breaking news
cbi court
-
ఓబుళాపురం మైనింగ్ కేసు.. సబిత నిర్దోషి
సాక్షి, హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. గనుల శాఖ మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి కృపానందంలను నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మంగళవారం మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా తేల్చింది. ప్రధాన నిందితులైన ఓఎంసీ అప్పటి డైరెక్టర్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్, గాలి జనార్దనరెడ్డి పీఏ మెహఫూజ్ అలీఖాన్‌లను దోషులుగా నిర్ధారిస్తూ.. ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున,ఓఎంసీకి రూ.2 లక్షల జరిమానా విధించింది. రాజగోపాల్‌కు అవినీతి నిరోధక చట్టం కింద అదనంగా నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి ఐఏఎస్ అధికారి యర్రా శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు 2022లో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 2009లో కేసు నమోదు ఏపీ–కర్ణాటక సరిహద్దు అనంతపురం, బళ్లారి రిజర్వు ఫారెస్టులో ఓబుళాపురం గ్రామ పరిధిలోని ఇనుప గనుల తవ్వకాలను ఓఎంసీ నిర్వహించేంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టిందని 2009 డిసెంబరు 7న సీబీఐకి ఫిర్యాదు అందింది. అనుమతి పొందిన 68.5 హెక్టార్ల ప్రాంతాన్ని దాటి ఇనుప ఖనిజాన్ని తవి్వందని అందులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, వీడీ రాజగోపాల్, ఓఎంసీ, కృపానందం, సబితాఇంద్రారెడ్డి, గనుల శాఖ నాటి ఏడీ లింగారెడ్డి, శ్రీలక్ష్మిలపై అభియోగాలు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లతో పాటు కొందరిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు పెట్టింది. రూ.884.13 కోట్ల మేర అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని 2011లో సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. 2014 వరకు ఇలా నాలుగు చార్జిషీట్లు వేసింది. 60 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేశారని, బినామీ లావాదేవీలు జరిగాయని సీబీఐ పేర్కొంది. కాగా, కేసు విచారణ ఏళ్లకు ఏళ్లు పడుతుండడంతో సుప్రీంకోర్టు విచారణను పర్యవేక్షిస్తూ.. మే నెలలోగా పూర్తి చేయాలని గడువు విధించింది. ఇక 219 మంది సాక్షులను విచారించి, 3,330 డాక్యుమెంట్లను పరిశీలించిన సీబీఐ న్యాయస్థానం గత నెలలో తీర్పు రిజర్వు చేసింది. కాగా, లింగారెడ్డి విచారణ దశలోనే మృతి చెందారు. కోర్టుకు హాజరైన నిందితులు తీర్పు వెల్లడి సందర్భంగా కేసులో నిందితులు కోర్టుకు హాజరయ్యారు. ఈ నెల 18న తన కుమారుడి పెళ్లి ఉందని అప్పటివరకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని శ్రీనివాసరెడ్డి కోరారు. తాను ఎన్నో ప్రజాపయోగ కార్యక్రమాలు చేశానని, పేద కుటుంబం నుంచి వచ్చి వేలాదిమందికి ఉపాధి కల్పించానని గాలి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. కోర్టు తనను బళ్లారిలో అడుగుపెట్టొద్దని ఆదేశించినా, మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచానని తెలిపారు. ఉపశమనం కల్పిస్తే ఆధ్యాత్మిక పథంలో వెళ్తానని విన్నవించారు. ప్రభుత్య ఉద్యోగులందరినీ వదిలేసి తనను శిక్షించడం అన్యాయమని రాజగోపాల్ నివేదించారు. తనపై ఆధారపడి తల్లిదండ్రులు, నలుగురు పిల్లలు ఉన్నారని అలీ విజ్ఞప్తి చేశారు. సబితాఇంద్రారెడ్డి, కృపానందం కూడా కోర్టుకు హాజరయ్యారు. -
నీరవ్ మోదీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
సాక్షి, ముంబయి : పీఎన్బీ స్కామ్ కేసుకు సంబంధించి బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ, గీతాంజలి జెమ్స్‌కు చెందిన మొహుల్ చోక్సీలకు సీబీఐ కోర్టు ఆదివారం నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. తప్పుడు పత్రాలతో వీరు పీఎన్బీ నుంచి భారీ మొత్తంలో రుణాలు పొంది వాటిని దారిమళ్లించిన వ్యవహారం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో పీఎన్బీ ముంబయి బ్రాంచ్ అలహాబాద్, యాక్సిస్ బ్యాంక్ హాంకాంగ్ బ్రాంచ్‌లకు జారీచేసిన హామీ పత్రాల (ఎల్ఓయూ)పై నీరవ్ మోదీ ఇతరులు రూ 280.7 కోట్లు మోసపూరితంగా పొందినట్టు తేలడంతో ఈ భారీ స్కాం బయటపడింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం డైమండ్ ఆర్ యూఎస్, సోలార్ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్స్‌ల తరపున ఎల్ఓయూలు జారీ అయ్యాయి. కుంభకోణం వెలుగుచూసిన అనంతరం నీరవ్ మోదీ ఇతర నిందితులపై మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం (పీఎంఎల్ఏ) కింద కూడా కేసు నమోదైంది. -
తీర్పుపై బాబా రాందేవ్ స్పందన ఇలా...
న్యూఢిల్లీః అత్యాచారం కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించడంపై బాబా రామ్‌దేవ్ స్పందించారు. కోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. చట్టం నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరని ఈ తీర్పు ద్వారా న్యాయస్థానం విస్పష్టంగా చాటిందని అన్నారు. గుర్మీత్ సింగ్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి పదేళ్ల శిక్షను ఖరారు చేసిన విషయం విదితమే. తీర్పు నేపథ్యంలో అల్లర్లు చెలరేగకుండా హర్యానా, పంజాబ్, ఢిల్లీల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు సిర్సాలో గుర్మీత్ మద్దతుదారులు రెచ్చిపోయారు. రెండు కార్లను వారు దగ్ధం చేశారు. -
ఎవరి ప్రలోభాలకు లొంగలేదు..
ఢిల్లీ: హిందాల్కో బొగ్గు గనుల కేటాయింపు సందర్భంగా తాను ఎవరి ప్రలోభాలకు లొంగలేదని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన శుక్రవారం సీబీలో కోర్టులో తన స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. బొగ్గు గనుల కేటాయింపుకోనం తాను ఎవర్నీ ప్రభావితం చేయలేదని మన్మోహన్ సీబీఐ కోర్టుకు స్పష్టం చేశారు. కుమార మంగళం బిర్లాకు గనుల కేటాయింపు చేస్తానంటూ ఎవరికీ హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనికోసం బిర్లా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనకు లేఖలు రాశారని తెలిపారు. అయితే ఆ లేఖలను నిశిత పరిశీలన కోసం సంబంధిత శాఖలను పంపించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో తాను ఎక్కడా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని తెలిపారు. కాగా యూపీఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై కోల్ గోట్ స్కాం మన్మోహలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.