మీ వివరాలు ఎవరికీ చెప్పొద్దు: సీసీపీహెచ్
అధిక విలువ కలిగిన నోట్ల రద్దు అనంతరం దేశంలో నగదు రహిత లావాదేవీల వినియోగం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు(సీసీపీహెచ్) నడుం బిగించారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. బ్యాంకు అధికారుల పేరుతో వచ్చే ఫోన్లలో అకౌంట్ల వివరాలు చెప్పొద్దని హెచ్చరించారు.