breaking news
Cattle insurance
-
వైఎస్సార్ పశు బీమా.. రైతులకు ధీమా!
సాక్షి, అమరావతి: విపత్తులు, కరువు కాటకా లు, రోడ్డు, రైలు ప్రమాదాలు, విద్యుద్ఘాతా లతో ఏటా వేలాది మూగ, సన్నజీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీటిని కన్నబిడ్డల్లా సాకే యజమానుల బాధ వర్ణణాతీతం. తమ కుటుంబ పోషణకు వీటిపైనే ఆధారపడి జీవించేవారు ఆ జీవాలు మరణిస్తే తల్లడిల్లిపోతారు. ఈ నేపథ్యంలో వివిధ ఘటనల్లో మూగ జీవాలను కోల్పోతున్నవారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వైఎస్సార్ పశు బీమా పథకం ద్వారా వారికి అండగా నిలవ నుంది. ఈ మేరకు పశు సంవర్ధక శాఖ ప్రతిపా దనలను రూపొందిస్తోంది. అక్టోబర్ నెలాఖరు లో శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం కార్యాచ రణ సిద్ధం చేస్తోంది. పశువులు, మేకలు, గొర్రెలకు బీమాను వర్తింపజేయనుంది. చదవండి: దేవకి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం: సీఎం జగన్ మరింత మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో.. వివిధ ఘటనల్లో తమ పశువులు, సన్నజీవాలను కోల్పోతున్నవారిని ఆదుకోవడానికి ఇప్పటివరకు ప్రభుత్వపరంగా బీమా పథకం అంటూ ఏమీలేదు. గతంలో బీమా పథకాలపై కాస్త అవగాహన ఉన్నవారు, ఆర్థిక స్థోమత కలిగినవారు మాత్రమే సొంతంగా తమ జీవాలకు బీమా చేయించుకునే వారు. అవి చనిపోయినæ ఏడాదికో రెండేళ్లకో.. అదీ బీమా కంపెనీల చుట్టూ చెప్పులరిగేలా తిరిగితే కానీ అరకొరగా పరిహారం దక్కేది కాదు. నూటికి 95 శాతం మంది అవగాహన లేక, ఆర్థికభారం కారణంగా బీమాకు దూరంగా ఉండేవారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా వైఎస్సార్ పశు నష్టపరిహారం కింద 1.12 లక్షల జీవాలకు రూ.58.02 కోట్ల పరిహారం అందించింది. ఇప్పుడు మరింత మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో వైఎస్సార్ పశు బీమా పథకాన్ని తీసుకొస్తోంది. 50 జీవాలకు గరిష్టంగా రూ.3 లక్షల వరకు.. వైఎస్సార్ పశు బీమా పథకం కింద నాటు ఆవులు, గేదెలకు రూ.15 వేలు, మేలు జాతి గేదెలు, ఆవులకు రూ.30 వేల చొప్పున, సన్న జీవాలకు ఒక్కో దానికి రూ.6 వేలు చొప్పున పరిహారం ఇస్తారు. ఏడాదిలో ఒక రైతుకు గరిష్టంగా ఐదు పశువులకు మాత్రమే బీమా వర్తిస్తుంది. గతంలో ఏదైనా విపత్తు బారినపడి చనిపోతే ఒక్కో కుటుంబం పరిధిలో 20 సన్నజీవాలకు రూ.1.20 లక్షలకు మించకుండా పరిహారం చెల్లించేవారు. ఇప్పుడు దాన్ని 50 జీవాలకు గరిష్టంగా రూ.3 లక్షల వరకు పరిహారం పొందేలా విస్తరిస్తున్నారు. గతంలో మూడు అంతకంటే ఎక్కువ సంఖ్యలో మర ణిస్తేనే సన్నజీవాలకు పరిహారం ఇచ్చేవారు. ఇక నుంచి ఒక్క జీవి మరణించినా పరిహారం అందిస్త్రాు. అంతేకాదు తొలిసారి ఎద్దులు, దున్నపోతులతో పాటు కరువు బారిన పడిన పశువులకు కూడా బీమా వర్తింప చేయను న్నారు. అలాగే క్లైమ్ సెటిల్మెంట్లో జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పరిహారం చెల్లిం చేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మూగ, సన్నజీవాలకు పూర్తి స్థాయిలో బీమా కల్పించే లక్ష్యంతో వైఎస్సార్ పశు బీమా పథకాన్ని తెస్తు న్నాం. రాష్ట్రంలోని ప్రతి పాడి పశువుతో పాటు మూగ జీవాలు, మేకలు, గొర్రెలు, పొట్టేళ్లకు కూడా బీమా కల్పిం చాలని సంకల్పించాం. ఇందుకోసం ప్రభుత్వం 80 శాతం ప్రీమియం భరి స్తోంది. ఈ పథకం కోసం మార్గదర్శ కాలు రూపొందిస్తున్నాం. అక్టోబర్ నెలాఖరులో ఈ పథకానికి శ్రీకారం చుట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. –డాక్టర్ ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ మొత్తం ప్రీమియంలో 80 శాతం ప్రభుత్వానిదే.. వైఎస్సార్ పశు బీమా పథకం కింద చెల్లించే మొత్తం ప్రీమియంలో 80 శాతాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. 20 శాతం మాత్రమే సన్న, చిన్నకారు రైతులు భరించాల్సి ఉంటుంది. దేశీయ ఆవులు, గేదెలకు ఒక్కోదానికి ప్రభుత్వం రూ.924 ప్రీమియం భరిస్తుండగా, లబ్ధిదారులు రూ.231, ఎద్దులు, దున్నపోతులకు ప్రభుత్వం ఒక్కోదానికి రూ.578 భరిస్తుండగా, లబ్ధిదారులు రూ.116, మేకలు, గొర్రెలకు ప్రభుత్వం ఒక్కోదానికి రూ.185 భరిస్తుండగా, లబ్ధిదారులు రూ.46 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద రైతుల తరఫున 80 శాతం ప్రీమియం రూపంలో ఏటా సుమారు రూ.110 కోట్లు వరకు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం ద్వారా రైతులకు బాసటగా నిలిచే సిబ్బందికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని సంకల్పించింది. బీమా చేయించినందుకు రూ.50, పోస్టుమార్టంకు రూ.125 చొప్పున ఇవ్వనుంది. -
గేదెలకు బీమా.. యజమానులకు ధీమా
లక్సెట్టిపేట : పశువులకు బీమా చేయించడం ద్వారా పాడి పశువులపై ఆధారపడి జీవనోపా ధి పొందుతున్న వారికి లాభదాయకంగా ఉం టుంది. వ్యాధులు, విద్యుదాఘాతం, ప్రమాదాల్లో పశువులు మృత్యువాతపడుతున్నాయి. దీంతో యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించి ప శువులకూ బీమా సౌకర్యం కల్పించిందని జి ల్లా పశు వైద్యాధికారి నర్సయ్య వివరించారు. గత సంవత్సరం 16 కేసులు నమోదు కాగా వాటికి ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేయించాం. గేదెలకు.. పాడిపరిశ్రమపై శ్రద్ధ ఉన్నవారికి ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతూ వారికి అనుకూలంగా బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. టీఎస్ఎల్ఎస్డీఏ(తెలంగాణ స్టేట్ లైఫ్ స్టాక్ డెవలప్మెంటు ఏజెన్సీ) పేరుతో ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో డీఎల్ఎస్డీఏ(డిస్ట్రిక్ట్ లైఫ్ స్టాక్ డెవలప్మెంటు ఏజెన్సీ) న్యూఇండియా ఇన్స్యూరెన్స్ పేరుతో జిల్లాలోని పశువులకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రతీ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మండల పశువైద్య కేంద్ర సిబ్బంది వద్ద దరఖాస్తులు లభిస్తాయి. రైతులు వాటిని పూర్తి చేసి పంపిస్తే మిగితా వివరాలు వైద్యాధికారులు తెలియజేస్తారు. ప్రీమియం చెల్లించే విధానం.. పశువుల్లో గేదెలకు మాత్రమే బీమా వర్తిస్తుంది. రూ.1,550 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో సబ్సిడీపై డీఎల్ఎస్డీఏ 50శాతం భరిస్తుంది. అంటే యజమాని రూ.775 చెల్లిస్తే మూడేళ్ల వరకు బీమా పొందే అవకాశం లభిస్తుంది. పాలు ఇచ్చే గేదెలకు మాత్రమే బీమా వర్తిస్తుంది. బీమా ప్రీమియం చెల్లించిన తర్వాత ఇన్స్యూరెన్స్ సిబ్బంది పశువును పరిశీలించి వాటి చెవులకు ఒక ట్యాగ్ వేస్తారు. అప్పటి నుంచి బీమా వర్తిస్తుంది. పొందే విధానం.. గేదెలకు బీమా చేయించడం ద్వారా అవి మరణించినప్పుడు వాటి విలువను బట్టి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు బీమా కంపె నీ వారు నిర్ణయించి చెల్లిస్తారు. దీంతోపాటు యజమాని మరణిస్తే రూ.50వేలు బీమా మొత్తాన్ని కుటుంబానికి అందజేస్తారు. ఒక యజమాని ఇంటి నుంచి కేవలం రెండు పశువులకు మాత్రమే బీమా సౌకర్యం పొందే అవకాశం ఉంటుంది. బీమా సిబ్బంది వచ్చి పశువు ట్యాగ్, యజమానితో కూడిన ఫొటోను పరిశీలించి బీమా మంజూరు చేస్తారు.