breaking news
CBI Officers inquiry
-
మృగాళ్ల వేటలో శివంగులు
కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసు ఇద్దరు మహిళా సీబీఐ అధికారులప్రవేశంతో వేగం అందుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు ‘పాలిగ్రాఫ్’ టెస్ట్ చేసేందుకు తాజాగా అనుమతి తీసుకున్నారు. హెచ్‌జి కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేయిస్తారనే వార్తలు అందుతున్నాయి. సంపత్ మీనా, సీమా పహుజా... ఈ ఆఫీసర్ల వైపే సుప్రీంకోర్టు కూడా చూస్తోంది. నేడు (గురువారం) ఇప్పటివరకూ ఛేదించిన విషయాలను సమర్పించమంది. సంపత్ మీనా, సీమా పహుజాల పరిచయం.అత్యంత పాశవిక ఘటనగా నమోదవడంతో పాటు, అత్యంత మిస్టరీగా మారిగా కోల్‌కతా జూనియర్ డాక్టర్ కేసును ఆగస్టు 13న కోల్కత్తా హైకోర్టు సీబీఐకి అప్పజెప్పింది. వెంటనే సీబీఐ ఈ కేసు ప్రాధాన్యం, స్వభావం దృష్టా ‘లేడీ సింగం’గా బిరుదు పొందిన సీబీఐ అడిషనల్ డైరెక్టర్ సంపత్ మీనాకు విచారణ బాధ్యత అప్పగించింది. ఆమెకు ప్రధాన సహాయకురాలిగా మరో సమర్థురాలైన సీబీఐ ఆఫీసర్ సీమా పహూజాను నియమించింది. మొత్తం 30 మంది సీబీఐ బృందంతో సంపత్ మీనా, సీమా పహుజా దుర్మార్గులను వేటాడుతున్నారు.ఇద్దరు అధికారులు ఏం చేశారు?జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం/హత్యను ఛేదించడానికి రంగంలో దిగిన సంపత్ మీనా, సీమా పహూజా తొలుత ప్రధాన నిందితుడైన సంజయ్ ఘోష్ వ్యవహారశైలిని పరిశీలించారు. అతడిని విచారిస్తున్న సమయంలో ప్రతిసారీ వాంగ్మూలాన్ని మార్చడం గమనించారు. ఏ రోజైతే రాత్రి ఘటన జరగబోతున్నదో ఆ ఉదయం సంజయ్ ఘోష్ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో అంటే ఐసీయూ ఎక్స్‌రే యూనిట్... ఇవన్నీ తిరిగినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. అతను అక్కడ ఎందుకు తిరిగాడనేది ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో బాధితురాలు ఎదురుపడి ఏదైనా వాదన చేసిందా తెలుసుకుంటున్నారు. లేదంటే రాత్రి జరగబోయే ఘటనను కుట్ర పన్నేందుకు వేరే ఎవరినైనా కలిశాడా అన్నది తేలుస్తున్నారు. ఇప్పటికే అతని మానసిక స్థితిని వారు అంచనా వేశారు. పాలిగ్రాఫ్ టెస్ట్ (ఒక విధమైన లై డిటెక్టర్ టెస్ట్) అలాగే బాధితురాలి అటాప్సీ రి΄ోర్టుతో పాటు ‘సైకాలజీ అటాప్సీ’ని కూడా అంచనా కడుతున్నారు. అంటే ఘటనకు ముందు బాధితురాలు ఎవరితో ఏం మాట్లాడింది, ఏదైనా వేదన/నిరసన వ్యక్తం చేసిందా, డైరీలో ఏమన్నా రాసుకుందా... వీటన్నింటి ఆధారంగా ఆమె సైకాలజీ అటాప్సీని నిర్థారిస్తారు. అలాగే కేసులో ముందు నుంచీ అనుమానాస్పదంగా ఉన్న మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పైన కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నట్టు వార్తలు అందుతున్నాయి. పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా చేసిన నిర్థారణలు సాక్ష్యాధారాలుగా కోర్టులో చెల్లక΄ోయినా కేసును ముందుకు తీసుకెళ్లడంలో సాయపడతాయి.సంపత్ మీనా1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సంపత్ మీనాది రాజస్థాన్‌లోని సవాయిమధోపూర్. జార్ఘండ్‌లో ఆమె వివిధ జిల్లాలకు ఎస్.పి.గా పని చేసింది. బి.పి.ఆర్ అండ్ డి (బ్యూరో ఆఫ్ ΄ోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్)లో పని చేసే సమయంలో ‘ఆపరేషన్ ముస్కాన్’ కింద ఆమె చైల్డ్ ట్రాఫికింగ్‌ను సమర్థంగా నిరోధించడంతో అందరి దృష్టిలో పడ్డారు. జార్ఖండ్‌లో 700 మంది పిల్లలను ఆమె వారి కుటుంబాలతో కలపగలిగారు. ఇక జార్ఖండ్‌లోని నక్సలైట్ప్రాంతాల్లో ఆమె సమర్థంగా నిర్వహించిన విధులు ఆమె సాహసాన్ని తెలియచేశాయి. దాంతో 2017లో ఆమె సీఐఐకి డెప్యూట్ అయ్యారు. అనతి కాలంలోనే అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఎక్కడ ఏ పదవిలో ఉన్నా మహిళా చైతన్యం కోసం మహిళల హక్కుల కోసం ఆమె ఎక్కువ శ్రద్ధ పెడతారనే గుర్తింపు ఉంది. అందుకే ఉన్నొవ్, హత్రాస్ ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఆమెకే కేసులను అప్పగించింది. సీమా పహుజా1993లో ఢిల్లీ ΄ోలీస్లో సబ్ ఇ¯Œ స్పెక్టర్‌గా రిక్రూట్ అయిన సీమా పహుజా సీబీఐలోని అవినీతి నిరోధక శాఖ స్పెషల్ క్రైమ్ యూనిట్లో చాలా సంవత్సరాలు పనిచేశారు. ఆమె ఇన్వెస్టిగేషనల్ స్కిల్స్ చూసి 2013లో డీఎస్పీగా పదోన్నతి ఇచ్చారు. మానవ అక్రమ రవాణా, మైనర్ బాలికలపై నేరాలకు సంబంధించిన అనేక కేసులను శోధించడంలో ఆమె దిట్ట. సిమ్లాలోని కొట్‌ఖైలో గుడియాపై అత్యాచారం, హత్య కేసును ఛేదించినందుకు సీమా పహుజా వార్తల్లో నిలిచారు. కుటుంబ బాధ్యతల కారణంగా రిటైర్మెంట్ తీసుకోవాలనుకుని ఆమె సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. అయితే అందుకు అధికారులు ఒప్పుకోలేదు. హత్రాస్ కేసులో సంపత్ మీనాతో పని చేసిన సీమా ఇప్పుడు కోల్‌కతా కేసులో కూడా ఆమెతో పని చేయనున్నారు. ఒక కేసు ఒప్పుకుంటే నేరస్తులను కటకటాల వెనక్కు తోసే వరకు నిద్ర΄ోదని సీమాకు పేరుంది. అందుకే ఆమెను ΄ోలీస్ మెడల్ కూడా వరించింది. కాబట్టి కోల్‌కతా కేసులో నేరగాళ్లను పట్టుకునే కర్తవ్యాన్ని ఈ మహిళా అధికారులిద్దరూ సమర్థంగా నిర్వర్తించి సమాజానికి సరైన సందేశాన్ని పంపిస్తారని ఆశిద్దాం. -
వివేకా హత్య కేసులో.. మారణాయుధాల కోసం గాలింపు
పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ఉపయోగించిన మారణాయుధాల కోసం సీబీఐ అధికారులు అన్వేషిస్తున్నారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న సునీల్‌యాదవ్ నుంచి సేకరించిన సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం ఈ గాలింపు చేపట్టారు. నిందితుణ్ణి వెంటబెట్టుకుని మూడు వాహనాల్లో పులివెందులలోని రోటరీపురం బ్రిడ్జి వద్దకు వారు చేరుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్మికులతో నీటిని తోడించే కార్యక్రమం చేపట్టారు. మురికినీరు ఎక్కువగా ఉండటంతో ఉల్లిమెల్ల చెరువు వద్ద గండి కొట్టించారు. రాత్రి వరకు గాలించినా ఆయుధాల జాడ లభించలేదు. చీకటి పడటంతో ఆదివారం ఉదయం మళ్లీ పనులు మొదలు పెట్టనున్నారు. -
కోల్‌కతా పోలీస్ బాస్‌ను విచారించిన సీబీఐ
షిల్లాంగ్: కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను సీబీఐ అధికారులు శనివారం విచారణ జరిపారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం ప్రారంభమైన విచారణ 9 గంటలపాటు కొనసాగింది. మధ్యలో విరామం సమయంలో బయటకు వచ్చిన ఆయన టీఎంసీ నేత, లాయర్ విశ్వజిత్ దేవ్, సీనియర్ ఐపీస్ అధికారులు జావెద్ షమీమ్, మురళీధర్ వర్మలతో మాట్లాడారు. శారదా చిట్‌ఫండ్ స్కాంకు చెందిన కీలక పత్రాల అదృశ్యంపై ఆదివారం రాజీవ్‌ను ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించి టీఎంసీ మాజీ ఎంపీ కునాల్ ఘోష్‌ను కూడా ఆదివారం విచారించనున్నట్లు సీబీఐ తెలిపింది. చిట్‌ఫండ్ కుంభకోణంపై మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఐపీఎస్ అధికారి రాజీవ్‌కుమార్ నేతృత్వం వహించారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు బాధ్యతలను చేపట్టిన సీబీఐ..కుంభకోణంలోని కీలక ఆధారాలు కనిపించకుండాపోయినట్లు గుర్తించింది. వాటిపై విచారణకు సీబీఐ యత్నించగా కుమార్ సహకరించలేదు. గత వారం కుమార్ ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులను పోలీసులు నిర్బంధించడం, సీఎం మమతా బెనర్జీ ఆందోళనకు దిగడం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తటస్థప్రాంతమైన షిల్లాంగ్‌లో సీబీఐ అధికారులు రాజీవ్‌కుమార్ నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఏఎంసీ కార్యదర్శిపై సీబీ‘ఐ’
సాక్షి ప్రతినిధి, ఏలూరు :పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు. చింతలపూడి మార్కెట్ యార్డు పరిధిలో ఈ ఏడాది మొదట్లో పత్తి విక్రయాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై మార్కెట్ కమిటీ సెక్రటరీ ఇన్చార్జి టీటీఎస్‌వీవీ నారాయణ ఇంటిపై మంగళవారం ఉదయం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. తాడేపల్లిగూడెంలోని ఆయన ఇంట్లో సోదాలు చేసిన అధికారులు పత్తి కొనుగోళ్ల పత్రాలను స్వాధీనం చేసుకుని ఆయన్ను విచారించినట్టు తెలిసింది. ఈ ఏడాది తొలినాళ్లలో పత్తి దిగుబడులకు గిట్టుబాటు ధర రాలేదు. దీంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాలను తెరిచింది. క్వింటాల్ పత్తికి రూ.4,500 వరకు గిట్టుబాటు ధర ప్రకటించింది. చింతలపూడి మార్కెట్ యార్డు అధికారులు, సీసీఐ సిబ్బంది, దళారులు కుమ్మక్కై తక్కువ ధరకే రైతుల నుంచి పత్తి కొనుగోలు చేశారు. క్వింటాల్‌కు రూ.3,600 చొప్పున మాత్రమే చెల్లించి ఎక్కువ ధరకు వ్యాపారులకు విక్రయించారు. పత్తిని యార్డుకు తీసుకురాకుండా నేరుగా వ్యాపారులకే విక్రయించేలా రైతుల్ని ప్రోత్సహించారు. రశీదుల్లో మాత్రం గిట్టుబాటు ధర చెల్లించనట్టు, విక్రయాలన్నీ దాదాపుగా యార్డులోనే జరిగినట్టు లెక్కలు తారుమారు చేశారు. కుకునూరు మార్కెట్ యార్డు కూడా చింతలపూడి పరిధిలోకి రాగా, పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు రైతుల నుంచి అందిన ఫిర్యాదులపై రంగంలోకి దిగిన సీబీఐ.. మార్కెట్ యార్డు సూపర్వైజర్లతో పాటు సీసీఐ బయ్యర్ల ఇళ్లను కూడా తనిఖీ చేసింది. ఆ క్రమంలోనే మార్కెట్ కమిటీ సెక్రటరీ ఇన్చార్జి నారాయణ ఇంటిపై దాడులు చేసినట్టు తెలుస్తోంది.