breaking news
catalogue
-
పట్టుచీర! ఏది అసలు? ఏది నకిలీ?..ఇలా గుర్తించండి!
శుభకార్యం ఏదైనా వధూవరులు, మహిళలు, పురుషులు, పిల్లలు అని తేడా లేకుండా అందరూ పట్టు వస్త్రాలను ధరించడం సాంప్రదాయంగా భావిస్తారు. పట్టు వస్త్రాలు ధరించడం వల్ల హుందాతనం, అందం ఉట్టిపడుతుంది. దీంతో మార్కెట్లో పట్టు వస్త్రాలకు మంచి ధర, డిమాండ్ ఉంది. వస్త్ర దుకాణాల్లో లైట్ల వెలుగులో పట్టు వస్త్రాలు దగదగా మెరుస్తుంటాయి. కానీ, అందులో ఏది అసలు, ఏది నకిలీ పట్టు వస్త్రమనేది వినియోగదారులు కనిపెట్టడం చాలా కష్టం. వస్త్ర దుకాణాదారులు కూడా వినియోగదారుడిని బురిడీ కొట్టించే అవకాశాలు లేకపోలేదు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ స్వచ్చమైన పట్టు వస్త్రాలకు క్యూఆర్ బార్‌కోడ్‌తో కూడిన సిల్క్ మార్క్, మగ్గంపై నేసిన వస్త్రాలకైతే హ్యాండ్లూమ్ మార్క్‌ను అందజేస్తుంది. సిల్క్ మార్క్, హ్యాండ్లూమ్ మార్క్ లేబుల్ ఉన్నట్లయితే అది స్వచ్చమైనదిగా గుర్తించవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకొన్న వస్త్ర వ్యాపారులకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి లోగోలను అందజేస్తారు. పట్టులో పలు రకాలు.. పట్టులో అనేక రకాలున్నాయి. అందులో సహజసిద్ధమైన మల్బరీ సిల్క్‌ను ‘క్వీన్ ఆఫ్ టెక్స్టైల్’గా పిలుస్తారు. ఇది మల్బరీ పట్టు పురుగైన బాంబేక్స్ మోరె నుంచి తయారవుతుంది. ఇది చాలా ఖరీదైనది. ప్రపంచ వ్యాప్తంగా దీనిని 90 శాతం వినియోగిస్తున్నారు. పోచంపల్లి ఇక్కత్ పట్టు వస్త్రాలన్నీ మల్బరీ పట్టుతోనే తయారవుతున్నాయి. ‘టస్సార్ సిల్క్’ కాపర్రంగులో ఉంటుంది. అడవుల్లో ఉండే పట్టు పురుగుల నుంచి తయారు చేస్తారు. టస్సార్ పట్టును ఎక్కువగా హోం ఫర్నీషింగ్, ఇంటీరియర్ డెకరేషన్లో వినియోగిస్తారు. ఇందీ పట్టు పరుగుల నుంచి ‘ఈరీ సిల్క్’ తయారవుతుంది. ఈరీ పట్టును కాటన్, ఉన్ని, జనపనారతో కలిపి ఫ్యాషన్, ఇతర అస్సెస్సరీస్, హోం ఫర్నీషింగ్ తయారు చేస్తారు. ‘ముంగా పట్టు’ బంగారు వర్ణంలో ఉంటుంది. దీనిని తయారు చేసే పట్టు పురుగులు అడవుల్లో ఉంటూ సోమ్ అండ్ సోఆలు అనే చెట్ల ఆకులను తింటాయి. అసలైన పట్టును ఇలా గుర్తించవచ్చు.. పట్టు పోగుని వెలిగించినప్పుడు నిరంతరంగా కాలకుండా ఆరిపోతుంది. పట్టు కాలినప్పుడు వెంట్రుకలు, ఈకలు కాలిన వాసన వస్తుంది. పోగు కొనలో చిన్న నల్లపూసలా మారుతుంది. పూసను నలిపినప్పుడు పొడి అయ్యి పోగు గరుకుగా మారుతుంది. పట్టు వస్త్రాలను ఎల్లప్పుడు సిల్క్‌మార్క్ అధీకృత షాపుల్లోనే కొనాలి. పట్టు వస్త్రాలకు ఉన్న సిల్క్‌మార్క్ లేబుల్ 100 శాతం పట్టు ప్రామాణికతను సూచిస్తుంది. పట్టు వస్త్రాలని సిల్క్‌మార్క్ వారిచే ఉచితంగా పరీక్షింప జేసుకోవచ్చు. స్వచ్ఛమైన పట్టు వస్త్రాలకు క్యూఆర్ బార్‌కోడ్‌తో కూడిన సిల్క్ మార్క్ ఉంటుంది. మగ్గంపై నేసిన పట్టుకు హ్యాండ్లూమ్ మార్క్ ఉంటుంది. ఇవి చదవండి: బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి సీతమ్మ స్పెషల్ చీరల్లో.. వాటి ప్రత్యేకత ఇదే! -
నదులను కాపాడే సీతాకోకచిలుకలు!
రంగు రంగు రెక్కలతో.. హరివిల్లును తలపిస్తూ...పచ్చని చెట్లపై ఎగిరే అందమైన సీతాకోక చిలుకలు.. చూపరులకు కనువిందు చేస్తాయి. మొక్కలపై వాలి.. వాటి పూల పుప్పొడితో ఆ జాతి అభివృద్ధికి దోహద పడతాయి. ఇప్పటికే సీతాకోకచిలుకలు ప్రపంచంలోని అనేక ఇతర జీవుల కన్నా శక్తివంతమైనవిగా గుర్తించబడ్డాయి. ప్రస్తుతం నదులను కాపాడ్డంలోనూ, అడవుల ఆరోగ్యాన్ని రక్షించడంలోనూ ఈ కీటకాలు సహాయపడతాయంటున్నారు పరిశోధకులు. సుమారు ఆరు దశాబ్దాలుగా సీతాకోక చిలుకల సమగ్ర జాబితాను తయారు చేస్తున్నారు సైంటిస్టులు. ఉత్తరాఖండ్ నైనిటాట్ జిల్లా భిట్మాల్ లోని బట్టర్ ఫ్లై రీసెర్చ్ సెంటర్ కు చెందిన శాస్త్రవేత్త స్మెటాసెక్...ఏళ్ళ తరబడి సీతాకోకచిలుకల సంగ్రహణకు పాటుపడుతూనే వాటి కొత్త జాబితానూ రూపొందిస్తున్నారు. స్మెటాసెక్... తన పరిశోధనల్లో భారతదేశ వ్యాప్తంగా 1,318 రకాల సీతాకోక చిలుకల జాతులు ఉన్నట్లుగా కనుగొన్నారు. సంవత్సరాల కాలం సీతాకోకచిలుకల సంగ్రహణలోనే గడిపిన స్మెటాసెక్... వాటిని పత్రబద్ధం చేయడమే కాక, అవి ఇండియాలోని నదులను కాపాడేందుకు ఎంతగానో సహకరిస్తాయని చెప్తున్నారు. క్రిమి కీటకాలను ఉపయోగించి అడవుల ఆరోగ్య పరిరక్షణ గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రతయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సీతాకోక చిలుకల జాబితాను సేకరిస్తున్నామని, అవి ఎక్కడ ఏ రకంగా ఉన్నాయో తెలిస్తే.. వాటి జాతుల వర్గీకరణను స్పష్టం చేయవచ్చని, ఆపై అడవుల ఆరోగ్యాన్ని కనిపెట్టవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. అందుకే ముందుగా వాటి జాబితాను సిద్ధం చేస్తున్నారు. భారత దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన జాతులు ఉన్నట్లుగా కనుగొన్నామని, ముఖ్యంగా నదీ ప్రాంతాల్లో ఉన్న సీతాకోక చిలుకలు నీటి ఆరోగ్యాన్ని పెంపొందించేవిగా ఉన్నాయని సైంటిస్ట్ స్మెటాసెక్ చెప్తున్నారు. నిజానికి అటవీశాఖ వారు అడవుల్లోని క్రిమి కీటకాలు, పక్షులు, ఇతర జాతుల వివరాలను సేకరించడం, వాటి లెక్కలను తెలపడంవల్ల నదీతీరాల్లోని అడవుల ఆరోగ్యం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని సీతాకోక చిలుకల నిపుణులు అంటున్నారు. వాటి జన్మ స్థలాన్ని బట్టి అక్కడి పర్యావరణ సమాచారం ఆధారంగా జల భద్రతను నిర్థారించేందుకు, నదీ ప్రవాహం స్థిరీకరించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్తున్నారు. సీనాకోక చిలుకలు.. మొక్కల పరపరాగ సంపర్కానికి మాత్రమే కాక... కప్పలు, కందిరీగలు, పక్షులు, పలు రకాల కీటకాలకు, ఇతర జాతులకు ఆహారాన్ని అందించడంలోనూ ఉపయోగపడతాయట. స్వాతంత్ర్యానంతరం భారత దేశంలో ప్రత్యేకంగా ఓ సీతాకోక చిలుకల జాబితా తయారు చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్, ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో ఎటువంటి జాతులు ఉన్నాయనేది ఎవ్వరూ తెలుసుకోలేదు. ప్రస్తుతం ఇండియాలో సైంటిస్ట్ స్మెటాసెక్ తో పాటు, జూలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఆర్కే వర్స్ నే... అటువంటి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇండియాలోని కేరళ, కర్నాటక ప్రాంతాల్లో మాత్రమే వైవిధ్యంగా కనిపించే ట్రావెన్కోర్ ఈవెనింగ్ బ్రౌన్ సీతాకోకచిలుకలు ఉన్నాయని, అంతరించిపోతున్న ఇటువంటి జాతికి సమీపంగా కనిపించే కొన్ని జాతులు దక్షిణ ఆమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. రక్షిత ప్రాంతాల్లో ఇటువంటి జాతులు ఉండటం ఎంతో అదృష్టమని స్మెటాసెక్ తెలిపారు.