breaking news
Cengareddi
-
ఎదుర్కొనే దమ్ములేక దౌర్జన్యాలు
నగరి, న్యూస్‌లైన్: మున్సిపల్ పరిధిలోని 27 వార్డుల్లో అభ్యర్థులను పోటీకి పెట్టే దమ్ము లేక తెలుగుదేశానికి బహిరంగంగా వత్తాసు పలుకుతూ మాజీ మంత్రి చెంగారెడ్డి దౌర్జన్యాలు చేయిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు ఆర్కే రోజా అన్నారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 3వ వార్డులో జరిగిన గొడవల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. మూడో వార్డులో పోలింగ్ జరుగుతుండగా ఆ వార్డుకు సంబంధంలేని కాంగ్రెస్ నాయకులు చిరంజీవిరెడ్డి, బాబురెడ్డి ఓట్లడగడం గొడవకు కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీ పోటీలో లేకపోయినా ఆ ప్రాంతానికి మాజీ మంత్రి చెంగారెడ్డి, ఆయన కుమార్తె రావడమే ఘర్షణకు దారి తీసిందన్నారు. రచ్చలు పెట్టడమే కాక పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆయన ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. చేతకాని కాంగ్రెస్ నాయకులు టీడీపీతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను తుంచేయాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది వారి తాతమ్మలు, జేజమ్మలు దిగివచ్చినా జరిగే పని కాదన్నారు. వైఎస్ఆర్ సీపీలో ఉన్నవారు రౌడీలని చెంగారెడ్డి చెబుతున్నారని, 35 సంవత్సరాలుగా ఆయన వెనుక పని చేసినపుడు రౌడీలని ఆయనకు తెలియలేదా అన్నారు. ఆయన ప్రవర్తన నచ్చక వచ్చినవారు వైఎస్ఆర్ సీపీలో ఉన్నారని, రౌడీలు ఆయన వెంటే ఉన్నారన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు వెంట ఉన్నారన్నారు. 3వ వార్డుపై ప్రత్యేకంగా కాంగ్రెస్, టీడీపీ దృష్టి సారించాయని, పలుమార్లు గొడవలకు కూడా లాగారన్నారు. పోలింగ్ రోజున కూడా గొడవలు జరిగే ఆస్కారముందని మూడు రోజులుగా పోలీసులకు చెబుతూనే ఉన్నామన్నారు. చివరకు ఊహించిందే జరిగిందన్నారు. మూడో వార్డు అభ్యర్థి కుమారుడు రామ్‌కుమార్‌కు గాయాలయ్యాయన్నారు. -
ఆనందం ఆవిరి
వెదురుకుప్పం, న్యూస్‌లైన్: వెదురుకుప్పం మండలంలోని కోణంగిపల్లెకు చెందిన లోకనాథరెడ్డి(40), రామిరెడ్డి(21), ఎర్రగుంటపల్లె వాసి చెంగారెడ్డి(60) తిరుమల రాజపురం సమీపంలో జరిగిన ఓ వివాహానికి శుక్రవారం రాత్రి హాజరయ్యారు. అనంతరం ద్విచక్ర వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. చెంగారెడ్డిని ఎర్రగుంటపల్లెలోని ఇంటి వద్ద వదిలేందుకు వెళుతుండగా ఏపీ 26డబ్ల్యూ 2040 నంబర్ గల సుమో ఢీకొంది. ఈ ప్రమాదంలో లోకనాథరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ చెంగారెడ్డి, రామిరెడ్డి తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. కార్వేటినగరం మండలం ఎర్రమరాజుపల్లె వాసి సుమో డ్రైవర్ గుణశేఖర్, నాగరాజు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో సుమో కాలువ వైపు దూసుకెళ్లి బోల్తా పడింది. ద్విచక్రవాహనం నుజ్జునుజ్జు అయింది. కోణంగిపల్లెలో విషాదఛాయలు ఒకే గ్రామానికి చెందిన లోకనాథరెడ్డి, రామిరెడ్డి రోడ్డు ప్రమాదం లో మృతి చెందడంతో కోణంగిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాలను ఓదార్చడం ఎవరి తరమూ కా లేదు. రామిరెడ్డికి రెండేళ్లక్రితం వివాహమైంది. ఓ కూతురు ఉంది.