breaking news
CBI chief Ranjit Sinha
-
జాబితా ఇచ్చిందెవరో చెప్పాల్సిందే!
ప్రశాంత్ భూషణ్‌కు సీబీఐ చీఫ్ డిమాండ్ న్యూఢిల్లీ: తన నివాసానికి వచ్చి వెళ్లినవారి వివరాలుండే సందర్శకుల జాబితాను న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు అందజేసిన ‘ప్రజా వేగు’ ఎవరో బయటపెట్టాలని సీబీఐ చీఫ్ రంజిత్ సిన్హా డిమాండ్ చేశారు. ఆ ప్రజావేగు పేరు బయటపెట్టకుండా ఉండేందుకు కావాల్సిన రక్షణ తనకుందని భూషణ్ తప్పించుకోజాలరని అన్నారు. 2జీ కేసులో నిందితులు సీబీఐ చీఫ్‌తో ఆయన ఇంట్లో చాలాసార్లు సమావేశమయ్యారని, దీనికి సందర్శకుల జాబితాయే నిదర్శనమని, ఆయన్ను 2జీ కేసు నుంచి తప్పించాలని భూషణ్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్‌గా సుప్రీంకోర్టులో రంజిత్ సిన్హా శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేశారు. తన నివాస సందర్శకుల రిజిస్టర్ ఎక్కడి నుంచి సంపాదించారో చెప్పకుండా కేసును వాదించడం తన న్యాయవాదికి వీలుకాదన్నారు. ఆ ప్రజావేగుకు ఎవరినుంచైనా ప్రాణహాని ఉన్నప్పుడు మాత్రమే పేరు వెల్లడించకుండా ఉండే రక్షణ ఉంటుందని, ఈ కేసులో ఆ పరిస్థితి లేద న్నారు. ‘ప్రైవసీ గురించి మాట్లాడలేరు’ కాగా, ఒక ప్రభుత్వ అధికారి అన్నివేళల్లో ప్రైవసీ హక్కు గురించి మాట్లాడటం కుదరదని సుప్రీంకోర్టు మాజీ జడ్జి జీఎస్ సింఘ్వీ అన్నారు. తన ఇంటి సందర్శకుల వ్యవహారంపై రంజిత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించారు. -
'రేప్ వ్యాఖ్యలకు' సీబీఐ చీఫ్ సారీ
బెట్టింగ్‌ను అత్యాచారంతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా బుధవారం విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే క్షమించాలని అన్నారు. తనకు మహిళలలంటే అపార గౌరమని సిన్హా పేర్కొన్నారు. లింగ వివక్షతో మహిళలను కించపరిచాలన్నది తన ఉద్దేశంకాదని వివరణ ఇచ్చారు. క్రీడల్లో బెట్టింగ్ గురించి సిన్హా మంగళవారం మాట్లాడుతూ.. బెట్టింగ్‌ను అనుమతించడం వల్ల నష్టమేంటని వ్యాఖ్యానించారు. 'బెట్టింగ్‌పై నిషేధాన్ని అమలు చేయలేకపోవడమంటే.. అత్యాచారాలను అడ్డుకోలేం ఆస్వాదించండి అని చెప్పడమే' అని సిన్హా అన్నారు. సిన్హా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని పలు మహిళా సంఘాలు, వక్తలు డిమాండ్ చేశారు. దీంతో సీబీఐ చీఫ్ దిద్దుబాటు చర్యలో భాగంగా క్షమాపణలు చెప్పారు.