలాకుతలమైన విషయం తెలిసిందే. తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఈ బృందం పర్యటిస్తుంది. 9 మంది సభ్యులతో కూడిన ఈ బృందం రెండుగా విడిపోయి తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తుంది. తుపాను నష్టం అంచనాలను ఈ బృందం రూపొందిస్తుంది. **